3 January 2024

జింజియాంగ్ మరియు ఇతర ప్రాంతాలలో ముస్లింల సాంస్కృతిక మరియు మతపరమైన అణచివేతపై దర్యాప్తు చేస్తున్న US పరిశోధనా బృందం ప్రవేశాన్ని చైనా నిషేధించింది China bars entry of U.S. research group probing into cultural and religious repression of Muslims in Xinjiang and other regions

 



U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్, ఖరాన్ అనేది ప్రముఖ ప్రపంచ ఆర్థిక సంస్థలు, బహుళజాతి సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు విశ్వసనీయమైన మరియు చర్య తీసుకోదగిన ఆంక్షలకు సంబంధించిన రిస్క్ ఇంటెలిజెన్స్‌ను అందించే ఒక ఉన్నత పరిశోధనా సంస్థ.  

జిన్‌జియాంగ్‌లోని ఉయ్ఘర్‌ల ఇస్లామిక్ గుర్తింపును చైనా క్రమపద్ధతిలో తుడిచివేస్తోందని, మసీదులపై అణిచివేత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందన్న ఆరోపణల మధ్య చైనా,  U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్, ఖరాన్, యొక్క చైనా పర్యటనను నిషేదించినది.

చాలా కాలంగా, చైనా ముస్లిం గుర్తింపు మరియు సంస్కృతిని తుడిచివేస్తోంది మరియు ఇస్లామిక్ నిర్మాణాన్ని దాని స్వంత కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రతిబింబించే చిహ్నాలతో భర్తీ చేస్తోంది. చైనా నిర్బంధ శిబిరాల్లో ఉయ్ఘర్‌ ముస్లిముల అణచివేత గురించి U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్ కరోన్ ఆందోళనకరమైన ఆధారాలు చూపినప్పటికీ అనేక ముస్లిం దేశాలు ఆశ్చర్యకరంగా మౌనంగా ఉన్నాయి.

పాశ్చాత్య మీడియాలో కనిపిస్తున్న నివేదికల ప్రకారం, 2018 నుండి చైనాలోని 2,300 మసీదులు ధ్వంసమయ్యాయి. దాదాపు 1.10 కోట్ల మంది ఉయ్ఘర్లు మరియు జిన్‌జియాంగ్‌లోని ఇతర స్థానికులు మత, భాషా మరియు సాంస్కృతిక హింసకు లోను అయ్యారు.  చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ భారీ నియంత్రణ మద్య బలవంతంగా ఉయ్ఘర్ ముస్లిలను చైనాలోని మెజారిటీ హాన్ జాతి సమూహంతో వారిని కలపడానికి ప్రయత్నిస్తుంది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్ ఖరాన్, అనుబంధంగా ఉన్న దాని ప్రధాన విశ్లేషకులను  చైనాలో ప్రవేశించకుండా నిషేధించారు

చైనా ప్రభుత్వం జిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్ (XUAR) పారిశ్రామికీకరణకు సమ్మిళిత డ్రైవ్‌ను చేపడుతున్నట్లు, అక్కడ అధిక సంఖ్యలో తయారీ కార్యకలాపాల కోసం  కార్పొరేషన్ల స్థాపన చేస్తునట్లు U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్, ఖరాన్ తెలిపింది.

చైనా ప్రవేశపెట్టిన కేంద్ర-నియంత్రిత పారిశ్రామిక విధానం ఉయ్ఘర్‌లు మరియు ఇతర టర్కిక్ ప్రజలను బలవంతంగా సమీకరించే ప్రభుత్వ ప్రయత్నాలలో కీలకమైన సాధనం అని U.S. రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ గ్రూప్ ఖరాన్ తెలిపింది.

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను చైనా చాలా కాలంగా ఖండించింది. ఉయ్ఘర్‌లు మరియు ఇతర టర్కిక్ ప్రజలు  హింసాత్మక మరియు తీవ్రవాద ధోరణులను" వదిలించుకోవడానికి మరియు వారికి ఉద్యోగ నైపుణ్యాలు నేర్పడానికి మాత్రమే ఉద్దేశించబడినవి అని చైనా అంటుంది. .

.చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారం  ఉయ్ఘర్‌లు మరియు ఇతర టర్కిక్ ప్రజలను బలవంతంగా నిర్భంద శ్రామిక శిబిరాలు అన్నీ ఇప్పుడు మూసివేయబడినవి అయితే వాస్తవానికి నిర్భంద శ్రామిక శిభిరాలలోని మాజీ ఖైదీలలో చాలా మందికి ఇతర ప్రదేశాలలో సుదీర్ఘ జైలు శిక్ష విధించబడింది.

జర్నలిస్టులు, దౌత్యవేత్తలు మరియు ఇతరులకు  ఈ నిర్భంద శ్రామిక శిభిరాల ప్రాంతానికి ప్రాప్యత కఠినంగా నియంత్రించబడుతుంది మరియు ప్రాంతం వెలుపల ఉయ్ఘర్లు, కజాక్‌లు మరియు ఇతర ముస్లిం మైనారిటీల కదలికలపై ఆంక్షలు ఉన్నాయి. జిన్‌జియాంగ్‌పై అమెరికా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని, వాటిని మానవ హక్కుల సమస్యలగా పేర్కొంటo౦దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరోపించారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో చైనా జిన్‌జియాంగ్‌లోని ముస్లింలను హింసించడమే కాకుండా ఉత్తర నింగ్జియా ప్రాంతంతో పాటు గన్సు ప్రావిన్స్‌లోని మసీదులను కూడా మూసివేసిందని పేర్కొంది.

జిన్‌జియాంగ్‌లో మానవాళికి వ్యతిరేకంగా చైనా నేరాలకు పాల్పడి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక గత సంవత్సరం పేర్కొంది. చట్టవిరుద్ధమైన ఇంటర్న్‌మెంట్ క్యాంపులలో కనీసం ఒక కోటి హుయిస్, కజఖ్‌లు మరియు కిర్గిజ్‌లను నిర్భందించారని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అంటున్నది. హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ప్రకారం, మతపరమైన వ్యక్తీకరణలను అణిచివేసే లక్ష్యంతో చైనా అధికారులు జిన్‌జియాంగ్ వెలుపల ఉన్న ప్రాంతాలలో లౌకిక ఉపయోగం కోసం మసీదులను మూసివేశారు, పడగొట్టారు..

హ్యూమన్ రైట్స్ వాచ్‌ ప్రకారం చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ చాలా మసీదులను మూసివేస్తోంది. మసీదులను మూసివేయడం, ధ్వంసం చేయడం మరియు పునర్నిర్మించడం చైనాలో ఇస్లాం అరికట్టడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నంలో భాగమని హ్యూమన్ రైట్స్ వాచ్‌ సంస్థ చెప్పింది.

నింగ్జియాలోని లియావోకియావో మరియు చువాన్‌కౌ గ్రామాలలో, అధికారులు మొత్తం ఏడు మసీదుల గోపురాలు మరియు మినార్‌లను కూల్చివేసి, వాటిలో మూడు ప్రధాన భవనాలను 2019 మరియు 2021 మధ్య ధ్వంసం చేశారు. చైనా ప్రభుత్వం చుట్టుపక్కల ఇతర ప్రదేశాలలో మసీదులను మూసివేసిందని లేదా మార్చిందని నివేదికలు  సూచిస్తున్నాయి.. దక్షిణ యునాన్ ప్రావిన్స్‌లోని నాగు పట్టణంలో నిరసనకారులు మే 2023లో మసీదు గోపురం కూల్చివేతపై స్థానిక ప్రజలు పోలీసులతో ఘర్షణ పడ్డారు.

చైనా యొక్క కఠోరమైన చర్యలను  ప్రపంచ  దేశాలు ఖండించాలని జిన్‌జియాంగ్‌ ప్రావిన్సు లోని ఉయ్ఘర్లు, కజాక్‌లు మరియు ఇతర ముస్లిం మైనారిటీలు  కోరుతున్నారు. ముస్లిం ప్రపంచం నుండి సమిష్టి ప్రతిస్పందన లేకపోవడం మరియు చైనా చే ఉయ్ఘర్లు, కజాక్‌లు మరియు ఇతర ముస్లిం మైనారిటీల మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండిచకపోవడం విచారకరం.

 

No comments:

Post a Comment