14 ఫిబ్రవరి 1925న రాయగఢ్ జిల్లా లో
జన్మించిన మోహన్ ధారియా 70వ దశకంలో యంగ్ టర్క్స్‌లో
భాగం మరియు దాదాపు మూడు దశాబ్దాలుగా
పర్యావరణం కోసం పోరాడేందుకు రాజకీయ రంగం ను విడిచిపెట్టిన అరుదైన రాజకీయ నాయకుడు.
మాజీ
కేంద్ర మంత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త మోహన్ ధరియా ( 1925 ఫిబ్రవరి 14 - 2013 అక్టోబరు 14
). తన చివరి రోజుల్లో పూణేలో ఉన్నాడు. మోహన్ ధరియా ప్రభుత్వేతర సంస్థNGO వాన్రాయ్ Vanarai ను నడిపాడు. మోహన్ ధరియా పూణే లోక్ సభ
నియోజకవర్గం నుండి రెండుసార్లు (మొదట 1971 లో భారత జాతీయ కాంగ్రెస్
(ఐఎన్ సి) తరుఫున 1977 లో భారతీయ లోక్ దళ్ లోక్ సభకు ఎన్నికయ్యాడు. కాంగ్రెస్స్
మంత్రివర్గం లో విదేశాంగ మంత్రిగా, తరువాత మొరార్జీ దేశాయ్ మంత్రిత్వ శాఖలో
కేంద్ర వాణిజ్య మంత్రిగా పనిచేసాడు. మోహన్ ధరియా ఐఎన్ సీ నుంచి రెండుసార్లు మొదట
1964-1970, ఆ తర్వాత
1970- 1971 రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
సామాజిక
సేవలో మోహన్ ధరియా కు
2005లో భార త దేశ రెండో అత్యున్నత పౌర గౌర
వం అయిన పద్మ
విభూషణ్ను భార
త ప్ర భుత్వం ప్ర దానం చేసింది.
మోహన్
ధరియా మహాద్
లోని కొంకణ్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1942 లో
స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి తన చదువును విడిచిపెట్టాడు. ఆ తర్వాత పూణే
విశ్వవిద్యాలయంలోని ఐఎల్ ఎస్ లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు
బొంబాయి
హైకోర్టులో న్యాయవాదిగా మోహన్ ధరియా తన వృత్తిని ప్రారంభించి, కాలక్రమేణా రాజకీయ జీవితాన్ని
ప్రారంభించాడు.
మోహన్
ధరియా గతంలో
ప్రజా సోషలిస్టు పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడు, జాతీయ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. ఆయన
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 1962-67, అఖిల
భారత కాంగ్రెస్ కమిటీ
సభ్యుడు 1962—75గా
ఉన్నాడు.
1975 లో
ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భారత రాజ్యాంగంలోని ముప్పై ఎనిమిదవ సవరణను
మోహన్ ధరియా తీవ్రంగా
వ్యతిరేకించడం ధరియా రాజకీయ జీవితంలో ముఖ్యాంశం. మోహన్ ధరియా ఎమర్జెన్సీ ని 'రాబోయే నియంతృత్వానికి పార్లమెంటరీ
ప్రజాస్వామ్యం లొంగిపోవడం' అని
పిలిచారు. 1975 జూన్ లో అత్యవసర పరిస్థితి విధించడాన్ని మోహన్ ధరియా వ్యతిరేకించడం మొరార్జీ
దేశాయ్, చంద్ర
శేఖర్ వంటి
ఇతర అసమ్మతి నాయకులతో మోహన్ ధరియా నిర్బంధానికి దారితీసింది. 1975 తరువాత
అత్యవసర పరిస్థితి తరువాత మోహన్ ధరియా కాంగ్రెస్ నుండి వైదొలిగారు.
పదవులు
·
పూణే మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుడు, 1957—60
·
పూణే మునిసిపల్ కార్పొరేషన్ రవాణా సంస్థ ఛైర్మన్, 1957-58
·
1964, 1970 లలో
రాజ్యసభకు ఎన్నికయ్యారు
·
1971— 77 పూణే
నుండి ఐదవ లోక్ సభ సభ్యుడు
·
1971 మే నుంచి 1974 అక్టోబరు వరకు ప్రణాళిక శాఖ శాఖ మంత్రి
·
1974 అక్టోబరు నుండి 1975 మార్చి వరకు పనులు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
·
1977-1980 పూణే నుండి ఆరవ లోక్ సభ సభ్యుడు
·
1977 మార్చి నుంచి వాణిజ్య, పౌర సరఫరాలు, సహకార శాఖ మంత్రి
·
ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, డిసెంబరు 90 - జూన్ 9
అవార్డులు
· పద్మవిభూషణ్
·
డి.లిట్
·
యశ్వంత్ రావ్ చవాన్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్
·
రాజీవ్ గాంధీ పర్యవరన్ రత్న అవార్డు
·
పూణే ప్రైడ్ అవార్డు
·
డెవలప్ మెంట్ జ్యువెల్ అవార్డు
· 26వ ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత అవార్డు
88 ఏళ్ల వయస్సు లో కేంద్ర మాజీ మంత్రి, ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షుడు మోహన్ ధరియా పూణే నగరం లో 2013 లో మరణించారు. మోహన్ ధరియా. కు భార్య, ఇద్దరు కుమారులు
మరియు ఒక కుమార్తె ఉన్నారు..
No comments:
Post a Comment