3 January 2024

ఇస్లాం కళ మరియు అందాన్ని మానవ జీవితానికి అవసరమైనగా భావిస్తుంది. Islam Celebrates art and beauty as essentials of human life

 



మనిషి తన దైనందిన జీవితంలో దుస్తులు నుండి తన ఇంటి వాస్తుశిల్పం వరకు - ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటాడు.ఇస్లాం ప్రకారం అల్లాహ్ సుందరుడు.(సుభాన్ అల్లాహ్). ఇస్లాం  మనిషి సృజనాత్మకతను, కళలు, అందమైన చేతి వ్రాతను(ఇస్లామిక్ కాలి-గ్రాఫి) సాహిత్యం, లలిత కళలు, విజ్ఞానశాస్త్రం ను ఆదరిస్తుంది. దీనికి బిన్నంగా ప్రవర్తించడం మనిషి యొక్క ప్రాథమిక సృజనాత్మకతకు  వ్యతిరేకం కావడమే కాకుండా ఇస్లాం స్ఫూర్తిని ఉల్లంఘించి, సామాన్యత మరియు నిస్తేజ సంస్కృతిని సృష్టిస్తుంది

ఇస్లామిక్ సంప్రదాయం మరియు ముస్లిం నాగరికత ఇస్లాంలో అందం యొక్క సారాంశాన్ని ఏర్పరుస్తుంది. ముస్లింలు నిర్మించిన తాజ్ మహల్ మరియు అల్ హమ్రా వంటి నిర్మాణ అద్భుతాలు ఈ నమ్మకాన్ని బలపరుస్తాయి. మన ఆహారపు అలవాట్ల నుండి సాధారణ సంభాషణల వరకు, మసీదుల నిర్మాణం నుండి డ్రెస్సింగ్ సెన్స్ వరకు, ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి క్షణంలో అందం మరియు కళలను నొక్కి చెబుతుంది

ఇస్లాం ప్రవక్త "దేవుడు అందమైనవాడు మరియు అందాన్ని ప్రేమిస్తాడు" అని చెప్పారు. అది ముస్లింల శ్రేయోభిలాష మరియు ఉత్కృష్ట భావనను చాటుతుంది.. ప్రవక్త (స) తనను తాను అందంగా చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మరియు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని మరియు వారి స్వభావంలో అందాన్ని కాపాడుకోవాలని తన సహచరులను కూడా ప్రోత్సహించారని హదీసులు నివేదించాయి. పాత్ర మరియు ఆత్మ యొక్క అందాన్ని ఇస్లాం అందం యొక్క అత్యున్నత రూపంగా చూస్తుంది, అంతిమ సౌందర్యం హృదయం మరియు తెలివి యొక్క అందం.

ఇస్లాం అందం యొక్క బాహ్య మరియు స్పష్టమైన వ్యక్తీకరణలపై దృష్టి సారిస్తుంది. బెహ్రెన్స్-అబౌసెఫ్ "ఇస్లాం ధర్మం లో అందం అంత కీలకమైన పాత్రను ఏ ఇతర ధర్మం లో కన్పించడు." అని రాశారు. ఇస్లామిక్ నాగరికతలో, జీవితంలోని ప్రతి కోణంలోనూ అందం కన్పిస్తుంది. . రూమి, అత్తర్, సాదీ, బెదిల్, హఫీజ్, అబుల్ ఖైర్ వంటి ఆధ్యాత్మిక కవుల సాహిత్య కళాఖండాలు, తాజ్ మహల్, నైన్ డోమ్ మసీదు, ఆగ్రా ఫోర్ట్, బాద్షాహి మసీదు, ది అల్హంబ్రా వంటి నిర్మాణ అద్భుతాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నిర్మించిన అనేక సూఫీ ధర్మశాలలు, సమాధులు, ప్యాలెస్‌లు మరియు ఉద్యానవనాలు ఇస్లామిక్ అందమైన కళలకుFine Arts  నిదర్శనాలు..

మరొక ఇస్లామిక్ కళారూపం ఖురాన్ ఖిరాత్ (పఠనం) మరియు కాలిగ్రఫీకి సంబంధించినది, ముస్లింలు ఖురాన్ దైవవాణి అని విశ్వసించారు మరియు దాని పఠనం మరియు లిప్యంతరీకరణలో అత్యంత శ్రద్ధ వహించారు. వారు పారాయణం మరియు కాలిగ్రఫీ కళలను ఉచ్చదశలకు తీసుకెళ్లారు. ఆధునిక సంగీత శాస్త్రజ్ఞులు దివ్య ఖురాన్ పఠనం లోని ధ్వని సౌందర్యాన్ని అంగీకరించారు.

అప్పటి కమ్యూనిస్టుల ఆధిపత్యంలో ఉన్న USSR పార్లమెంట్‌లో ఖారీ అబ్దుల్ బాసిత్ దివ్య ఖురాన్ పారాయణ౦ చేస్తున్నప్పుడు హాజరైన సభ్యులు దివ్య ఖురాన్ పఠనం యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇస్లాంలో ఆత్మను అందంగా తీర్చిదిద్దే శాస్త్రం అహ్సన్ లేదా తస్సావుఫ్‌గా గుర్తించబడింది.

ప్రముఖ తత్వవేత్త అల్-గజాలీ సంగీతాన్ని నిషేదించే ప్రకటన దివ్య ఖురాన్‌లో లేదా ప్రవక్త సంప్రదాయాలలో లేదు అని అన్నాడు. అల్-గజాలీ వాదన ప్రకారం సంగీత౦ మన ఐదు ఇంద్రియాలలో ఒకదాని ద్వారా గ్రహించబడుతుంది, ఇది మనస్సుతో కలిసి, ఉపయోగించడానికి సృష్టించబడింది.

ఇస్లాం అందం యొక్క సృష్టి, ఉత్పత్తి, పునరుత్పత్తి, వేడుక మరియు ప్రచారాన్ని ఎప్పుడూ విస్మరించలేదు లేదా అసహ్యించుకోలేదు. ఇది అందాన్ని జరుపుకోవడానికి మరియు అమలు చేయడానికి కొన్ని చట్టబద్ధమైన పరిమితులను మాత్రమే నిర్వచించింది.

అందం యొక్క ఇస్లామిక్ భావన అందమైన సమాజం మరియు నాగరికత సృష్టిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇస్లామిక్ నాగరికత అందం యొక్క సహజ మరియు మానవ నిర్మిత అంశాలను ప్రశంసించే మరియు కీర్తిస్తూ ఉదాహరణలతో నిండి ఉంది.

 

 

No comments:

Post a Comment