4
జనవరి 1931న, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, విద్యావేత్త మరియు ఇస్లామిక్ తత్వవేత్త,
అలీ బ్రదర్స్ లో ఒకరైన మహమ్మద్ అలీ జౌహర్
(జననం 10
డిసెంబర్ 1878) మరణించారు.
మహమ్మద్
అలీ జౌహర్ భారత ఉపఖండం మరియు ముస్లిం ప్రపంచం యొక్క అత్యంత డైనమిక్ నాయకులలో
ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. పాలస్తీనాలో మహమ్మద్ అలీ జౌహర్ మరణం మరియు ఖననం యొక్క
కథ అత్యంత ప్రసిద్ది చెందినది.
నవంబర్
1928లో, తన ఐరోపా పర్యటనలో, మహమ్మద్ అలీ జౌహర్ భారతదేశానికి తన తిరుగు
ప్రయాణంలో పాలస్తీనాను సందర్శిస్తాడని అల్-ఖుద్స్ (జెరూసలేం)లో సమాచారం అందింది. ఈ
వార్త పాలస్తీనా ముస్లింలకు, ప్రత్యేకించి మహమ్మద్ అలీ జౌహర్ పట్ల అమితమైన భక్తిని, ప్రేమను కలిగి ఉన్నవారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది
మరియు వారు మహమ్మద్ అలీ జౌహర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఒక
పాలస్తీనా పరిశీలకుడు, నజీర్
హసన్ అల్-అన్సారీ, ఢిల్లీకి
చెందిన ఉర్దూ వార్తాపత్రిక హమ్‌దార్ద్ Hamdard లో పలాస్తినా లో మహమ్మద్ అలీ జౌహర్ పర్యటనపై
వివరణాత్మక నివేదికను రాశారు.
3
డిసెంబర్, 1928
సంచికలో, డమాస్కస్
నుండి మహమ్మద్ అలీ జౌహర్ యొక్క టెలిగ్రామ్ జెరూసలేం గ్రాండ్ ముఫ్తీ మరియు బ్రిటిష్
పాలస్తీనాలోని ముస్లిం సుప్రీం కౌన్సిల్ అధిపతి సయ్యద్ అమీన్ అల్-హుస్సేనీకి అందింది.
మహమ్మద్ అలీ జౌహర్ నవంబర్ 15న డమాస్కస్ నుండి అల్-ఖుద్స్‌కు
రావాల్సి ఉంది మరియు అల్-ఖుద్స్‌లోని షరియా డిపార్ట్‌మెంట్ పైన ఉన్న విశాలమైన
గదులు మహమ్మద్ అలీ జౌహర్ కోసం సిద్ధం చేయబడ్డాయి.
మహమ్మద్
అలీ జౌహర్ పాలస్తీనా రాక వార్త పాలస్తీనా అంతటా వేగంగా వ్యాపించింది మరియు మహమ్మద్
అలీ జౌహర్ రిసెప్షన్ కోసం జోర్డాన్ నది, బనాత్ యాకూబ్, ఆల్-ఖుద్స్ వరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి..
గుర్రపు స్వారీలు మరియు వేలాది మంది మహిళలు అరబిక్ పాటలు పాడుతూ స్వాగతించే అరబ్
సంప్రదాయాలను పాటిస్తూ రోడ్ల వెంట గుమిగూడారు. మధ్యాహ్నానికి చేరుకుంటారని
ఊహించినప్పటికీ, మహమ్మద్
అలీ జౌహర్ రాక రాత్రి 10 గంటల
వరకు ఆలస్యమైంది. నిరాశకు
గురైన జనాలు ఇళ్లకు వెళ్ళారు.
మహమ్మద్
అలీ జౌహర్ పాలస్తీనాలో ప్రవేశాన్ని పాలస్తీనా యొక్క బ్రిటిష్ మాండేట్ హై కమీషనర్, సర్ (తరువాత లార్డ్) హెర్బర్ట్ ప్లూమర్
నవంబర్ 16న, పాలస్తీనియన్లు తీవ్రంగా
ఎదురుచూసినప్పటికీ, మొదట
తిరస్కరించారు. మహమ్మద్ అలీ జౌహర్ చివరకు నవంబర్ 20న పాలస్తీనాలోకి ప్రవేశించడానికి
అనుమతించబడ్డాడు, చల్లటి
చలిలో సాయంత్రం ఆలస్యంగా మహమ్మద్ అలీ జౌహర్ టిబెరియాస్ చేరుకున్నాడు. ప్రతికూల
వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, మరుసటి రోజు అల్-ఖుద్స్‌కు మహమ్మద్ అలీ జౌహర్ రాకతో పాలస్తీనా ప్రజలు ఉత్సాహం పొందారు.
“కామ్రేడ్ మరియు హమ్దార్ద్”
రెండు వార్తాపత్రికలు మహమ్మద్ అలీ జౌహర్ చే భారతదేశంలో ప్రచురించబడ్డాయి, అందులో పాలస్తీనా గురించి కాలమ్
ఎల్లప్పుడూ ఉండేది. మహమ్మద్ అలీ జౌహర్ ఎల్లప్పుడూ
పాలస్తీనా గురించి ఆందోళన చెందేవాడు మరియు
జర్నలిజంలో తన కెరీర్ ప్రారంభం నుండి పాలస్తీనా గురించి వ్రాసేవాడు. మహమ్మద్ అలీ జౌహర్ 1917 నాటి బాల్ఫోర్ డిక్లరేషన్ తరువాత తన
గళం పెంచినాడు.
మహమ్మద్
అలీ జౌహర్ తన సోదరుడు షౌకత్ అలీతో కలిసి పాలస్తీనా గురించి ఎల్లప్పుడూ అవగాహన
పెంచుకునేవాడు. 1923-24లో
పాలస్తీనా నుండి ఒక ప్రతినిధి బృందం భారతదేశానికి వచ్చింది. 29 జనవరి 1924న, ఖిలాఫత్ కమిటీ ఛోటా కబ్రస్తాన్, గ్రాంట్ రోడ్, బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో ఒక బహిరంగ
సభను ఏర్పాటు చేసింది, దానికి
పాలస్తీనా డిప్యూటేషన్ సభ్యులు కూడా హాజరైనారు.
31
జనవరి 1924న
టైమ్స్ ఆఫ్ ఇండియాలో "పాలస్తీనా డిప్యూటేషన్: నిధుల కోసం అప్పీల్"
శీర్షికన ఒక నివేదిక ప్రచురించినది.
పాలస్తీనా
డిప్యూటేషన్ సభ్యులను కలిసిన తర్వాత, మహమ్మద్ అలీ జౌహర్ ఈ క్రింది
తీర్మానాన్ని ప్రవేశ పెట్టినట్లు టైమ్స్ అఫ్ ఇండియా నివేదిక పేర్కొంది: “బాంబేలోని ముసల్మాన్‌ల [ముస్లింల]
సమావేశం ఆర్థిక సహాయం కోసం భారతదేశానికి వచ్చిన పాలస్తీనా డిప్యూటేషన్‌కు
హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. మస్జిద్-ఇ-అక్సా మరియు మస్జిద్-ఇ-సఖ్రా [డోమ్ ఆఫ్
ది రాక్] యొక్క అవసరమైన మరమ్మత్తులు మరియు ఈ పనిలో పాల్గొనడం ప్రతి ముస్లిం
పురుషుడు, స్త్రీ
మరియు పిల్లల విధి అని అభిప్రాయపడ్డారు.." పాలస్తీనా కోసం భారతీయ ముస్లింలను
విజయవంతంగా సమీకరించి, విరాళాలు
అందించాలని కూడా మహమ్మద్ అలీ జౌహర్ విజ్ఞప్తి చేశారు.
1929
సెప్టెంబరు 14న
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ముందు రోజు బొంబాయిలో జరిగిన ముస్లింల
బహిరంగ సభకు మొహమ్మద్ అలీ జౌహర్ అధ్యక్షత వహించాడు. పాలస్తీనాలో జరుగుతున్న
సంఘటనలకు సంబంధించి ముస్లింల ఏకీకృత డిమాండ్లపై బ్రిటిష్ మంత్రులు మరియు భారత
ప్రభుత్వం యొక్క ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకుని తగిన తదుపరి చర్యలపై సమావేశం
చర్చించింది. ముస్లింలు మాత్రమే జెరూసలేం యొక్క యజమానులని, ఇది వారి మొదటి ఖిబ్లా (ప్రార్థన దిశ) అని
మొహమ్మద్ అలీ జౌహర్ చెప్పినట్లు నివేదించబడింది.
మహమ్మద్
అలీ జౌహర్ 1930లో
భారతదేశ స్వాతంత్ర్యం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి లండన్
చేరుకున్నాడు, అనారోగ్యంతో
ఉన్నప్పటికీ. అక్కడ మహమ్మద్ అలీ జౌహర్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకం. మహమ్మద్ అలీ జౌహర్
4
జనవరి 1931న
లండన్‌లోని హైడ్ పార్క్ హోటల్‌లో తుది శ్వాస విడిచాడు. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు ప్యాడింగ్టన్ టౌన్ హాల్‌లో
అంత్యక్రియల ప్రార్థన షెడ్యూల్ చేయబడింది. అప్పటి ఆఫ్ఘన్ రాయబారి, ఈజిప్టు రాయబారి, ఇరాన్ రాయబారి మరియు రౌండ్ టేబుల్
సభ్యులందరూ మహమ్మద్ అలీ జౌహర్ మృతదేహాన్ని మోయనికి తమ భుజాలను అందించారు. హాలు వెలుపల భారీ సంఖ్యలో
బ్రిటీష్ ప్రజలు ఉన్నారు మరియు హాల్ లోపల అన్ని పార్టీల బ్రిటిష్ ప్రతినిధులు కూడా
ఉన్నారు.
మహమ్మద్
అలీ జౌహర్ ను తమ నగరంలోనే ఖననం చేయాలని అందరూ కోరుకున్నారు. మహమ్మద్ అలీ జౌహర్ అక్కడే
ఖననం చేయాలని లండన్ ప్రజలు విశ్వసించారు, కాని మహమ్మద్ అలీ జౌహర్ ని కుటుంబం
దానిని వ్యతిరేకించింది. మహమ్మద్ అలీ జౌహర్ భార్య అమ్జాది బానో బేగం అతన్ని
భారతదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంది మరియు మహమ్మద్ అలీ జౌహర్ ని ఇంటికి
తీసుకెళ్లమని భారతదేశం నుండి వందలాది టెలిగ్రామ్‌లు వచ్చాయి.
మొహమ్మద్
అలీ జౌహర్‌ను జెరూసలేంలోని బైతుల్ ముఖద్దాస్‌లో ఖననం చేయాలని పాలస్తీనా గ్రాండ్
ముఫ్తీ అమీన్ అల్-హుస్సేనీ అభ్యర్థించారు. మతపరమైన ప్రాతిపదికన భారతదేశంలోని
ముస్లింలకు పాలస్తీనాతో అనుబందం ఉందని
చెప్పడమే పాలస్తీనా గ్రాండ్ ముఫ్తీ ఉద్దేశ్యమని చెప్పబడింది. భారతదేశంలోని
ముస్లింలు మక్కా మరియు మదీనాలను ప్రేమించినట్లే, బైతుల్ ముఖద్దాస్‌ను కూడా ప్రేమించాలి.
పాలస్తీనా
గ్రాండ్ ముఫ్తీ అభ్యర్థనకు షౌకత్ అలీ అంగీకరించారు. మొహమ్మద్ అలీ జౌహర్ మృతదేహాన్ని
ఐదు రోజుల పాటు లండన్‌లో ఉంచారు, ఆపై దానిని ఓడ ద్వారా ఈజిప్ట్‌కు పంపారు, 21 జనవరి 1931న పోర్ట్ సెయిడ్‌కు చేరుకుంది, అక్కడ ఈజిప్టు ప్రభుత్వ ప్రతినిధుల
పర్యవేక్షణలో ఉంచబడింది మరియు అబ్బాస్ మసీదుకు ఒక పోలీసు అంగరక్షకుని తో చేరవేయబడింది.. ఈజిప్ట్ శవపేటికపై ఉంచడానికి
కిస్వా (మక్కాలోని కాబాను కప్పి ఉంచే వస్త్రం) యొక్క భాగాన్ని సమర్పించింది.
అంత్యక్రియల ప్రార్థన మళ్లీ మసీదులో నిర్వహించబడింది, ఆ తర్వాత మొహమ్మద్ అలీ జౌహర్ అవశేషాలను
గౌరవప్రద౦గా వీధుల గుండా తీసుకువెళ్లారు.
రాయిటర్స్
ప్రకారం, మధ్యాహ్న
ప్రార్థన తర్వాత పాలస్తీనాలోని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అల్-అక్సా
(హరమ్ అల్-షరీఫ్) లో అంత్యక్రియల కోసం మొహమ్మద్ అలీ జౌహర్ మృతదేహాన్ని
తీసుకెళ్తున్నారనే వార్త భారతదేశం మరియు పాలస్తీనా ముస్లింల మధ్య స్నేహాన్ని
బలోపేతం చేయడానికి నిదర్శనంగా విస్తృతంగా స్వాగతించబడింది.
జనవరి
23న
మొహమ్మద్ అలీ జౌహర్ అస్తికలు జెరూసలేంకు వచ్చినప్పుడు, అన్ని దుకాణాలు మూసివేయబడ్డాయి.
షౌకత్
అలీ మరియు ముఫ్తీ అమీన్ అల్-హుస్సేనీ, మొహమ్మద్ అలీ జౌహర్ అంత్యక్రియల ఊరేగింపుకు
నాయకత్వం వహించారు; భారీ
జనసమూహం గుండా మస్జిద్ అల్-అక్సా చేరుకోవడానికి వారికి మూడు గంటల సమయం పట్టింది.
శుక్రవారం ప్రార్థన తరువాత, మూడవ
సారి సుమారు రెండు లక్షల మంది ప్రజలు అంత్యక్రియల ప్రార్థన కు హాజరు అయ్యారు. అనేకమంది
ప్రముఖ ముస్లిం నాయకుల ప్రసంగాల మధ్య మొహమ్మద్ అలీ జౌహర్ అంత్యక్రియలు జరిగాయి.
మహ్మద్
అలీ జౌహర్ జీవితం భారతదేశం మరియు పాలస్తీనా ముస్లింల మధ్య ఒక ఆదర్శప్రాయమైన వారధి.
మొహమ్మద్ అలీ జౌహర్ మరణం తరువాత, అతని సోదరుడు షౌకత్ అలీ భారతదేశంలో పాలస్తీనా వాదాన్ని మరింత బలోపేతం చేసే
పనిని చేపట్టాడు.
No comments:
Post a Comment