"1800ల చివరలో అనగా నిజాం VI హయాంలో సాలార్జంగ్
I ప్రధానమంత్రిగా
ఉన్న సమయంలో పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో
విద్యా సంస్కరణలు జరుగుతున్నాయి. అనేక విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ఇస్లామియా
ఉన్నత పాఠశాల వాటిలో ఒకటి."
1882లో నిర్మింపబడిన ఈ పాఠశాల, సికింద్రాబాద్‌లోని
మోండా మార్కెట్‌కి ఎదురుగా,
కలోనియల్
వాస్తుశిల్పానికి ప్రతీకగా నిలుస్తుంది.
"1859లో, హైదరాబాద్ రాష్ట్రం, ప్రతి తాలూకాలో ఒక పర్షియన్ మరియు ఒక స్థానిక
పాఠశాలను మరియు జిల్లా ప్రధాన కార్యాలయంలో పర్షియన్, ఇంగ్లీష్ మరియు స్థానిక పాఠశాలలను ప్రారంభించింది.
తాలూకా మరియు జిల్లా పాఠశాలల్లో నెలవారీ రుసుము వరుసగా ఒక అణా మరియు రెండు అణాలు ఉండేది.
ఇస్లామియా పాఠశాల భవనం యొక్క ప్రముఖ
ప్రవేశ ద్వారం నందు అలంకరించబడిన 'ఎలిప్టికల్ ఆర్చ్', అచ్చుపోసిన స్క్రోల్, పాఠశాల పేరు మరియు నిర్మాణ సంవత్సరం (1882) 'నక్షత్రం మరియు
నెలవంక' యొక్క
చిహ్నాన్ని కలిగి ఉంది. ఒక చిన్న వంగిన మెట్ల నేరుగా తరగతి గదులకు దారి తీస్తుంది, ఇది బ్రిటీష్
నిర్మాణ ప్రభావాన్ని చూపుతుంది.
ఇస్లామియా పాఠశాల ప్రవేశ ద్వారం
వద్ద అతికించిన పాలరాతి ఫలకం ఇస్లామియా పాఠశాల భవన నిర్మాణానికి నిధులు సమకూర్చిన
ప్రముఖ దాతలు- సేఠ్ రామ్ గోపాల్, బాబుఖాన్, అల్లాదిన్ మొదలగు దాతల పేర్లను కలిగి ఉంది
బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్‌లో
పాఠశాలను నిర్మించడానికి అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ అనుమతిని పాఠశాల పాలరాతి ఫలకం వివరిస్తుంది.
-డెక్కన్ క్రానికల్ సౌజన్యం తో
No comments:
Post a Comment