21 October 2021

ఆసియా మొదటి మహిళా లోకోమోటివ్ డ్రైవర్ ముంతాజ్ కాజీ Asia’s First Woman Locomotive Driver Mumtaz Kazi

 

 


ముంతాజ్ కాజీ 1991లో 20సంవత్సరాల వయస్సులో రైలు నడపడం ప్రారంభించినది. సాంప్రదాయ భారతీయ ముస్లిం కుటుంబానికి చెందిన ముంతాజ్ M. కాజీ ఆసియాలో మొట్టమొదటి డీజిల్ ఇంజిన్ రైలు నడిపిన మహిళా డ్రైవర్‌గా 2017 మార్చిలో ప్రతిష్టాత్మకమైన నారీ శక్తి పురస్కారాన్ని పొందినది .

సెప్టెంబర్ 1991 లో, ముంతాజ్ కాజీ, కేవలం 20 సంవత్సరాల వయస్సులో, ప్రయాణికులు మరియు సహోద్యోగుల నుండి ప్రశంసల మధ్య తన మొదటి డిజిల్ లోకోమోటివ్‌ రైల్ ను నడిపారు.. భారత దేశం లో డీజిల్ లోకోమోటివ్‌గా నడిపిన మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. ముంతాజ్  విజయం జీవితం లో ప్రతి అడ్డంకిని దాటుకొంటూ  అనేక మంది యువతులను ప్రేరేపించే ఒక విజయం.

సాధారణ మధ్యతరగతి ముస్లిం కుటుంబానికి చెందిన ముంతాజ్ ముంబైలో పుట్టి పెరిగింది.ముంతాజ్ తండ్రి అల్లారఖు ఇస్మాయిల్ కథ్వాలా, భారతీయ రైల్వేలో ట్రాక్  సూపరింటెండెంట్. SNDT విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా పూర్తి చేసిన వెంటనే, ముంతాజ్ 1988లో లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది మరియు అన్ని పరీక్షలలో  అధిక మార్కులతో ఉత్తీర్ణులైన తర్వాత, ముంతాజ్ లోకోమోటివ్ పైలట్ గా శిక్షణ కు ఎంపికై ఆసియా లో చరిత్ర సృష్టించారు. 50 మంది పురుషుల బ్యాచ్‌లో ముంతాజ్ మాత్రమే మహిళ.

ముంతాజ్ సెప్టెంబర్ 1991 లో డీజిల్ లోకోమోటివ్ అసిస్టెంట్ డ్రైవర్‌గా తన కెరీర్‌ ప్రారంభించినది మరియు లోకోమోటివ్  డ్రైవర్‌అయిన మొదటి ఆసియన్  గా నిలిచినది. లోకోమోటివ్ డ్రైవర్‌గా శారీరక శ్రమ మరియు సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇద్దరు పిల్లల తల్లి అయిన ముంతాజ్ సమయపాలనతో బాధ్యతాయుతమైన ప్రజా సేవకురాలిగా మరియు తన పని పట్ల అంకితభావంతో ఉన్న మహిళ అని నిరూపించుకుంది.

ముంతాజ్ నందూర్‌బార్‌కు చెందిన మక్సూద్ కాజీ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ను వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు

ముంతాజ్  1995 లో మొదటి మహిళా లోకోమోటివ్ డ్రైవర్‌గా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ లో స్థానం పొందినది. 2015 లో ముంతాజ్ కు రైల్వే జనరల్ మేనేజర్ అవార్డు లభించినది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 2017 లో ఆసియాలో మొట్టమొదటి మహిళా డీజిల్ ఇంజనీర్ డ్రైవర్ ముంతాజ్ కాజీకి ప్రతిష్టాత్మక 'నారీ శక్తి పురస్కారం' ముంతాజ్ కు ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముంతాజ్ కు ఈ గౌరవం దక్కింది,

భారతదేశంలోని వేలాది మంది మహిళలకు ముంతాజ్ ఒక స్ఫూర్తి.

 

 

 

No comments:

Post a Comment