ఇస్లాం-ఆధునికత
పరస్పర విరుద్దం కాదు
Islam
is not in conflict with modernity
ముహమ్మద్ అజ్గర్ అలీ.
“ఇస్లాం ప్రపంచంలో అత్యంత ఉదారవాద,
ప్రజాస్వామ్య,
అనువైన
మరియు సహనం గల మతం
Islam is the most
liberal, democratic, flexible and tolerant religion in the world.”
మార్పు అనేది మానవ జీవితం లో సహజం. ఈ ప్రపంచంలోని ప్రతిదీ మార్పు కు లోబడి ఉంటుంది. ఆధునిక కాలంలో, మానవ జ్ఞానం మార్పు చెందుతూనే ఉంది. మార్పుకు ప్రతిస్పందించని వ్యవస్థలు తొలగించబడతాయి లేదా నిశ్చలనంగా ఉండి పోతాయి.
ఇస్లాం, మానవజాతి సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తుంది మరియు ఎల్లప్పుడూ మానవ పరిస్థితి, సామాజిక పురోగతి మరియు మానవ గోళం యొక్క మొత్తం అభివృద్ధికి బాసటగా నిలుస్తుంది. ఇస్లాం ప్రాపంచిక సమస్యలకు తగిన ప్రాముఖ్యత నిస్తుంది మరియు మార్పులతో నిరంతరం సన్నిహితంగా ఉంటుంది. ఇస్లాం స్వీయ-పునరుద్ధరణ మరియు చట్టం, న్యాయశాస్త్రం, సామాజిక సంస్థ, ఆర్థిక దృక్పథం మొదలైన రంగాలలో మార్పులను విశ్వసిస్తుంది.
ఇస్లాం మానవ హేతుబద్ధత, తార్కికం మరియు ప్రపంచంలోని దైనందిన వ్యవహారాలను పరిష్కరించగల సామర్థ్యం కు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రవక్త(స) తన అనుచరులకు "మీరు మీ స్వంతంగా ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహించడానికి బాగా సన్నద్ధమయ్యారు" అని చెప్పారు. దివ్య ఖురాన్ మానవ గౌరవం మరియు మానవజాతి యొక్క మెరుగుదల సూత్రాల ఆధారంగా న్యాయమైన, సమానమైన మరియు ప్రగతిశీల సమాజాన్ని సృష్టించాలని ఉద్బోధిస్తుంది. ఇస్లాం తన పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్లో తన అనుచరులకు సామాజిక మరియు చట్టపరమైన దృక్పథం యొక్క విస్తృత రూపురేఖలను నిర్దేశించింది
దివ్య ఖురాన్ మారుతున్న సామాజిక-ఆర్థిక మరియు చట్టపరమైన నమూనాలకు తగిన విలువను కలిగి ఉంది. చట్టాలను రూపొందించడానికి మరియు తదనుగుణంగా జీవించడానికి మార్గదర్శకాలను అందించినది.
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, షిబ్లీ వంటి ముస్లిం సంస్కర్తలు ఆధునిక ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇస్లామిక్ చట్టపరమైన మరియు న్యాయశాస్త్ర వ్యవస్థను ఆధునీకరించడం, సంస్కరించడం, పునర్వ్యాఖ్యానించడం మరియు పునర్నిర్మించాలని అన్నారు. సమతావాదం, పరిశీలనాత్మకత, ఆస్తిక మానవతావాదం మరియు జ్ఞానసంబంధమైన బహువచనం egalitarianism, eclecticism, theistic humanism, and epistemological pluralism వంటి ఆధునిక విలువలను ఇస్లాం లో ఇముడ్చడానికి ప్రయత్నించారు
ఇస్లాం గురి౦చి ఒక సాధారణ భావన ఏమిటంటే, ఇస్లాం స్త్రీలను అణచివేస్తుంది, వారి స్వేచ్ఛను అణచివేస్తుంది మరియు వారికి తక్కువ స్థాయిని కల్పిస్తుంది. ప్రవక్త (స) కాలం నాటి అరేబియా యొక్క వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, ఇస్లాం మహిళల హక్కులకు గొప్ప సమర్దుకురాలు అనే వాస్తవ౦ తెలుస్తుంది. ప్రవక్త(స) తన కాలంనాటి అరేబియా సమాజంలోని మహిళలకు వారి హక్కులు మరియు గౌరవాన్ని పునరుద్ధరించడానికి సాధ్యమైన ప్రతి చర్యను తీసుకున్నారు. స్త్రీల ప్రాథమిక హక్కులైన ఆస్తి హక్కులు, విడాకులు తీసుకునే హక్కు, తనకు నచ్చిన జీవిత భాగస్వామిని కలిగి ఉండటం మరియు ఆనాటి అనాగరిక సమాజం లో నశించిన స్త్రీల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణపై ప్రవక్త(స) దృష్టి సారించారు. ఈ చర్యలను 21వ శతాబ్దపు స్త్రీవాద ఉద్యమం ప్రవక్త(స) యొక్క విప్లవాత్మక ప్రయత్నాలను, కించపరిచే అధికారాలతో పోల్చడం మేధో నిజాయితీ మరియు వాస్తవికతను వక్రీకరించడం లాంటిది.
ఆధునిక కాలంలో, లైలా అహ్మద్, కెసియా అలీ, అమీనా వదూద్ మొదలైన ముస్లిం స్త్రీవాద పండితులు ఇస్లాం యొక్క స్త్రీవాద వివరణను చేశారు. వారు విముక్తి యొక్క ఆధునిక విలువలు మరియు లింగం gender పై ఖురాన్ ఆదేశాల మధ్య పూర్తి అనుకూలతను కనుగొన్నారు. వారు లింగ అసమానతను కలిగి ఉన్న సాంప్రదాయ న్యాయపరమైన తీర్పులను కూడా సవాలు చేస్తున్నారు
ఇస్లాం, నిస్సందేహంగా సంస్కరణవాదం, ఒక నిర్దిష్ట నైతిక దృక్పథాన్ని ప్రతిపాదిస్తుంది. ఇస్లాం స్త్రీలు సహ-విద్య మరియు పని ప్రదేశాలలో చదువుకోవడానికి మరియు పని చేయడానికి అనుమతించినప్పటికీ, ఇది అసభ్యత మరియు అనైతిక ప్రవర్తనకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. ఇస్లాం బహుభార్యత్వాన్ని సమర్ధించదు కానీ కొన్ని సందర్భాల్లో మరియు కొన్ని ముందస్తు షరతులతో నలుగురు భార్యలను తీసుకునేందుకు అనుమతి ఇస్తుంది.
ఇస్లామిక్ పండితుడు, న్యాయవేత్త అమీర్ అలీ బహుభార్యత్వాన్ని వ్యతిరేకించాడు.బహుభార్యత్వం అనేది ప్రవక్త(స) యొక్క నిజమైన బోధనలకు వ్యతిరేక౦, మానవ పురోగతికి వ్యతిరేకమని చెప్పారు. ఇస్లాం యొక్క ప్రారంభ శతాబ్దాలలో కొన్ని సామాజిక-చారిత్రక పరిస్థితుల కారణంగా బహుభార్యత్వం అవసరం ఏర్పడింది. ఏకభార్యత్వాన్ని ప్రమాణం norm గానూ, బహుభార్యత్వాన్ని మినహాయింపుగానూ భావించే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కవి మరియు తత్వవేత్త అయిన ముహమ్మద్ ఇక్బాల్, ఇలా అంటాడు, “బహుభార్యాత్వ సంస్థకు సంస్కరణ అవసరం. ప్రారంభ ఇస్లాంలో దీని అనుమతి మంచి ఆధ్యాత్మిక కారణాలపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా, ప్రారంభ ఇస్లాంలో రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు బహుభార్యత్వాన్ని అనుమతించాలని డిమాండ్ చేశాయి. కానీ ఆధునిక జీవితంలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు బహుభార్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి”.
అమీర్ అలీ ప్రకారం ప్రవక్త(స) పెర్షియన్ మరియు ఇతర సంస్కృతులలో పర్దా యొక్క ఆచారాన్ని కనుగొన్నారు మరియు ఇది సామాజిక నమ్రత మరియు అలంకారాన్ని నిర్ధారించడానికి తగిన కొలతగా కనుగొన్నారు. ప్రవక్త(స) స్త్రీల ఏకాంతాన్ని మరియు సామాజికంగా ఒంటరిగా ఉండడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. చిరాగ్ అలీ, సర్ సయ్యద్ మరియు ఇక్బాల్ వంటి పండితులు పర్దా పట్ల మొగ్గు చూపారు, అయితే పర్దా అనేది మహిళల సామాజిక చేరికకు మరియు మొత్తం పురోగతికి ఆటంకం కలిగించదని అన్నారు.
ఆధునిక విజ్ఞానం పట్ల ప్రత్యేకించి పాశ్చాత్య విద్యారంగం పట్ల ముస్లింల ఉదాసీనత ముస్లింలను అభివృద్దికి దూరంగా ఉంచింది మరియు వారికి సామాజిక మరియు భౌతిక పురోగతి మార్గాలను మూసివేసింది సర్ సయ్యద్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇతర విభాగాలలో ఆధునిక పురోగతిని నేర్చుకునే మరియు ప్రయోజనం పొందే స్ఫూర్తిని ముస్లింలలో పెంపొందించడానికి ప్రయత్నించారు. జ్ఞాన సముపార్జకు ఇస్లాం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంది. ప్రవక్త (స) తన అనుచరులను జ్ఞానం యొక్క ఫౌంటైన్లు ఎక్కడ దొరికితే అక్కడ నుండి త్రాగమని ప్రోత్సహించారు
ఇస్లాం దాని ప్రారంభ దశలలో భౌతిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల రంగాలలో నిపుణులు అయిన ఇబ్న్ సినా, ఇబ్న్ రష్ద్, ఫరాబీ, అల్ గజాలీ మరియు ఖాల్దన్ వంటి మేధావులను తయారు చేసింది. తరువాతి రోజులలో ముస్లింలు మతాధికారుల ప్రభావంతో సానుకూల శాస్త్రాల నుండి తమను తాము దూరం చేసుకున్నారు మరియు ఇది వారి అంతిమ పతనానికి దారితీసింది
ఆధునిక
కాలంలో,
రాజి
అల్
ఫరోకీ,
మాలిక్
బిన్నబి
మరియు
నకిబ్
ఉల్
అట్టాస్
వంటి
పండితులు
ప్రబలంగా
ఉన్న
సాంప్రదాయ
మత
శాస్త్రాలతో
పాటు
భౌతిక
మరియు
సామాజిక
శాస్త్రాల
ప్రాముఖ్యతను
మళ్లీ
ముస్లింలకు
గుర్తు
చేశారు.
ఈ
మార్పు
ముస్లింలను
జ్ఞానమార్గంలో
నడిపించడం
ఖాయం
No comments:
Post a Comment