భారతదేశం ఎల్లప్పుడూ
ప్రగతిశీల దేశంగానే ఉంది. మొదటి నుండి భారతీయ పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అనేక
రంగాలలో విజయాలను సాధించారు.
భారతీయ మహిళా పైలట్ల
పేర్లను వెతకడానికి ప్రయత్నిస్తే, సారహ్ హమీద్ అహ్మద్, ఇరామ్ హబీబ్, సయీదా ఫాతిమా మొదలైన
పేర్లు కనిపిస్తాయి.
కాని ఇరవయ్యో
శతాబ్దం నాటికే ముగ్గురు భారతీయ ముస్లిం మహిళా పైలట్‌లను భారతదేశం చూసింది వారు -
అబిదా సుల్తాన్, బేగం హిజాబ్ ఇంతియాజ్ అలీ మరియు జీనత్ హరూన్ రషీద్.
1.అబిదా సుల్తాన్ ABIDA
SULTAN (1913-2002):
అబిదా సుల్తాన్, మొట్టమొదటి భారతీయ
ముస్లిం పైలట్, ఈమె భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ యొక్క పెద్ద కుమార్తె, అబిదా ఆగష్టు 1913 లో జన్మించింది
మరియు మే 2002 లో 88 సంవత్సరాల వయస్సులో మరణించింది.
అబిదా కు బాల్యం
నుండే ఎగురుతున్న విమానాలు అంటే చాలా ఇష్టం మరియు 1920లో అబిదా విజయవంతంగా
విమానం నడపడానికి లైసెన్స్ పొందినది. అబిదా తొలి మహిళా పైలట్‌గా నిలిచింది.
బొంబాయి ఫ్లయింగ్ క్లబ్ మరియు కలకత్తా ఫ్లయింగ్ క్లబ్ నుండి విమానాలను నడపడానికి
అబిదా శిక్షణ తీసుకుంది. అబిదా ఖాళీ సమయాల్లో కార్లు నడపడం మరియు వేటను
ఇష్టపడుతుంది
అబిదా సుల్తాన్‌కు
సాజిదా సుల్తాన్ మరియు రబియా సుల్తాన్ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అబిదా తన తండ్రి సింహాసనాన్ని అధిష్టించాలని
భావించారు. అబిదా సుల్తాన్ కుర్వై రాజ్య పాలకుడు నవాబ్ మొహమ్మద్ సర్వర్ అలీ ఖాన్‌ను
వివాహం చేసుకున్నారు మరియు తరువాత 1950 లో కొత్తగా ఏర్పడిన
పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.
అబిదా తన
సింహాసనాన్ని వదులుకున్నప్పటి నుండి, ఆమె సోదరి సాజిదా
సుల్తాత్ వారసురాలిగా మారారు, వారి తండ్రి హమీదుల్లా ఖాన్ 1960 లో మరణించారు. పాకిస్తాన్‌లో
అబిదా విదేశీ సేవల్లో చేరింది. ఆమె కుమారుడు షహర్యార్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ
కార్యదర్శి మరియు తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ అయ్యాడు.
సాజిదా సుల్తాన్, భారతదేశంలో, ఒక క్రికెటర్, ఇఫ్తీకార్ అలీ ఖాన్
పటౌడీని వివాహం చేసుకున్నారు మరియు ఒక
కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పొందాడు.
మొదటి భారతీయ మహిళా
పైలట్ అబిదా సుల్తాన్ సైఫ్ అలీ ఖాన్ సొంత అమ్మమ్మ సోదరి.!
2. బేగం హిజాబ్ ఇంతియాజ్ అలీBEGUM HIJAB IMTIYAZ ALI:
మొదటి భారతీయ
ముస్లిం మహిళా పైలట్ బేగం హిజాబ్ ఇంతియాజ్ అలీ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క మొదటి
భారతీయ మహిళా పైలట్ అని చెప్పబడింది. ఆమె చాలా ప్రగతిశీల కుటుంబానికి చెందినది, వివాహం చేసుకుని ఒక
కుమార్తె పుట్టాక కూడా ఆమె తన కలను సాకారం చేసుకునేందుకు అనుమతించబడినది..
హిజాబ్ అద్భుతమైన
రచయిత్రి. హిజాబ్ అనేక కథలు రాసింది మరియు తెహజీబ్-ఇ-నిజావాన్ అనే పత్రికకు ఎడిటర్‌గా
కూడా ఉంది. బేగం హిజాబ్ హైదరాబాదు కులీనుల కుటుంబానికి చెందినవారు మరియు ప్రముఖ ఉర్దూ రచయిత ఇంతియాజ్ అలీ తాజ్‌ని
వివాహం చేసుకున్నారు.
3.జీనత్ హరూన్ రషీద్ ZEENAT HAROON RASHEED (1928 -2017):
ఆర్థిక శాస్త్రంలో ముస్లింల పాత్రను అభివృద్ధి
చేయడానికి మరియు నిర్వచించడానికి ప్రధాన సహకారం అందించిన బ్రిటిష్ భారతదేశంలోని
ప్రముఖ రాజకీయ నాయకులైన సర్ అబ్దుల్లా హరూన్ కుమార్తె జీనత్ హరూన్ రషీద్ 1928 లో
జన్మించి 2017 లో మరణించారు.
జీనత్ బ్రిటిష్ ఇండియాలో మొదటి పైలట్లలో ఒకరు
మరియు 1951 ప్రారంభంలో ఆస్ట్రేలియన్ మహిళా పైలట్ల
సంఘాన్ని ఏర్పాటుచేసిన నలభై తొమ్మిది మంది మహిళలలో ఒకరు.
భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత
జరిగిన ఈ పేర్లు మరుగున పడిపోయాయి. ఈ ఆదర్శప్రాయమైన మహిళల విజయ గాధ ను వివరించుట ఈ
వ్యాస ప్రధాన లక్ష్యం.
No comments:
Post a Comment