30 October 2021

పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటకకు చెందిన 'నారింజ కాయలు అమ్మే' మరియు ఒక పాఠశాలను నిర్మించిన హరేకల హజబ్బా కథ The story of Padma Shri Awardee Harekala Hajabba the 'orange-seller' of Karnataka who built a school

 
నవంబర్ 8, 2021న  హరేకల హజబ్బ న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి నుండి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ బహుమతిని అందుకొంటారు. హరేకల హజబ్బ జనవరి 25, 2020న పౌర పురస్కారo పద్మశ్రీ  గ్రహీతగా ప్రకటించబడ్డాడు.

 

హజబ్బ నారింజ పండ్లను విక్రయించి, వ్యక్తులు ఇచ్చిన కొద్దిపాటి విరాళాల నుండి వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలను నిర్మించి అక్షర శాంత గా ప్రసిద్ధి చెందాడు.

 

పద్మశ్రీతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నప్పటికీ, హజబ్బ ఎప్పుడూ వినయంగా మరియు శాంతంగా ఉంటాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా హాజబ్బ తను నిర్మించిన పాఠశాలకు వెళ్లి ఆవరణ శుభ్రo గా ఉండేలా  చూసుకుoటాడు. ఎందుకంటే మహమ్మారి తర్వాత పిల్లలు సంతోషంగా పాఠశాలకు తిరిగి వస్తారు.

“పద్మశ్రీ అవార్డు నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు. ఇది నా పాఠశాలతో పాటు నా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన వేలాది మంది వ్యక్తులు, ప్రభుత్వ అధికారులకు గౌరవం. నా పాఠశాల మెరుగైన మౌలిక సదుపాయాలు కలిగి  నాణ్యమైన విద్యను  హరేకల మరియు చుట్టుపక్కల గ్రామాల లోని వేలాది మంది పిల్లలకు విద్యనందిస్తున్నది” అని హజబ్బ వినయంగా అంటాడు.

 

హజబ్బ కు సొంత ఇంటి స్థలం లేదు. తన కథను వివరిస్తూ, హజబ్బ ఇలా అంటాడు, "నేను మంగళూరు మార్కెట్‌లో నారింజ పండ్లను విక్రయిస్తున్నప్పుడు, ఒక జంట నా దగ్గరకు వచ్చి కన్నడలో సంభాషించడానికి ప్రయత్నించారు మరియు చిరునామా కోసం అడిగారు. నేను ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు మరియు నాకు కన్నడ భాష మాట్లాడటం రాదు. నేను స్థానిక భాషలైన తుళు మరియు బేరీ (దక్షిణ కన్నడ మరియు కేరళ సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు ముఖ్యంగా ముస్లిం సమాజాలు మాట్లాడే భాష)లోనే మాట్లాడగలను. అందుకే, నేను కన్నడo చదవడం, మాట్లాడటం  నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక కొత్తపాఠశాల ప్రారంభించాలని అనుకొన్నాను., కానీ ఎలా ప్రారంభించాలి అనేది తెలియ లేదు.

హజబ్బ కొత్త పడ్పులోని త్వాహా జుమ్మా మసీదు కోసం పని చేసేవాడు కాబట్టి, పాఠశాలను ప్రారంభించగలమా అని మస్జిద్ కమిటీ సభ్యులను అడిగాడు. దానికి వారు అంగీకరించారు మరియు ముస్లిం సమాజం లోని సంపన్నులు డబ్బు విరాళంగా ఇచ్చారు. 1994 లో కొత్త పడ్పులో రావలతుల్ ఉలేమా మదర్సాను ప్రారంభించాము మరియు దానిలో ముస్లిం సమాజానికి చెందిన అనేక మంది పిల్లలు మదర్సాలో చేరారు. తరగతులు విజయవంతంగా కోనసాగాయి మరియు నా పనికి గుర్తింపు లభించింది. నన్ను త్వాహా జుమ్మా మస్జిద్ కమిటీ కోశాధికారిగా నియమించారు."


కాని  హజబ్బ ఇంతటితో ఆగలేదు. హజబ్బ ఐదో తరగతి దాటి చదవాలనుకునే అమ్మాయిలు మరియు పాఠశాలకు వెళ్లాలనుకునే ఇతర వర్గాల పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. "కన్నడ మీడియం పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన నా మదిలో ఎప్పటినుంచో ఉంది. అనుమతి కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించగా, మదర్సాలలో కేవలం అరబిక్ మాత్రమే బోధనా మాధ్యమం అని అధికారులు నాకు తెలియజేశారు. అందుకే, డబ్బు పొడుపు  చేయాలని నిర్ణయించుకున్నాను మరియు కన్నడ మీడియం పాఠశాలను నిర్మించడానికి కొంత స్థలం కొనడానికి ప్రజల సహాయం కోరాను," అని హజబ్బ చెప్పారు.

అనేక అవమానాలను, ఆర్ధిక ఇబ్బందులను  సహిస్తూ కూడా  హజబ్బ పాఠశాలను నిర్మించాలనే  తన ఉద్దేశ్యం నుండి వెనక్కి తగ్గలేదు. 1999లో, హజబ్బ కొత్త పడ్పులో 40 చదరపు అడుగుల చిన్న స్థలాన్ని కొన్నాడు. ఇంకో దాత సహాయంతో, అదే స్థలంలో మరొక ఎకరం భూమిని హాజబ్బ కొన్నాడు. 2000 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వ విద్యా శాఖ పాఠశాలను నిర్మించడానికి అనుమతిని మంజూరు చేసింది."

 

హజబ్బ కు పాఠశాల నిర్మాణంలో కొందరు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా  అప్పటి కొత్త పడ్పు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె ఆనంద్ సహాయ చేసారు.  దాతలు కేవలం డబ్బు మాత్రమే కాదు, పాఠశాలను నిర్మించడానికి అవసరమైన భారీ నిర్మాణ యంత్రాలు మరియు సిమెంటు సహాయం చేసారు. ఆరు బుల్డోజర్ల సహాయం తో  పాఠశాల నిర్మాణ స్థలం చదును చేయబడినది. కొన్ని నెలల్లోనే ఎనిమిది తరగతి గదులు మరియు రెండు మరుగుదొడ్లతో పాఠశాలను నిర్మించబడినది. జూన్9,2001, పాఠశాలను భారీ వేడుకల మధ్య ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ, స్థానిక రాజకీయ నాయకులు మరియు సంపన్న వ్యక్తులు పాఠశాలకు బెంచీలు, డెస్క్‌లు మరియు ఇతర అవసరమైన సామాగ్రిని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు, మా ప్రాథమిక పాఠశాల భవనంలో 91 మంది పిల్లలు చదువుతున్నారు అని తన దాతృత్వ పని ద్వారా అక్షర సంత్ (అక్షర సాధువు) బిరుదు పొందిన హాజబ్బ చెప్పారు.


పాఠశాల అభివృద్ధికి సర్వశిక్షా అభియాన్ నుండి నిధులు పొందటానికి పాఠశాల అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (SDMC)ని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ హాజబ్బను కోరింది. ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లేదా పాఠశాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి నిధులు కేటాయిస్తుంది.

 

ఎస్‌డిఎంసి వైస్‌ చైర్మన్‌ గా ఎన్నికైన హాజబ్బ పేరు మీద బ్యాంకు ఖాతా క్రియేట్‌ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశాం. పిల్లల కోసం కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించాము నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి మరియు పిల్లలు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుంటారు అని హాజబ్బ గర్వంగా చెబుతాడు.

 

పాఠశాల ప్రారంభించాలనే హాజబ్బ కల నెరవేరింది కొన్ని నెలల తర్వాత హైస్కూల్ నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరాడు. పాఠశాల ఆవరణలో హై స్కూల్ భవనాన్నికూడా  మంజూరు చేయించుకోగలిగారు.

 

2003లో, హజబ్బ తిరిగి నారింజ పండ్లను అమ్మడం మరియు ప్రజల నుండి విరాళాలు సేకరించడం ద్వారా డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. "హై స్కూల్ నిర్మాణం 2010లో ప్రారంభమైంది మరియు చివరకు 2012లో పూర్తయింది. హై స్కూల్ లో లైబ్రరీ మరియు ఆరు కంటే ఎక్కువ తరగతి గదులు ఉన్నాయి, VIII నుండి X తరగతుల పిల్లలు చదువుతారు. తరగతి గదులకు రాణి అబక్క, కల్పనా చావ్లా, స్వామి వివేకానంద తో సహా ప్రముఖ వ్యక్తుల పేరు పెట్టారు. ఈ పేర్లను చదవడం మరియు వారి కథను గుర్తుంచుకోవడం ద్వారా పిల్లలు మరిన్ని విజయాలు సాధించేలా ప్రేరేపించాలనే ఆలోచన ఉంది" అని హాజబ్బ నవ్వుతూ వివరించారు.

 

హజబ్బను భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఏమిటని అడిగినప్పుడు,  "పియుసి I మరియు పియుసి II కోసం కాలేజీని నిర్మించడానికి డబ్బు విరాళం గా ఇవ్వమని నేను కొంతమందిని అడిగాను. కానీ మహమ్మారి వలన దెబ్బతినడం మరియు నిరంతర లాక్డౌన్లు ఉండటంతో ప్రణాళికలు ఆలస్యం అయ్యాయి. "అని వివరించాడు.

 

No comments:

Post a Comment