దాది లక్ష్మీ కృష్ణన్ 15 ఏళ్ల వయస్సులో రాణి ఝాన్సీ రెజిమెంట్ (ఆజాద్ హింద్ ఫౌజ్)లో చేరింది. రాణి ఝాన్సీ రెజిమెంట్ లో కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ ఉన్నందున దాది లక్ష్మీ కృష్ణన్ ను చిన్న లక్ష్మి అని పిలిచేవారు. లక్ష్మీ కృష్ణన్ పేరు ముందు లిటిల్ అని ప్రిఫిక్స్ చేయబడింది.
“నా
దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచనతో, నేను
రెజిమెంట్‌లో చేరాను, ”అని చెన్నైకి చెందిన
లక్ష్మీ కృష్ణన్ అంటారు. కృష్ణన్ కుటుంబం లక్ష్మీ
కృష్ణన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చింది. లక్ష్మీ
కృష్ణన్ తండ్రి నేతాజీ ప్రసంగాన్ని విన్నారు, అది ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. సింగపూర్‌కు చెందిన
అమ్మాయిలు ఐఎన్‌ఎలో చేరారని తెలియగానే లక్ష్మీ కృష్ణన్ ను కూడా చేరమని తండ్రి ప్రోత్సహించారు.
రాణి ఝాన్సీ రెజిమెంట్
RJRలో లక్ష్మీ
కృష్ణన్ అనుభవాలు:
లక్ష్మీ కృష్ణన్ తో పాటు రాణి ఝాన్సీ
లక్ష్మి రెజిమెంట్RJR లో ఆరుగురు సన్నిహిత మిత్రులు శకుంతలా గాంధీ,
మాయా
గంగూలీ,
అరుణా
గంగూలీ,
రాణి
భట్టాచార్య, గౌరీ సేన్ మరియు రామా మెహతా ఉన్నారు..
తన పుట్టినరోజు సందర్భంగా నేతాజీ వారందరినీ
తన బంగ్లాకు ఆహ్వానించారు.
నేతాజీ వాలంటీర్లను అడిగారు మరియు మాలో 10 లేదా 15 మంది ముందుకు వచ్చారు. మేము రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ అటవీ ప్రాంతంలో శిక్షణ పొందాము. ఒకరోజు నేరుగా మా క్యాంప్‌పై బాంబు పడి భవనం కూలిపోయింది. విమానం సమీపిస్తున్న శబ్దంతో, కెప్టెన్ లక్ష్మితో సహా మేము ఐదుగురు చిన్న గోతిలోకి దూరాము. చెత్తాచెదారం కందకాన్ని కప్పివేసింది మరియు లోపల పొగలు రావడం ప్రారంభించాయి. రక్షించబడకపోతే, చనిపోయేవాళ్ళం అని లక్ష్మీ కృష్ణన్ అన్నారు. .
మరొక సందర్భంలో, సైనికులు శిబిరాలు మారుతున్నప్పుడు బ్రిటిష్ వారు వారిపై కాల్పులు జరిపారు. "మేము ఒక గుంటలో దాక్కోన్నాము.మా భుజాల మీదుగా బుల్లెట్లువెళ్ళాయి. అని లక్ష్మీ కృష్ణన్ అన్నారు.
బ్రిటిష్ వారు విశ్వసించినట్లు RJR "అలంకారమైన
రెజిమెంట్" కాదు.అది వీర వనితల రెజిమెంట్
No comments:
Post a Comment