19 January 2024

మధ్య యుగ౦ (ముస్లింస్వర్ణయుగం) నాటి ప్రముఖ ముస్లిం శాస్త్రవేత్తలు - వారి ఆవిష్కరణలు Muslims must reclaim rich legacy of scientists and their Inventions in Middle

 

 

ఐరోపా పునరుజ్జీవనం మరియు జ్ఞానోదయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు (8-15శతాబ్దాలలో)ఇస్లాం సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో చాల అభివృద్ధి చెందినది అని అనేకమందికి తెలియదు. మధ్యయుగం లోని   8-15శతాబ్ధాలను  ముస్లిం స్వర్ణయుగంగా పిలిచెదరు.

ఇస్లామిక్ స్వర్ణయుగంలో,  ముస్లిం శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలు అరిస్టాటిలియన్ తత్వశాస్త్రం, నియో-ప్లాటోనిస్టులు మరియు యూక్లిడ్, ఆర్కిమెడిస్ మరియు టోలెమీ వంటి ప్రముఖ వ్యక్తుల నుండి ప్రేరణ పొంది, అనేక సంచలనాత్మక ఆవిష్కరణలు చేశారు. ఔషధం, శస్త్రచికిత్స, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, జ్యామితి మొదలైన విభిన్న రంగాలలో తమ పరిశోధనలను చేశారు.ఎనిమిదవ నుండి పదిహేనవ శతాబ్దాలలో, ముస్లిం గణిత శాస్త్రజ్ఞులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు గణితశాస్త్ర అభివృద్దికి తోడ్పడినారు.

ఇస్లాం విజ్ఞానం యొక్క దాదాపు అన్ని రంగాలలో వికసించినది..ఎనిమిది మరియు తొమ్మిదవ శతాబ్దాల మధ్య గ్రీకు, చైనీస్, ఇండియన్ పురాతన గ్రంథాలు  అనువదింపబడి ఇస్లామిక్ విజ్ఞాన శాస్త్ర పెరుగుదలలోప్రముఖ పాత్ర వహించినవి.  ముస్లింలు, పురాతన జ్ఞానాన్ని కాపాడారు, దానిపై కొత్తది  నిర్మించారు మరియు చివరికి దానిని ఐరోపాకు ప్రసారం చేశారు.

ముస్లిం పండితులు గ్రీకు రచనలను సంపాదించి మరియు వాటిని అరబిక్‌లోకి అనువదించడం ప్రారంభించారు. అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ విజ్ఞాన శాస్త్ర విభాగాలపై వందల మరియు వేల పుస్తకాలను రూపొందించారు. 

ఆధునిక నాగరికతకు వెన్నెముకగా భావించే చలన నియమాలను మొట్టమొదటిసారిగా ముస్లిం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముస్లింలు ఒంటెల కాన్వాయ్‌లను సంచార ఆసుపత్రులుగా ఉపయోగించారు, ముస్లిం పండితులు అనాటమీ మరియు ఫిజియాలజీని అధ్యయనం చేయడానికి మానవ శరీరాలను ఉపయోగించారు, శస్త్రచికిత్స విద్యార్థులకు నేర్పించారు.


ప్రముఖ  ముస్లిం శాస్త్రవేత్తలు-సంక్షిప్త పరిచయం:

అబూ అలీ ఇబ్న్ సినా (980-1037), పశ్చిమ దేశాలకు అవిసెన్నాగా సుపరిచితుడు మరియు  గొప్ప వైద్యుడు. అబూ అలీ ఇబ్న్ సినా ప్రసిద్ధ పుస్తకం, అల్-కనున్ ఫి అల్-టిబ్, 700 సంవత్సరాలకు పైగా ఐరోపాలో ఒక సాధారణ పాఠ్యపుస్తకం. ఇబ్న్ సినా మెనింజైటిస్‌ను మొదట వివరించాడు మరియు శరీర నిర్మాణ శాస్త్రం, గైనాకాలజి మరియు పిడియాత్రిక్స్ లో గొప్ప కృషి చేశాడు.

ముస్లిం ప్రపంచం అంతటా ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు నిర్మించబడ్డాయి, డమాస్కస్‌లో ప్రముఖ ఆసుపత్రిని ఖలీఫ్ వాలిద్ ఇబ్న్ అబ్ద్ అల్-మాలిక్ 707లో నిర్మించారు.  ముస్లింలు రక్త ప్రసారణ గురించి విలియం హార్వే కి ముందే అవగాహన కలిగి ఉన్నారు.  ఔషధ దుకాణాలు మరియు ఫార్మసీ పాఠశాల స్థాపించినారు. ముస్లిం శాస్త్రవేత్తలు, "ప్రవచనాత్మక వైద్యం" సాధనకు మించి, అబ్బాసిడ్ యుగంలో నేత్ర వైద్యం, శస్త్రచికిత్స, హిజామా, గైనకాలజీ మరియు మరిన్నింటిలో రాణిస్తూ నిరంతర పరిశోధన మరియు స్పెషలైజేషన్‌ చేసినారు. వైద్య పరిజ్ఞానం అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డారు.

అబూ బకర్ ముహమ్మద్ ఇబ్న్ జకారియా అల్-రాజీ ని  రజేస్ (865-925 AD) అని కూడా పిలుస్తారు. అల్-రాజీ ఇబ్న్ సినా తర్వాత ముస్లిం వైద్యులలో అగ్రగామిగా నిలిచాడు. అల్-రాజీ హునైన్ ఇబ్న్ ఇషాక్ మరియు తరువాత అలీ ఇబ్న్ రబ్బన్ వద్ద చదువుకున్నాడు. కితాబ్ అల్-మన్సూరి మరియు అల్-హవి 20-వాల్యూమ్‌ల వైద్య సంకలనంతో సహా 200 పుస్తకాలను రజేస్ రచించారు. అల్-రాజీ గ్రీకు మరియు అరబ్ వైద్య డేటాను ఏకీకృతం చేశాడు, పదార్థాలను వర్గీకరించాడు మరియు ఆరోగ్యంపై మానసిక కారకాల ప్రభావాన్ని వివరించాడు. అల్-రాజీ జంతువులపై చికిత్సలను పరీక్షించాడు మరియు అనస్థీషియా కోసం నల్లమందును ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన సర్జన్.

అల్బుకాసిస్ అని పిలువబడే అబుల్ ఖాసిమ్ అల్-జహ్రావి (963-1013 AD), ప్రఖ్యాత సర్జన్‌గా రూపొందాడు.. కాలిఫ్ అల్-హకం II యొక్క ఆస్థానంలో సేవ చేస్తూ, అల్-జహ్రావి ముస్లిం ప్రపంచం మరియు యూరప్ నుండి విద్యార్థులు మరియు రోగులను ఆకర్షించాడు.

అబూ నస్ర్ అల్-ఫరాబిని  (872 - 950) లాటిన్ లో అల్ఫారాబియస్ అని పిలుస్తారు. అల్-ఫరాబి ప్రారంభ ఇస్లామిక్ తత్వవేత్త మరియు సంగీత వేత్త. ఆల్ఫారాబియస్ అని కూడా పిలువబడే అల్-ఫరాబి  అరబ్ శాస్త్రవేత్త మరియు తత్వవేత్త, మధ్యయుగ యుగంలోని ప్రముఖ ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

అల్-బత్తానీ (858 - 929) భూమి మరియు సూర్యుని మధ్య దూరం సంవత్సరంలో మారుతుందని గమనించిన మొదటి ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు. అల్-బత్తానీ అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన అల్బాటేనియస్ అని కూడా పిలువబడ్డాడు, అల్-బత్తానీ సంవత్సరం పొడవు మరియు రుతువుల కోసం ఇప్పటికే ఉన్న విలువలను మెరుగుపరిచాడు.

ఇబ్న్ బటుతా ను (1304 - 1369) షమ్స్ అడ్-దిన్ అని పిలుస్తారు. ఇబ్న్ బటుతా ఒక అరబ్ యాత్రికుడు మరియు పండితుడు, ఇబ్న్ బటుతా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ప్రయాణ పుస్తకాలలో ఒకటైన ది రిహ్లాను వ్రాసాడు.

ఇబ్న్ రష్ద్ ను  (1126 - 1198) అవెర్రోస్ అని పిలుస్తారు. ఇబ్న్ రష్ద్ అరబ్ తత్వవేత్త మరియు పండితుడు. ఇబ్న్ రష్ద్ అరిస్టాటిల్ యొక్క చాలా రచనలపై మరియు ప్లేటో రిపబ్లిక్‌పై సారాంశాలు మరియు వ్యాఖ్యానాల శ్రేణిని రూపొందించాడు.

ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మీ (780 - 850). ని అల్గోరిట్మీ లేదా అల్గౌరిజిన్ అని పిలిచేవారు. అల్-ఖ్వారిజ్మీ రచనలు హిందూ-అరబిక్ అంకెలు మరియు బీజగణిత భావనలు  యూరోపియన్ గణితంలోకి ప్రవేశపెట్టబడ్డాయి..ప్రజలు అల్-ఖ్వారిజ్మీ ని బీజగణితానికి పితామహుడు అని పిలుస్తారు.

ఒమర్ ఖయ్యామ్ (1048 - 1131), గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం మరియు కవిత్వానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన పాలిమాత్. పెర్షియన్ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త మరియు కవిగా ప్రసిద్ధి చెందాడు, ఒమర్ ఖయ్యామ్ రుబాయియాత్ ("క్వాట్రైన్లు") Rubaiyat (“quatrains”) ప్రసిద్ది చెందినాయి..

తాబిత్ ఇబ్న్ ఖుర్రా (826 - 901) గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం మరియు అనువాదాలలో ప్రసిద్ధి చెందిన ఒక పాలిమాత్. అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు, వైద్యుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త; టోలెమిక్ వ్యవస్థ యొక్క మొదటి సంస్కర్త మరియు స్టాటిక్స్ వ్యవస్థాపకుడు.

జాబిర్ ఇబ్న్ హైయాన్ (722 - 804) ఒక ముస్లిం పాలిమాత్, తత్వవేత్త మరియు రసవాది. జాబిర్ ఇబ్న్ హైయాన్ గెబెర్ అని కూడా పిలువబడ్డాడు మరియు రసవాదం మరియు లోహశాస్త్రంపై అత్యంత ప్రభావవంతమైన రచనలకు ప్రసిద్ధి చెందినాడు.  జాబిర్ ఇబ్న్ హైయాన్ అరబ్ కెమిస్ట్రీ యొక్క పితామహుడు..

ఇబ్న్ ఇషాక్ అల్-కిండి (801 - 873) ఒక తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, వైద్యుడు మరియు సంగీత సిద్ధాంతకర్త, పాలిమాత్. ఇబ్న్ ఇషాక్ అల్-కిండి,  అల్కిందస్ అని కూడా పిలువబడ్డాడు మరియు అల్-కిండి ఒక శాస్త్రవేత్త, అల్-కిండి ముస్లిం పరిధీయ peripatetic తత్వవేత్తలలో మొదటి వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.

ఇబ్న్ అల్-హైతం (965 - 1040), ఇస్లామిక్ స్వర్ణయుగం నాటి  ఒక పండితుడు,  గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త. "ఆధునిక ఆప్టిక్స్ పితామహుడిగా" గుర్తించబడిన అల్-హైతం ఆప్టికల్ సూత్రాలు మరియు దృశ్యమాన అవగాహనను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇబ్న్ జుహ్ర్ (1091 - 1161), ప్రముఖ వైద్యుడు. ఇబ్న్ జుహ్ర్ ప్రసిద్ధ పుస్తకం అల్-తైసిర్ ఫిల్-ముదావత్వాల్-తద్బీర్ హీబ్రూ మరియు లాటిన్‌లోకి అనువదించబడింది. "బుక్ ఆఫ్ సింప్లిఫికేషన్ కన్సర్నింగ్ థెరప్యూటిక్స్ అండ్ డైట్". ప్రధానంగా థెరప్యూటిక్స్ యొక్క మాన్యువల్

ఇబ్న్ ఖల్దున్ (1332 - 1406) రచన ముకద్దిమహిబ్న్ ఖల్దున్ ఒక మాస్టర్ పీస్. ముకద్దిమహిబ్నె ఖల్దున్సమాజం మరియు నాగరికత యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషిస్తుంది.

ఇబ్న్ అల్-బైటర్ (1197 - 1248) అండలూసియన్ అరబ్ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు, ఔషధ నిపుణుడు మరియు వైద్యుడు. ఇబ్న్ అల్-బైటర్ ముస్లింల ప్రధాన వృక్ష శాస్త్రవేత్తలలో ఒకరిగా పరిగణించబడ్డాడు

 

No comments:

Post a Comment