23 October 2021

మీర్ సుల్తాన్ ఖాన్-చెస్ ప్రపంచానికి రాజు मीर सुलतान ख़ान : शतरंज की दुनिया का बादशाह

 

డిసెంబర్, 1930లో   ఇంగ్లాండ్‌లోని హేస్టింగ్స్‌లో జరిగే వార్షిక ఆటల పోటిలలో ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. జోస్ రాల్ కాపాబ్లాంకా, క్యూబా నుండి వచ్చిన గొప్ప చెస్ క్రీడాకారుడు. ఇతడు  బ్రిటిష్ ఇండియా పంజాబీ  ఆటగాడితో పోటీ పడుతున్నాడు. బ్రిటిష్ ఇండియా పంజాబీ ఆటగాడు 1929 లో బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోన్నా  అతను కాపాబ్లాంకాను ఓడించడం అసాధ్యమని అందరు భావించారు. కానీ ఈ పంజాబీ ఆటగాడు కపాబ్లాంకాను ఓడించాడు. చెస్ చరిత్రలో, ఈ గేమ్ 'ఖాన్ కా గుస్సా ख़ान का ग़ुस्सा ' గా ప్రసిద్ధి చెందింది.

 

 ఈ పంజాబీ ఎవరు? ఈ వ్యక్తి పేరు మనకు ఎందుకు తెలియదు?

 

ఈ పంజాబీ ఆటగాడు పేరు మీర్ సుల్తాన్ ఖాన్. ఇతను  బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్‌కు చెందిన మిత్తా తివానాకు చెందినవాడు. మీర్ సుల్తాన్ ఖాన్ కుటుంబం పిర్స్ మరియు జమీందార్ల కుటుంబం మరియు మీర్ సుల్తాన్ ఖాన్ తండ్రి మియాన్ నిజాం దిన్,  అతనికి చెస్ ట్రిక్స్ పరిచయం చేశాడు. 1903 లో జన్మించిన సుల్తాన్ ఖాన్ 21సంవత్సరాల వయస్సులో పంజాబ్ యొక్క ఉత్తమ చెస్ ఆటగాడిగా పరిగణించబడ్డాడు. ఈ సమయంలోనే సర్ ఉమర్ హయత్ ఖాన్  మరియు   అతని కుటుంబం తమ నివాసంలో చెస్ జట్టును ఏర్పాటు చేయడానికి మీర్ సుల్తాన్ ఖాన్ ను గొప్ప జీతంతో ఒప్పించింది.

 

 సర్ ఉమర్ 1928 లో నిర్వహించిన ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్‌షిప్‌లో సుల్తాన్ ఖాన్  విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 1929 లో, సుల్తాన్ సర్ ఒమర్‌తో కలిసి సుల్తాన్ ఖాన్  ఇంగ్లాండ్ వచ్చారు. ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రెండు రోజుల్లో, సుల్తాన్ ఖాన్  కాపాబ్లాంకాతో అనధికారికంగా పోటి పడ్డాడు. కాపాబ్లాంకా పై సుల్తాన్ సులభంగా గెలిచాడు.

1929 లో, సుల్తాన్ బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో సమానం ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యం చాలా పెద్దది. రెండవది, సుల్తాన్ చదరంగం భారతీయ ఉపఖండం నుండి నేర్చుకున్నాడు మరియు అది యూరోపియన్ విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది

 

 


ఆ తర్వాత సుల్తాన్ కొన్ని నెలలకు  సుల్తాన్ పంజాబ్‌కు తిరిగి వచ్చాడు, కానీ 1930 లో సర్ ఉమర్‌తో కలిసి మరోసారి ఇంగ్లాండ్ చేరుకుని చెస్ ప్రపంచంలో తన కీర్తిపతాకాన్ని ఎగర వేసాడు. 1932 మరియు 1933లో సుల్తాన్ బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచాడు.. ఈ సమయంలో సుల్తాన్ చెస్ ఒలింపియాడ్‌లో బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రాతినిధ్యం వహించాడు. కాపాబ్లాంకా కాకుండా, సుల్తాన్ సలో ఫ్లోర్, అకిబా రూబిన్‌స్టెయిన్ మరియు సావెల్లి టార్టకోవర్ వంటి చెస్ ప్రముఖ క్రీడాకారులను కూడా ఓడించాడు.

 

సర్ ఉమర్ 1933 లో సుల్తాన్‌తో పాటు ఇంగ్లాండ్ నుండి పంజాబ్‌కు తిరిగి వచ్చారు. సుల్తాన్‌కు ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి ఆర్ధిక వనరులు లేనందున, ఆ తర్వాత సుల్తాన్  అంతర్జాతీయ పోటీలలో పాల్గొనలేకపోయాడు మరియు తన స్వగ్రామంలో వ్యవసాయంపై మాత్రమే దృష్టి పెట్టాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుల్తాన్ ఖాన్ జిల్లా పాకిస్తాన్ భాగంలోకి వచ్చింది మరియు సుల్తాన్ పాకిస్తాన్ పౌరుడు అయ్యాడు. చివరకు  సుల్తాన్ 1966 లో ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు.


1950 తరువాత, అంతర్జాతీయ చదరంగం సమాఖ్య గ్రాండ్ మాస్టర్ బిరుదు ఇవ్వడం ప్రారంభించినప్పుడు, చాలా మంది రిటైర్డ్ ఆటగాళ్లకు ఈ బిరుదు లభించింది కానీ సుల్తాన్ ఖాన్ సాహిబ్‌కు ఈ బిరుదు లభించలేదు.

 

మీర్ సుల్తాన్ ఖాన్ నిరక్షరాస్యుడు మరియు ఉమర్ హయత్ ఖాన్ సేవకుడు అని కొందరు అంటారు.  కాని ఈ వాదనను మీర్ సుల్తాన్ ఖాన్ కుటుంబం తిరస్కరించింది. మీర్ సుల్తాన్ ఖాన్ స్వయంగా జమీందార్ కుటుంబానికి చెందినవాడు మరియు ఇంగ్లీష్, ఉర్దూ మరియు అరబిక్ తెలిసినప్పటికీ, జాత్యహంకార ధోరణుల కారణంగా ఆంగ్ల రచయితలు  అలా అంటున్నారని కొందరు అంటారు..

No comments:

Post a Comment