ఖోస్రో మరియు షిరిన్ అనేది పర్షియన్ కవి
నిజామీ గంజావి (1141–1209)
యొక్క ప్రసిద్ధ విషాద శృంగార కథ. నిజామీ గంజావి “లైలా మరియు మజ్నున్”
లను కూడా వ్రాసాడు.
ఖోస్రో మరియు షిరిన్ అనేది పర్షియా
రాణిగా మారిన అర్మేనియన్ యువరాణి షిరిన్, ససానియన్ రాజు ఖోస్రో యొక్క ప్రేమ కథ. ఖోస్రో
మరియు షిరిన్ కథ అత్యంత విస్తృతమైన కల్పిత
సంస్కరణలకు లోను అయ్యింది. ముఖ్యమైన కథనం మాత్రం పెర్షియన్ మూలానికి చెందిన ప్రేమకథ, ఇది ఇతర పర్షియన్ రచయితలు మరియు
ప్రసిద్ధ కథలకు బాగా తెలుసు
ఖోస్రో మరియు షిరిన్ కథ యొక్క
రూపాంతరాలు "షిరిన్ మరియు ఫర్హాద్" పేరుతో కూడా చెప్పబడ్డాయి.
షిరిన్ మరియు ఫర్హాద్ కథను పెర్షియన్
కవి నిజామీ గంజావి చిరస్థాయిగా నిలిపారు. షిరిన్ మరియు ఫర్హాద్ కథ లలిత కళలు,
రంగస్థలం,
చలనచిత్రం
మరియు జానపద కథలకు సంబంధించిన వివిధ సాహిత్య మరియు సాంస్కృతిక సంప్రదాయాలలో
విభిన్న సంస్కరణలను పొందింది.
షిరిన్-ఫర్హాద్
కథలో అనేక వైవిధ్యాలు/రుపా౦తరాలు ఉన్నాయి.
కొంతమంది ఫర్హాద్ ను ఆర్మీ కమాండర్‌గా
చిత్రీకరిస్తున్నారు. షిరిన్ క్లాస్ తేడా ఉన్నప్పటికీ ఫర్హాద్‌తో ప్రేమలో పడిందని
కొన్ని వెర్షన్‌లు చెబుతున్నాయి మరియు ఫర్హాద్ తన కుమార్తెను వివాహం
చేసుకోవడానికి అనుమతించే ముందు షిరిన్ తండ్రి పర్వతం గుండా మెట్లు చెక్కాలని షరతు విధించాడు.
ఫర్హాద్ అనేది పెర్షియన్ సాహిత్యం మరియు
పెర్షియన్ పురాణాలలో ఒక ప్రసిద్ధ పాత్ర. షిరిన్‌తో ఫర్హాద్ ప్రేమ కథ పెర్షియన్
సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ ప్రేమ కథలలో ఒకటి.
పెర్షియన్ కవి నెజామి గంజావి రచించిన
ఖోస్రో మరియు షిరిన్ అతి ముఖ్యమైన రచన, అయితే ఈ కథ నెజామికి చాలా కాలం ముందు
పర్షియన్ సాహిత్యంలో బాగా ప్రసిద్ది చెందింది.
ఫెర్దౌసీ ఖోస్రో మరియు షిరిన్ కథను కూడా
వివరించాడు, కానీ ఫెర్దౌసీ వెర్షన్‌లో ఫర్హాద్ చిన్న పాత్ర మాత్రమే పోషిస్తాడు.
ఫర్హాద్ కథకు పార్థియన్ మూలాలు ఉన్నాయి.
కొంతమంది రచయితలు ఫర్హాద్‌ను కయానియన్ వ్యక్తిగా సూచిస్తారు.
ఫర్హాద్‌ను ససానియన్ వ్యక్తిగా సూచించిన
మొదటి రచయితలలో బాలమీ ఒకరు
ఫర్హాద్ కథ- ఒక రూపాంతరం:
ఫర్హాద్ ఒక శిల్పి. ఫర్హాద్
పెర్షియన్ అర్మేనియా యువరాణి షిరిన్‌తో ప్రేమలో పడతాడు. అయితే షిరిన్ అప్పటికే
పర్షియా రాజు ఖోస్రో పర్విజ్‌తో ప్రేమలో ఉంది. ఖోస్రో ఫర్హాద్‌ను ఒక పర్వతంలో
మెట్లు చెక్కమని అడుగుతాడు మరియు ఫర్హాద్ అలా చేస్తే, ఖోస్రో
షిరిన్‌ను వదులుకుంటానని చెప్పాడు షిరిన్‌ని పెళ్లి చేసుకుంటాను అనే ఆశతో ఫర్హాద్ రాత్రి పగలు కష్టపడి
ప్రయత్నిస్తాడు. చివరగా, ఫర్హాద్ మెట్లను నిర్మిస్తాడు, కానీ
ఖోస్రో షిరిన్ చనిపోయిందని ఫర్హాద్‌కు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఫర్హాద్ ఈ
అబద్ధాన్ని నమ్మి పర్వతం మీద నుండి దూకి చనిపోయాడు.
మరొక రూపాంతరం:
షిరిన్ ఒక అర్మేనియన్ రాజు కుమార్తె.
షిరిన్ అత్యంత సౌ౦దర్యవంతి. పర్షియా రాజు ఖుస్రూ, షిరిన్ తో ప్రేమలో పడ్డాడు. ఖుస్రూ తన దూతను
షిరిన్ వద్దకు పెళ్లి ప్రతిపాదనతో పంపాడు. పర్షియన్ ప్రజల ప్రయోజనం కోసం పర్వతాల
గుండా నదిని చేరాలంటే మెట్లు చేక్కలనే చాలా కష్టమైన షరతుతో షిరిన్ పెళ్లి
ప్రతిపాదనను అంగీకరించింది, ఖుస్రూ ఇది దాదాపు అసాధ్యమైనప్పటికీ,
షరతును
అంగీకరించాడు. ఖుస్రూ, కష్టమైన ఈ పనిని ఫర్హాద్ అనే శిల్పికి అప్పగించాడు.
ఈ పనిని ఫర్హాద్‌కు అప్పగించిన తర్వాత,
ఖుస్రూ
షిరిన్‌తో వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఖుస్రూ ఒక రోజు ఫర్హాద్‌ను పిలిచి,
ఫర్హాద్ ను షిరిన్‌కు
పరిచయం చేశాడు. షిరిన్‌ను చూడగానే ఫర్హాద్, షిరిన్ అందానికి బానిస అయ్యాడు. ఫర్హాద్ తన పనిని చేసేటప్పుడు కూడా షిరిన్ ఆలోచనలతో
పూర్తిగా మునిగిపోయాడు.
ఒక రోజు, షిరిన్,
ఫర్హాద్ యొక్క పని పురోగతిని పరిశీలించడానికి వచ్చినప్పుడు,
ఫర్హాద్
తనను తాను నియంత్రించుకోలేకపోయాడు మరియు షిరిన్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. షిరిన్, ఫర్హాద్ ను మందలించి కోపంతో వెళ్లిపోయింది.
ఫర్హాద్ మాత్రం షిరిన్ కోరుకున్నట్లు మెట్లు
చెక్కడం కొనసాగించినాడు.
ఫర్హాద్, షిరిన్ఆలోచనలతో నిరంతరం
నిమగ్నమై ఉన్నందున, ఫర్హాద్, ఒకరోజు షిరిన్ పట్ల తనకున్న ప్రేమ
గురించి ఖుస్రూకు చెప్పాడు. కోపోద్రిక్తుడైన ఖుస్రూ ఫర్హాద్ ని తన కరవాలం తో చంపాలనుకొన్నాడు కాని ఖుస్రూ మంత్రి అలా చేయకుండా అడ్డుకున్నాడు.
మంత్రి ఒక దుష్టపథకం ఆలోచించాడు. ఫర్హాద్ ఎప్పటికీ నదిని తవ్వలేడని తెలుసుకున్న
ఖుస్రూ మంత్రి ఫర్హాద్ తనకు అప్పగించిన పనిని నిజంగా నెరవేర్చగలిగితే షిరిన్‌ను ఫర్హాద్
కి ఇచ్చి వివాహం చేయిస్తానని చెప్పాడు.
ఫర్హాద్ ఖుస్రూ మంత్రి మాటను
అంగీకరించాడు మరియు మునుపటి కంటే ఎక్కువ శక్తితో మరియు ఉత్సాహంతో తన పనిని పూర్తి
చేశాడు. ఇంతలో, షిరిన్, ఫర్హాద్ పట్ల ప్రేమ చూపసాగింది.
మెట్లు చెక్కడం పూర్తి కాబోతోందని ఖుస్రూ
గుర్తించినప్పుడు, ఖుస్రూ తానూ షిరిన్‌ను కోల్పోతానని ఆందోళన చెందాడు. షిరిన్ ఆత్మహత్య చేసుకుందని
ఫర్హాద్‌కు మోసం తో తెలిపాడు. దీనిని ఫర్హాద్
భరించలేకపోయాడు. హృదయ విదారకమైన ఈ వార్తను
తట్టుకోలేక ఫర్హాద్ తన తలను రాళ్లతో
కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ భయంకరమైన వార్త తెలుసుకున్న షిరిన్,
ఫర్హాద్
చనిపోయిన ప్రదేశానికి చేరుకుంది. ఖుస్రూ యొక్క దుష్ట ప్రణాళిక గురించి షిరిన్
తెలుసుకున్నప్పుడు,
షిరిన్
తిరిగి రాజభవనానికి వెళ్లడానికి నిరాకరించింది మరియు ఫర్హాద్ పాదాలపై పడి చనిపోయింది.
షిరిన్, ఫర్హాద్ కథ చలన
చిత్రాలు:
షిరిన్ కథ భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్ మరియు టర్కీలలో చలనచిత్రం మరియు
నాటకం రూపం లో ప్రదర్సించబడినది.
షిరిన్ ఫర్హాద్ 1931 హిందీ భాషా సంగీత
చిత్రం. ఇది ధ్వనితో కూడిన రెండవ భారతీయ చిత్రం. ఇది నిజామీ గంజావి రచించిన
ఫర్హాద్ మరియు షిరిన్‌ల షహనామె ప్రేమకథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రానికి
జె.జె. మదన్ మరియు నిస్సార్ మరియు జెహనారా కజ్జన్ నటించారు. ఆలం అరా అదే సంవత్సరం
ప్రారంభంలో విడుదలైంది మరియు ధ్వనితో కూడిన మొదటి భారతీయ చిత్రం.
షానామెహ్ నుండి ఖోస్రో మరియు షిరిన్
ఆధారంగా “షిరిన్ ఫర్హాద్” 1956లో
విడుదలైన భారతీయ హిందుస్థానీ-భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం,
ఆస్పి
ఇరానీ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఇందులో తలత్ మెహమూద్,
rరఫీ, లతా మంగేష్కర్ పాటలు ఉన్నాయి.
యువరాణి షిరిన్ గా మధుబాల) ఫర్హాద్ గా ప్రదీప్
కుమార్, షాహెన్‌షా ఖుస్రోగా పి. కైలాష్ నటించారు.
1970ల నాటి పాకిస్థానీ వెర్షన్‌లో మహమ్మద్ అలీ మరియు జెబా నటించారు మరియు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ సంగీతం అందించారు (ఇందులో బాగా పాపులర్ అయిన పాట మెహదీ హసన్ పాడిన పాట ఇష్క్ మేరా దేవానా).
No comments:
Post a Comment