24 January 2024

జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్ 1924-1988

 


కర్పూరీ ఠాకూర్ (1924 జనవరి 24 - 1988 ఫిబ్రవరి 17) బీహార్ ముఖ్యమంత్రిగా (మొదట డిసెంబరు 1970 నుండి జూన్ 1971 వరకు, ఆపై జూన్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు) రెండు పర్యాయాలు కొనసాగాడు.

కర్పూరీ ఠాకూర్  కు కేంద్రప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ 2024 జనవరి 23న ఒక ప్రకటన వెలుబడింది.

కర్పూరీ ఠాకూర్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు జన్మించాడు. కర్పూరీ ఠాకూర్ మహాత్మా గాంధీసత్యనారాయణ సిన్హాచే ప్రభావితమయ్యాడు. కర్పూరీ ఠాకూర్  ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి విద్యార్థి నాయకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు, కర్పూరీ ఠాకూర్  26 నెలల జైలు జీవితం గడిపాడు.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, కర్పూరీ ఠాకూర్  తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. కర్పూరీ ఠాకూర్  1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభ సభ్యుడు గా ఎన్నిక అయ్యాడు.

కర్పూరీ ఠాకూర్  1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్భంగా పి అండ్ టి ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు. 1970లో, కర్పూరీ ఠాకూర్  టెల్కో కార్మికుల ఉద్యమానికి మద్దత్తు గా  28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు

కర్పూరీ ఠాకూర్  బీహార్ విద్యా మంత్రిగా మెట్రిక్యులేషన్ లో  ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా తొలగించాడు. కర్పూరీ ఠాకూర్  1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు కర్పూరీ ఠాకూర్  బీహార్‌లో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. కర్పూరీ ఠాకూర్  బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు. కర్పూరీ ఠాకూర్  హయాంలో, బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో కర్పూరీ ఠాకూర్  పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.

కర్పూరీ ఠాకూర్   జయ ప్రకాష్ నారాయణ్‌కు సన్నిహితుడు.భారతదేశంలో అత్యవసర పరిస్థితి (1975–77) సమయంలో, కర్పూరీ ఠాకూర్   మరియు జనతా పార్టీ యొక్క ఇతర ప్రముఖ నాయకులు భారతీయ సమాజం యొక్క అహింసాత్మక పరివర్తన లక్ష్యంగా "సంపూర్ణ విప్లవం" ఉద్యమానికి నాయకత్వం వహించారు

కర్పూరీ ఠాకూర్  సంయుక్త సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. లాలూ ప్రసాద్ యాదవ్రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్నితీష్ కుమార్ వంటి ప్రముఖ బీహారీ నాయకులకు కర్పూరీ ఠాకూర్ గురువుగా కీర్తిపొందాడు.

కర్పూరీ ఠాకూర్    పేదల చాంపియన్ గా పేరు పొందారు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కర్పూరీ ఠాకూర్ నిర్ణయం తీసుకున్నారు.

1978లో, కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు 26% రిజర్వేషన్ మోడల్‌ను బీహార్‌లో ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ లో, ఇతర వెనుకబడిన తరగతిOBCకి 12%,MBC అత్యంత వెనుకబడిన తరగతికి 8%, స్త్రీలకు 3% మరియు అగ్రవర్ణాల నుండి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (EBWs) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు లభించాయి.

కర్పూరి ఠాకూర్ 64 సంవత్సరాల వయసులో 1988 ఫిబ్రవరి 17న పాట్నా  లో గుండె పోటుతో మరణించాడు.

లెగసె/వారసత్వం

కర్పూరి ఠాకూర్ జన్మస్థలం, పితౌంఝియా, 1988లో ఆయన మరణం తర్వాత కర్పూరి గ్రామ్ (హిందీకి "కర్పూరి గ్రామం")గా పేరు మార్చబడింది.

బక్సర్‌లోని జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ విధి మహావిద్యాలయ (లా కాలేజీ) కూడా కర్పూరి ఠాకూర్ పేరు మీదనే ఉంది.

బీహార్ ప్రభుత్వం మాధేపురాలో జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజీని ప్రారంభించింది.

భారత తపాలా శాఖ కర్పూరి ఠాకూర్ జ్ఞాపకార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది.

జన్ నాయక్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వే ద్వారా దర్భంగా & అమృత్‌సర్ మధ్య నడుస్తుంది.

బీహార్ రాష్ట్రంలోని అనేక స్టేడియాలకు జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ పేరు పెట్టడం, చాలా జిల్లాల్లో కళాశాలలు మరియు విగ్రహాల స్థాపన, కర్పూరి ఠాకూర్ మ్యూజియం, సమస్తిపూర్ మరియు దర్భంగాలోని జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ ఆసుపత్రులు వంటి అనేక స్మారక చర్యలు ప్రభుత్వం చేపట్టింది.

శాసన సభ లో కర్పూరి ఠాకూర్‌ ప్రసంగాలపై  డాక్యుమెంటరీ నిర్మాణం జరుగుతుంది.

 

No comments:

Post a Comment