9 January 2024

ఫరంగి మహల్: లక్నో Farangi mahal: Lucknow

 


 

లక్నోలోని ఫరంగి మహల్‌ భారత జాతియోద్యం లో ప్రముఖపాత్ర వహించినది. ఫరంగి మహల్‌ యొక్క ప్రస్తుత యజమాని  అద్నాన్ అబ్దుల్ వలీ.  ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు అయిన మౌలానా అబ్దుల్ బారీ ఫరంగి మహాలీ యొక్క ప్రత్యక్ష వారసుడు అద్నాన్ అబ్దుల్ వలీ.

ఫరంగి మహల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ఫ్రెంచ్ వ్యాపారులకు చెందినది.  ఫ్రెంచ్ వ్యాపారుల పేర ఫరంగి మహల్ కు ఆ పేరు వచ్చింది. తరువాతి కాలం లో ఔరంగజేబు చక్రవర్తి ఫరంగి మహల్ ను అబ్దుల్ బారీ పూర్వీకులకు ఫత్వా రూపేణ ప్రధానం చేసాడు.  

"ఖిలాఫత్ ఉద్యమం ఫరంగి మహల్ నుంచే మొదలైంది" ఖిలాఫత్ ఉద్యమం మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాలనే ఆలోచన ఫరంగి మహల్‌లో పుట్టింది మరియు మౌలానా అబ్దుల్ బారీ ఆ ప్రణాళిక యొక్క రూపకర్త. ఇది భారతీయ చరిత్రలో హిందూ-ముస్లిం ఐక్యత యొక్క అద్భుతమైన క్షణం మరియు లక్నో లోని ఫరంగి మహల్ అందులో తన పాత్రను పోషించింది.

మౌలానా అబ్దుల్ బారీ, ప్రముఖ మత పండితుడు, చురుకైన రాజకీయవేత్త కూడా. మౌలానా అబ్దుల్ బారీ అనేక ముస్లిం దేశాలలో పర్యటించాడు మరియు ఇస్లామిక్ ప్రపంచంపై బ్రిటిష్ సామ్రాజ్యవాదం యొక్క ప్రభావం గురించి బాగా తెలుసు.

మార్చి 1919లో రౌలట్ చట్టం వచ్చింది, ఏప్రిల్ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్ మారణకాండ మహాత్మా గాంధీని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించటానికి దారితీసే సంఘటనలలో ఒకటి. అది జరగడానికి ముందు, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీలో ఒట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యే ముప్పు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నీ ముస్లింల రాజకీయ నాయకుడు ఒట్టోమన్ దేశాధినేత ఖలీఫా యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది. టర్కీని బ్రిటీష్‌తో సహా మిత్రరాజ్యాల దళాలు ఓడించాయి. దీనితో  భారతదేశంలోని పెద్ద సంఖ్యలో ముస్లింలు కలవరపడ్డారు.

మౌలానా అబ్దుల్ బారీ ఖిలాఫత్ (కాలిఫేట్) పునరిద్దరించడానికి ఒక పెద్ద, జాతీయ వేదిక అవసరమని భారత దేశం లోని ముస్లిములను ఒప్పించాడు.

దాదాపు 1919 నుండి, మౌలానా అబ్దుల్ బారీ గ్రామీణ ప్రాంతాలలో మంచి మద్దతుని కలిగి ఉన్నాడు మరియు ఖిలాఫత్ ఆందోళనకు  సమర్ధనగా ఒక వార్తాపత్రికను స్థాపించారు. ఖిలాఫత్ ఆందోళనలో గాంధీని భాగస్వామిని చేయాలి అనుకున్నాడు.

గాంధీ 1919 మార్చిలో మొదటిసారిగా లక్నో లోని ఫరంగి మహల్‌లో ఉండడానికి వచ్చాడు మరియు మౌలానా అబ్దుల్ బారీ గాంధీ  మంచి స్నేహం ఏర్పడింది. 1919 మరియు 1920 సమయంలో రాజకీయంగా, ఖిలాఫత్ ప్రచారం మరియు దానికి  గాంధీజీ  సమర్ధనతో మౌలానా అబ్దుల్ బారీ ప్రభావం పెరిగింది.

మౌలానా అబ్దుల్ బారీ మరియు ఫరంగి మహల్ లోని అతని బంధువులు, న్యాయవాది చౌదరి ఖలీకుజ్జమాన్ సహాయంతో అఖిల భారత కేంద్ర ఖిలాఫత్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించారు.. ఖిలాఫత్ కమిటీని సహాయ నిరాకరణలో ఒక విధానంగా స్వీకరించేలా ఒప్పించడానికి మరియు రెండవది, జూన్ (1920)లో జరిగిన ఖిలాఫత్ కమిటీ అలహాబాద్ సమావేశాలలో, గాంధీని అధ్యక్షుడిగా ఆమోదించడానికి ఖిలాఫత్ కమిటీని ఒప్పించడంలో మౌలానా అబ్దుల్ బారీ అపారమైన కృషి చేశారు

సెప్టెంబర్ 4 నుండి 9, 1920 వరకు జరిగిన కలకత్తా ప్రత్యేక కాంగ్రెస్‌లో ముస్లిం ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనటానికి మౌలానా అబ్దుల్ బారి  ప్రచారం చేశారు. స్వరాజ్యం కోసం డిమాండ్‌తో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని సెషన్ ఆమోదించింది. . ఖిలాఫత్ కమిటీ మరియు కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం (స్వరాజ్యం కోసం డిమాండ్‌) తో సహాయ నిరాకరణ ఉద్యమం తో ఒక్కటయ్యాయి.

మార్చి 1919 తర్వాత, గాంధీ ఫరంగి మహల్‌లో మూడుసార్లు బస చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు సరోజినీ నాయుడు వంటి ఇతర నాయకులు కూడా ఫరంగి మహల్‌లో ఉన్నారు. గాంధీ రెండవ పర్యటన సందర్భంగా, 1919 సెప్టెంబరులో, ఆ ప్రాంతంలోని ముస్లింలు బక్రీద్ సందర్భంగా గాంధీజీ కి గౌరవసూచకంగా గోహత్యకు దూరంగా ఉన్నారు మరియు ఖిలాఫత్ వాదానికి గాంధీజీ మద్దతు ఇచ్చినందుకు గాంధీజీ ని  ప్రశంసించారు

మౌలానా అబ్దుల్ బారీ గాంధీజీ కి  సూఫీ సన్యాసి, మొయినుద్దీన్ చిస్తీ శిష్యుడు మరియు వారసుడు అయిన భక్తియార్ కాకీని  పరిచయం చేసాడు,. తన మరణానికి మూడు రోజుల ముందు, గాంధీ తన చివరి బహిరంగ ప్రసంగాన్ని మెహ్రౌలీలోని భక్తియార్ కాకీ మందిరంలో చేశారు.

అంతకుముందు మౌలానా అబ్దుల్ బారీ గాంధీజీ ని చిస్తీ ప్రతిష్ఠించిన అజ్మీర్‌ దర్గా కు ఆహ్వానించాడు. అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద, గాంధీజీ  చిస్తీపై ఖవ్వాలిలో పాల్గోనట్లు  చెబుతారు. అక్కడే గాంధీజీ అబ్దుల్ బారీని భక్తియార్ కాకీ గురించి అడిగాడు. 1921లో తొలిసారిగా అజ్మీర్ షరీఫ్‌ను సందర్శించిన గాంధీజీ మళ్లీ ఇంకోసారి అజ్మీర్ షరీఫ్‌ను సందర్శిస్తారు.

1922లో, చౌరీ చౌరా సంఘటన తర్వాత, గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. మౌలానా అబ్దుల్ బారీ పశ్చాత్తాపపడలేదు; గాంధీని విడిచిపెట్టలేదు.

మౌలానా అబ్దుల్ బారీ రాజకీయవేత్త మాత్రమే కాదు, ప్రముఖ విద్యావేత్త కూడా. మౌలానా అబ్దుల్ బారీ పూర్వీకులు ఒక మదర్సాను స్థాపించారు, అది ఇస్లామిక్ ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది మరియు దార్స్-ఎ-నజామి అనే సిలబస్‌ను ప్రవేశపెట్టింది.

గౌరవనీయమైన ఉపాధ్యాయుడిగా, మౌలానా అబ్దుల్ బారీ మదరసా పాఠ్యాంశాల్లో పెద్ద మార్పులను ప్రవేశపెట్టాడు.

ఖిలాఫత్ ఉద్యమ విఫలం తో నిరాశ చెందిన వ్యక్తిగా  మౌలానా అబ్దుల్ బారీ 1926లో మరణించాడు.ఫరంగి మహల్ ఇప్పటికీ దాని పురాతన, జ్ఞాపకశక్తితో నిలిచి ఉంది.

 

మూలం: http://www.telegraphindia.com / జనవరి 07, 2024

No comments:

Post a Comment