22 January 2024

మోయిన్ ఉల్ హక్: ప్రఖ్యాత బీహార్ విద్యావేత్త, క్రీడానిర్వహకుడు. MOIN UL HAQ: Bihar’s Famous AAcademician and SPORTS Administrator

 


 

బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న "మొయిన్ ఉల్ హక్" స్టేడియం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. "మొయిన్ ఉల్ హక్" స్టేడియం నిర్మాణం వెనుక ఉన్న సయ్యద్ మొహమ్మద్ మొయిన్ ఉల్ హక్, 1881లో నలంద జిల్లాలోని అస్తవాన్ పట్టణం లో జన్మించాడు. మొయిన్ ఉల్ హక్ ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ పొందినాడు.

1912 సంవత్సరంలో, మోయిన్ ఉల్ హక్ కటక్‌లోని రావెన్‌షా కాలేజీలోని ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. విద్యార్ధులకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా క్రీడల పట్ల మక్కువ కలిగించాడు

విద్యారంగం లో మోయిన్ ఉల్ హక్ సేవలు:

విద్యారంగంలో ప్రముఖుడైన మొయిన్ ఉల్ హక్ బీహార్ నేషనల్ కాలేజీలో 1935 నుండి 1953 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేసాడు. మొయిన్ ఉల్ హక్ బీహార్ సెకండరీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ మరియు పాట్నా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.  బీహార్ నేషనల్ కాలేజీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, 1962లో బీహార్ యూనివర్సిటీ సర్వీస్ కమీషన్ గౌరవనీయమైన ఛైర్మన్‌గా నియమించబడినాడు.  

1938లో మొయిన్ ఉల్ హక్, పాట్నా కు తన నివాసం మార్చిన తరువాత నిస్వార్థంగా అస్తవాన్, నలంద, బీహార్ లోని  తన సొంత ఇంటిని  ఉర్దూ బాలికల పాఠశాల, అస్తవాన్, నలంద, బీహార్ గా మార్చినాడు.

క్రీడారంగం లో మోయిన్ ఉల్ హక్ సేవలు:

1.బీహార్-ఒరిస్సా ఒలింపిక్ అసోసియేషన్‌ ఏర్పరిచి దానికి కార్యదర్శి గా ఎన్నికైనాడు

2.ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఏర్పాటులో ప్రముఖపాత్ర వహించినాడు.

1935 సెప్టెంబరు 21వ తేదీన, దర్భంగా నగరంలో, ఆల్-ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AIFA) కు పునాది వేయబడింది. బీహార్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క సహకారం తో ఆల్-ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AIFA) ఏర్పాటు అయ్యింది.  ఆల్-ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ కు గౌరవనీయమైన ఛైర్మన్‌గా  మొయిన్ ఉల్ హక్ పనిచేసాడు.

3.ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఇతర క్రీడా కమిటీల ఏర్పాటులో ప్రముఖ పాత్ర

1924లో, మొయిన్ ఉల్ హక్ నాయకత్వంలో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) స్థాపించబడింది, భారత ఒలింపిక్ క్రీడలు అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగాయి. రాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారతీయ క్రీడాకారులను ఎనికచేయడానికి ఎన్నికచేయడానికి ఢిల్లీలో జరిగిన  భారత ఒలింపిక్ క్రీడలు ఒక వేదికగా నిల్చినవి.

4.నేషనల్ గేమ్స్:

·       1940లో బొంబాయిలో జరిగిన, భారత ఒలింపిక్ క్రీడల 9వ ఎడిషన్‌ను నేషనల్ గేమ్స్‌గా మార్చడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వైవార్షిక క్రీడలను నిర్వహించడం కొనసాగించింది.

·       ఫిబ్రవరి 1944లో పాటియాలాలో జరిగిన 11వ జాతీయ క్రీడల సందర్భంగా మొయినుల్ హక్ చైర్‌పర్సన్‌గా పనిచేశాడు.

·       ఫిబ్రవరి 1948లో లక్నోలో జరిగిన 13వ జాతీయ క్రీడల్లో మొయినుల్ హక్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు.

·       మొయిన్ ఉల్ హక్ 1950లో బొంబాయి లో జరిగిన  భారత జాతీయ క్రీడల నిర్వహణ లో ముఖ్య పాత్ర వహించినాడు.

6.1930ల ప్రారంభంలో, మోయిన్ ఉల్ హక్ పశ్చిమాసియా దేశాలతో కూడిన బహుళ-క్రీడా ఈవెంట్‌ను స్థాపించే ప్రయత్నాలను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పరిణామం సూయజ్‌కు తూర్పున మరియు సింగపూర్‌కు పశ్చిమాన ఉన్న దేశాలను కలుపుకొని పశ్చిమ ఆసియా క్రీడల సృష్టికి దారితీసింది.

7. 1951 ఆసియా క్రీడలకు ముందు    ఫార్ ఈస్టర్న్ గేమ్స్ 1913 మరియు 1938 మధ్య జపాన్, ఫిలిప్పీన్స్ మరియు చైనా ప్రధాన భూభాగంలో జరిగినవి. ఫార్ ఈస్టర్న్ గేమ్స్ తొమ్మిది ఎడిషన్‌ల పాటు విజయవంతంగా కొనసాగాయి. అయితే, 1937లో చైనాపై జపాన్ దండయాత్ర చేయడం తో 1938లో జరగాల్సిన ఫార్ ఈస్టర్న్ గేమ్స్ ఆటలు రద్దు చేయబడ్డాయి. వీటికి కొనసాగిపుగా 1951 నుంచి మొయిన్ ఉల్ హక్ కృషితో  ఆసియా క్రీడలు కొనసాగినవి.

8.మోయిన్ ఉల్ హక్ 1937 నుండి 1956 వరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ గౌరవనీయమైన సెక్రటరీ గా పనిచేసారు.

9.బీహార్ క్రికెట్ అసోసియేషన్ స్థాపనలో పాత్ర:

క్రీడల రంగంలో, మొయిన్ ఉల్ హక్ ప్రభావం ఫుట్‌బాల్‌కు మించి విస్తరించింది. జంషెడ్‌పూర్ నగరంలో బీహార్ క్రికెట్ అసోసియేషన్ యొక్క పునాదిని వేసాడు.  మోయిన్ ఉల్ హక్ బీహార్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు.

మొయిన్-ఉల్-హక్ ఆసియా క్రీడలు మరియు భారత హాకీ కమిటీతో సహా భారత ప్రభుత్వం యొక్క అనేక కమిటీలకు గౌరవనీయమైన సలహాదారుగా పనిచేసారు.

బ్రిటీష్ ప్రభుత్వం మరియు మరియు భారత ప్రభుత్వంచే గుర్తింపు:

·       ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ రంగంలో దూరదృష్టి కలిగిన మొయిన్-ఉల్-హక్ కు  బ్రిటీష్ ప్రభుత్వం, 1930లో ఆర్డర్ ఆఫ్ నైట్‌హుడ్‌ని ప్రదానం చేసింది.

·       భారత ప్రభుత్వం కూడా 1970లో మొయిన్-ఉల్-హక్ కు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.  

ప్రముఖ విద్యావేత్త, క్రీడా అధికారి, క్రీడా నిర్వాహకునిగా గా సేవలు అందించి భారత ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం చే సన్మానించబడిన సయ్యద్ మొహమ్మద్ మొయిన్ ఉల్ హక్ 11 డిసెంబర్ 1973న మరణించినారు

 

No comments:

Post a Comment