10 October 2021

ఇస్లామిక్ ప్రపంచంలో విద్య పట్ల పెరుగుతున్న ఆసక్తి Re-emergence of education in Islamic world

 







విద్య దేశాభివృద్ధికి మౌలికమైనది మరియు ఉన్నత విద్య అనేది పేదరిక నిర్మూలనకు, భాగస్వామ్య శ్రేయస్సును పెంపొందించడానికి, కాలానుగుణ సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు  సమాజాన్ని బలోపేతం చేయడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఈ ప్రాథమిక వాస్తవం ముస్లిం ఉమ్మాకు మధ్య యుగాలలో బాగా తెలుసు.

ఇస్లామిక్ చరిత్రలో మద్య యుగాలు స్వర్ణ యుగ కాలం. "జ్ఞానాన్ని వెతకండి" అనేది ముస్లింలకు.  ఇస్లాం ఇచ్చిన  యొక్క ఆజ్ఞ అని తెలుసు మరియు వారు దానిని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అనుసరించారు.

గత నాలుగు శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు విద్య మినహా జీవితంలోని ప్రతి అంశంపై గొప్ప ఆసక్తిని కనబరిచారు. కవిత్వం, సంగీతం, పెయింటింగ్, సెరామిక్స్, ఆర్కిటెక్చర్, మెటల్ వర్క్ మొదలైనవి ఇస్లామిక్ ప్రపంచo లో  ముఖ్యమైన కార్యకలాపాలుగా మారాయి.

ఆధునిక విద్యపై ముస్లిం సమాజం లో చాలా తక్కువ ఆసక్తి చూపబడింది. 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్‌ని ఉపయోగించడానికి ముస్లిములు నిరాకరించడం అత్యంత హానికరమైన చర్య, ప్రింటింగ్ ప్రెస్‌ల ద్వారా, ఐరోపాలో శాస్త్రీయ మరియు పారిశ్రామిక రంగాలలో శాస్త్రీయ విప్లవం సాధ్యమైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆధునిక జ్ఞానం మరియు ఉన్నత అక్షరాస్యత లేకుండా పశ్చిమ దేశాల దోపిడీని అరికట్టలేమని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇది 19 వ శతాబ్దం చివరలో సర్ సయ్యద్ ముస్లిం ఉమ్మకు చెప్పాడు. అదృష్టవశాత్తూ, ఇటీవలి కాలంలో అనగా 21 వ శతాబ్దంలో  ఇస్లామిక్ ప్రపంచంలో విద్య తిరిగి ప్రాముఖ్యత పొందుతుంది.,.

జాన్ మిల్లర్ సర్వే ప్రకారం, 5 ముస్లిం దేశాలు-అజర్‌బైజాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అత్యధిక అక్షరాస్యత అనగా 100% అక్షరాస్యత  కలిగిన 25 దేశాలలో స్థానం పొందాయి..

 ప్రపంచ బ్యాంక్ మరియు UNSECO డేటా 2018 లో 25 ముస్లిం మెజారిటీ దేశాలు సాధించిన అక్షరాస్యత సగటున  90 శాతానికి పైగా ఉంది-. వీటిలో సౌదీ అరేబియా (95%), ఇండోనేషియా (94%), మలేషియా (94%), ఇరాన్ (90%), జోర్డాన్ (96%), U.A.E. (94%) మరియు టర్కీ (95%) ఉన్నాయి.

సిరియా (86%), ట్యునీషియా (82%), ఇరాక్ (79%), ఈజిప్ట్ (75%) అల్జీరియా (73) మరియు మొరాకో (72%) వంటి తొమ్మిది దేశాలు 70%నుండి 89% వరకు అక్షరాస్యతను కలిగి ఉన్నాయి.

బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు నైజీరియా వంటి అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాలతో సహా పదిహేను దేశాలు 62%కంటే తక్కువ అక్షరాస్యతలో విద్యలో ఇంకా వెనుకబడి ఉన్నాయి.

అయితే, 1980 నాటి అక్షరాస్యత డేటా (సగటు .30%) తో పోలిస్తే, 2018 డేటా అత్యంత సంతృప్తికరంగా ఉంది.

ప్రపంచ అక్షరాస్యత రేటు (2017) 82% (పురుషులు, 87%; మహిళలు 77%).

అనేక ఇస్లామిక్ దేశాలలో అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం (పురుషులు మరియు మహిళల) మద్య కూడా బాగా పడిపోయింది. కనీసం 21 దేశాలలో  తేడా కేవలం 0 నుండి 7% మాత్రమే.

ఇస్లామిక్ ప్రపంచంలో టెరిటరీ ఎడ్యుకేషన్ Tertiary Education (విజ్ఞానంలోని అన్ని విభాగాలలో ఉన్నత విద్య) పై తీవ్రమైన శ్రద్ధ అవసరం. సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, టర్కీ మొదలైన అనేక దేశాలలో పరిశోధన వ్యయం (Research spending) గణనీయంగా పెరిగింది.

 

పాశ్చాత్య దేశాలలో టెరిటరీ ఎడ్యుకేషన్ Tertiary Education సాధారణంగా 40% కంటే ఎక్కువగా ఉంటుంది, అయితే టర్కీ, సౌదీ అరేబియా మరియు ఇండోనేషియా వంటి కొన్ని దేశాలను మినహాయించి, మిగతా ఇస్లామిక్ దేశలలో ఇది 2 నుండి 6% మధ్య ఉంటుంది.

ముస్లిం దేశాలలో పరిశోధన వ్యయంపై కూడా తీవ్రమైన శ్రద్ధ అవసరం. టర్కీ, సౌదీ అరేబియా, ఇరాన్ మరియు ఖతార్ వంటి దేశాలు పరిశోధన వ్యయం Research spending కోసం గణనీయంగా నిధులను సేకరించాయి. ఖతార్ సైన్స్ బడ్జెట్‌ను దాని GDP లో 0.8% నుండి 2.8% కి పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

అనేక ముస్లిం దేశాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత విద్యా కేంద్రాలను (యూనివర్సిటీలు) ఏర్పాటు చేశాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2018 ప్రకారం, ముస్లిం దేశాలకు చెందిన తొంభై ఆరు యూనివర్సిటీలు ప్రపంచంలోని 1102 విశ్వవిద్యాలయాలలో జాబితా లో చేర్చబడ్డాయి. అందులో 22 టర్కీకి చెందినవి, తరువాత ఇరాన్ 18; పాకిస్తాన్, 10; మలేషియా మరియు ఈజిప్ట్ 9; సౌదీ అరేబియా 5; U.A.E. మరియు ఇండోనేషియా లో 4.  జోర్డాన్ మరియు మొరాకో లో 3; ట్యునీషియా 2 మరియు అల్జీరియా, బంగ్లాదేశ్, కువైట్, లెబనాన్, నైజీరియా, ఒమన్ మరియు ఖతార్ లో  1 చొప్పున ఉన్నవి..

మరో ప్రధాన లక్షణం ఏమిటంటే, నలభై ఒకటి విశ్వవిద్యాలయాలలో, మగ విద్యార్థుల కంటే మహిళా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

పదకొండు విశ్వవిద్యాలయాలలో  65:35 నిష్పతిలో స్త్రీ-పురుష   విద్యార్ధులు ఉన్నారు.

సౌదీ అరేబియాలోని ఇమామ్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ ఫైసల్ యూనివర్సిటీ (మొత్తం 22,257 మంది విద్యార్థులు)  స్త్రీ-పురుషుల విద్యార్ధుల నిష్పత్తి అత్యధికంగా 81:19 కలిగి ఉంది,

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూనివర్సిటీ. (మొత్తం 7,492 మంది విద్యార్థులు) స్త్రీ-పురుషుల విద్యార్ధుల నిష్పత్తి 79: 21,

ఖతార్ యూనివర్సిటీ., (మొత్తం 13,342 విద్యార్థులు) స్త్రీ-పురుషుల విద్యార్ధుల నిష్పత్తి 73:27

 కువైట్ యూనివర్సిటీ., (మొత్తం 37,752 విద్యార్థులు) స్త్రీ-పురుషుల విద్యార్ధుల నిష్పత్తి 72:28 .)కలిగి ఉన్నాయి.

గమనిక: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి కారణంగా 2019 మరియు 2020 నివేదికలు పరిగణనలోకి తీసుకోబడలేదు)

మూలం: యుఎన్ ఏజెన్సీలు & వరల్డ్ ఫ్యాక్ట్ బుక్

No comments:

Post a Comment