2 January 2024

బీజాపూర్ యొక్క ఆదిల్ షాహీ సుల్తానుల పెరుగుదల మరియు పతనం The Rise and Fall of Bijapur’s Adil Shahi Sultans

 


 

ఆదిల్ షాహీ రాజవంశం (1489-1686), బీజాపూర్ రాజ్యాన్ని పాలించే శక్తివంతమైన రాజ కుటుంబం. ఆదిల్ షాహీ రాజవంశం కు చెందిన తొమ్మిది మంది రాజులు ప్రజారంజకంగా, సమర్ధతతో పరిపాలించారు. 1686లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బీజాపూర్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆదిల్ షాహీ రాజవంశం అంతరించిపోయింది.

 

బీజాపూర్‌ ఆదిల్ షాహీ సుల్తానుల గురించిన వివరణ:

1. యూసుఫ్ ఆదిల్ షా 1490–1510:

కొందరు యూసుఫ్ ఆదిల్ షా ను ఒట్టోమన్ వారసుడు అని పిలుస్తారు, మరికొందరు పర్షియన్ అని అనుకుంటారు మరియు మరికొందరు జార్జియా నుండి వచ్చినవాడని అ౦టారు. ఆదిల్ షాహీ రాజవంశములో యూసుఫ్ ఆదిల్ షా అత్యంత ప్రతిభావంతుడు. 16వ శతాబ్దపు ప్రారంభంలో యూసుఫ్ ఆదిల్ షా స్వాతంత్ర్యం ప్రకటించి, పర్షియాలోని సఫావిడ్స్‌ నుండి  ప్రేరణ పొంది షియాయిజాన్ని ఆదిల్ షాహీ బిజాపూర్ రాజ్య మతంగా ప్రకటించాడు. అయితే యూసుఫ్ ఆదిల్ షా విజయనగర రాజు కృష్ణదేవరాయ తో చేసిన యుద్ధంలో ఒడి పోయాడు..

2. ఇస్మాయిల్ ఆదిల్ షా 1510–1534:

పిల్లవాడు అయిన ఇస్మాయిల్ ఆదిల్ షా రాజు అయినప్పుడు, రీజెంట్ అతని సింహాసన౦ పై కన్నువేసాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా యొక్క మరాఠీ తల్లి సింహాసనాన్ని కాపాడింది. కానీ ఇస్మాయిల్ ఆదిల్ షా కాలం లో గోవా ను  పోర్చుగీస్ వారు ఆక్రమించారు  మరియు కృష్ణదేవరాయ చేతిలో ఇస్మాయిల్‌ ఘోర పరాజయం పొందినాడు.  . ఇస్మాయిల్ ఆదిల్ షా 35 ఏళ్లకే ప్రపంచాన్ని విడిచిపెట్టినాడు.

3. మల్లు ఆదిల్ షా 1534:

మల్లు ఆదిల్ షా ను అతని అమ్మమ్మ వృద్ధ మరాఠీ మాత అంధుడిని చేసి, కటకటాల వెనుక పడవేసి, మల్లు ఆదిల్ షా స్థానంలో మల్లు ఆదిల్ షా సోదరుడిని సింహాసనంపై కూర్చోబెట్టింది

4. ఇబ్రహీం ఆదిల్ షా I (1534–1558):

సున్నీగా మారిన ఇబ్రహీం ఆదిల్ షా I తన ఆస్థానం లోని 3000 మంది షియాలను తొలగించడమే కాకుండా, 70 మంది షియాలను సంహరించాడు.  ఆనారోగ్యం తో తగిన వైద్య సంరక్షణ లేకపోవడంతో ఇబ్రహీం ఆదిల్ షా I మరణించాడు.

5.  అలీ ఆదిల్ షా I (1558–1579):

షియా గా మారిన  అలీ ఆదిల్ షాI సున్నిలను తీవ్రంగా ద్వేషించాడు. అలీ ఆదిల్ షాI సైనిక కార్యకలాపాలలో మరియు శారీరక వ్యాయామం లో మునిగి ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తరువాత బీజాపూర్ శక్తివంతం అయినది. యుద్ధనైపుణ్యాలతో పాటు, ఆదిల్ షాI స్వయంగా కవి మరియు గ్రంధ రచయిత కూడా.

6. ఇబ్రహీం ఆదిల్ షా II (1580–1627):

ఇబ్రహీం ఆదిల్ షా IIను అక్బర్ చక్రవర్తి  యొక్క దక్కనీ ప్రతిరూపంగా పిలవవచ్చు. ఇబ్రహీం ఆదిల్ షా II పరమత సహనుడు.  ఇబ్రహీం ఆదిల్ షా II గణపతి మరియు సరస్వతిని ప్రార్థించాడు మరియు ముస్లిం సెయింట్ గెసుదరాజ్‌ను స్తుతి౦చేవాడు. ఇబ్రహీం ఆదిల్ షా II రుద్రాక్ష మాల ధరించేవాడు మరియు ఇబ్రహీం ఆదిల్ షా II బీజాపూర్‌ను ఎంతగా అభివృద్ధి చేశాడు. ఆ కాలంలో రాజధాని అయిన బిజాపూర్ లో  5 మిలియన్ల మంది నివసించేవారు. 1626లో ఇబ్రహీం ఆదిల్ షా II మరణించినాడు.

7. ముహమ్మద్ ఆదిల్ షా 1627–1656:

కొత్తగా సుల్తాన్ అయిన ముహమ్మద్ ఆదిల్ షా పై మొఘలులు ఒత్తిడి తెచ్చారు, మరియు 1636లో బీజాపూర్ మొఘల్‌లకు అధీనంలో ఉన్నట్లు నిర్ధారించే ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది. కానీ తరువాతి దశాబ్దంలో ముహమ్మద్ ఆదిల్ షా శక్తివంత౦గా మారినాడు.  ముహమ్మద్ ఆదిల్ షా కాలం లో బిజాపూర్ పరిమాణం పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్దదిగా మారింది, దాని సరిహద్దులు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. కానీ ముహమ్మద్ ఆదిల్ షా పై మరాఠాల దాడి జరిగింది, మరియు రాజ్యం క్షీణించడం పట్ల అసంతృప్తి మరియు తీవ్ర నిస్పృహతో ముహమ్మద్ ఆదిల్ షా 1656లో మరణించాడు.

.8. అలీ ఆదిల్ షా II (1656–1672)

అలీ ఆదిల్ షా II బిజాపూర్ సామ్రాజ్యం క్షిణించకుండా ఎంతో ప్రయత్నించాడు. ఔరంగజేబు మరియు  శివాజీ కూడా బిజాపూర్ సామ్రాజ్యం పై కన్ను వేసారు. ఇద్దరి మద్య నలిగిన అలీ ఆదిల్ షా II 35వ సంవత్సరానికి చేరుకోకముందే చనిపోయాడు.

9. సికిందర్ ఆదిల్ షా(1672–1686):

సికిందర్ ఆదిల్ షా సింహాసనంపై ఉంచబడినప్పుడు ఒక శిశువు. ఆఫ్రికన్లు మరియు ఆఫ్ఘన్‌లు బీజాపూర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి శక్తి కోసం ఎగబడ్డారు. మరాఠాలు ప్రతిసారీ జోక్యం చేసుకుంటారు. రాజ్యం పేరుకు  తప్ప అన్ని పోయినాయి. ఔరంగజేబు సికిందర్‌ను ఓడించి బిజాపూర్ ను ఆక్రమించినాడు.

ముగింపు:

యూసుఫ్ ఆదిల్ షా నుండి సికిందర్ ఆదిల్ షా వరకు, ఆదిల్ షాహీ రాజవంశం దాదాపు ఒక శతాబ్దం పాటు పరిపాలించినది. ఆదిల్ షాహీ రాజవంశం అనేక మతపరమైన సంస్కరణలు, సైనిక విజయాలు, కళాత్మక వైభవం ద్వారా గుర్తించబడింది.

 




No comments:

Post a Comment