18 January 2024

ఈజిప్ట్ (కెమెట్) EGYPT (KEMET) గురించి విశేషాలు

 



 

·       ఈజిప్ట్ గల పురాతన పేరు కెమెట్ అనగా నలుపు అని అర్ధం. ఆపేరు ఈజిప్ట్ ప్రజలు నల్లగా ఉండటం లేదా అక్కడి మట్టి నల్లరేగడి మట్టి  అవటం వలన వచ్చింది.

·       ఆఫ్రికన్ల గురించి అద్యయనం చేయడానికి గ్రీకు పండితులు ఈజిప్ట్ (కెమెట్) ను విద్యార్థులుగా సందర్శించారు

 

·       గ్రీక్ తత్వవేత్త ప్లేటో ఈజిప్టులో 13 సంవత్సరాలు చదువుకున్నాడు.

·       గ్రీక్ గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరస్ ఈజిప్టులో 22 సంవత్సరాలు తత్వశాస్త్రం, జ్యామితి మరియు వైద్యశాస్త్రం అభ్యసించారు.

·       థేల్స్, ఈజిప్టులో 7 సంవత్సరాలు చదువుకున్న మొదటి గ్రీకు తత్వవేత్త.

·       వైద్యం యొక్క పితామహుడిగా పిలువబడే హైపోక్రేట్స్, ఈజిప్షియన్ బహుళ మేధావి అయిన ఇమ్హోటెప్‌ Imhotep ను వైద్య పితామహుడిగా గుర్తించారు.

·       పైథాగరియన్ పుట్టడానికి 1000 సంవత్సరాల ముందు "పైథాగరియన్ సిద్ధాంతం" ఈజిప్టులో పిరమిడ్‌లను నిర్మించడానికి ఉపయోగించబడింది.

·       ఈజిప్టు విద్య విద్యార్థులను మరింత అప్రమత్తంగా మరియు మానవీయంగా మారుస్తుందని ప్లేటో చెప్పారు.

·       గొప్ప తత్వవేత్తల మనస్సులను అధ్యయనం చేయాలనుకుంటే ఈజిప్టుకు వెళ్లమని ప్లేటో తన విద్యార్థులకు చెప్పాడు.

·       హెరెడోటస్, గ్రీకు చరిత్రకారుడు పురాతన ఈజిప్ట్‌ను నాగరికత యొక్క ఊయలగా అభివర్ణించాడు.

No comments:

Post a Comment