సయ్యదా ముహమ్మదీ బేగం భారత ఉపఖండంలో మహిళల సాధికారికత
కోసం వెలుబడిన ఉర్దూ వారపత్రిక ‘తెహజీబ్-ఇ-నిస్వాన్ Tehzeeb-e-Niswaan’’ కు ఎడిటర్
గా పనిచేసిన మొదటి మహిళ. తెహజీబ్-ఇ-నిస్వాన్ ఉర్దూ
పత్రిక మొదటి ఎడిషన్ 1జూలై,
1898 న వచ్చింది.
ముహమ్మదీ బేగం తన భర్త ముంతాజ్ అలీతో కలిసి తన కృషిని
ప్రారంభించింది. మహిళల హక్కుల గురించి
నొక్కిచెప్పే పుస్తకం ‘హుఖూక్-ఇ-నిస్వాన్ Huqooq-e-Niswaan రాసిన ముంతాజ్ అలీ దరూల్ ఉలూమ్, డియోబంద్
లో చదువుకున్న లాహోర్ ఆధారిత ప్రచురణకర్త. ముంతాజ్ అలీ, అలీగఢ్ ఉద్యమ నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
యొక్క సన్నిహితుడు. AMU లో ఒక హాస్టల్ కు ముంతాజ్ అలీ పేరు
పెట్టబడింది. ముహమ్మదీ బేగం మరియు ఆమె
భర్త ముంతాజ్ అలీ ముస్లిం పురుషులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఆధునిక విద్యను
పొందడం ముఖ్యమని గ్రహించారు. మ్యాగజైన్ ప్రారంభించినప్పుడు అలీగఢ్ కళాశాల కేవలం
బాలుర సంస్థ మాత్రమేనని, అలీగఢ్‌లో మహిళా కళాశాల లేదని గుర్తుంచుకోవాలి.
నిజానికి,
సయ్యద్ అహ్మద్ ఖాన్, మహిళా విద్యపై ముంతాజ్ మరియు ముహమ్మదీ బేగంలతో
విభేదించారు. సర్ సయ్యద్ మరణం వరకు ముహమ్మదీ బేగం మరియు ఆమె భర్త ముంతాజ్
అలీ, మహిళల కోసం పత్రికను ప్రారంభించలేదు.
1878 లో పంజాబ్‌లోని షాపూర్‌లో జన్మించిన ముహమ్మదీ బేగం 1897 లో ముంతాజ్ అలీని వివాహం చేసుకున్నారు. ముహమ్మదీ తండ్రి సయ్యద్ ముహమ్మద్ షఫీ వజీరాబాద్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మరియు తన కుమార్తెలు ఆధునిక విద్యను పొందేలా చూశారు. ముహమ్మది బేగం క్రికెట్ ఆడటం మరియు గుర్రపు స్వారి చేసేవారు. ముహమ్మదీ బేగం ముంతాజ్‌ను వివాహం చేసుకున్నప్పుడు, ముంతాజ్ అలీ అప్పటికే లాహోర్‌లో ఒక ప్రచురణాలయం మరియు ప్రింటింగ్ ప్రెస్‌ను కలిగి ఉన్నాడు.
ఒక
సంవత్సరంలోనే, ముహమ్మది బేగం తన భర్త ముంతాజ్ అలీ నుండి ప్రచురణ, ఎడిటింగ్
మరియు ప్రూఫ్ రీడింగ్ కళను నేర్చుకుంది. ముహమ్మది బేగం ఇంగ్లీష్,
హిందీ, ఉర్దూ, పర్షియన్ మరియు అరబిక్ చదవగలదు. త్వరలోనే
మహిళల కోసం అంకితమైన మొదటి ఉర్దూ వారపత్రిక ‘తెహ్జీబ్-ఇ-నిస్వాన్’ ముహమ్మదీ
బేగం మరియు ఆమె భర్త ముంతాజ్ అలీ చే ప్రారంభించబడింది.
ఊహించినట్లుగా, ఆనాటి ప్రజలు అలాంటి ప్రగతిశీల పత్రికను సానుకూలంగా తీసుకోలేదు. ముహమ్మదీ బేగం మరియు ముంతాజ్ అలీ బాగా చదువుకున్న వారికి ఉచిత కాంప్లిమెంటరీ కాపీలు పంపేవారు. మ్యాగజైన్ సర్క్యులేషన్ చాలా నెమ్మదిగా ప్రగతి సాధించినది. మూడు నెలల తర్వాత 70 మంది, మూడు సంవత్సరాల తర్వాత 345 మంది, ఐదు సంవత్సరాల తర్వాత 428 మంది చందాదారులుగా చేరారు.
ముహమ్మదీ బేగం కు ఒక కుమారుడు, ఇంతియాజ్ అలీ ఉన్నారు, అతన్ని తాజ్ అని ప్రేమగా పిలిచేవారు. ముహమ్మదీ బేగం కుమారుడు తాజ్ కోసం ప్రత్యేకంగా కథలు, కవితలు, నాటకాలు మరియు లాలిపాటలు వ్రాసేది. ముహమ్మదీ బేగం తన కుమారుడు తాజ్ ను సాహిత్య అభిరుచి గల వ్యక్తిగా రూపొందించారు. ఇంతియాజ్ అలీ త్వరలో పత్రికను ఎడిట్ చేసే స్థాయికి ఎదిగారు మరియు ఉర్దూ సాహిత్యంలో గొప్పవారిలో ఒకరిగా స్థిరపడ్డారు.
ముహమ్మదీ బేగం తరువాత 1905 లో
మహిళల కోసం ‘ముషీర్-ఇ-మదర్ Musheer-e-Madar’’ అనే
మరో పత్రికను ప్రారంభించింది. ముహమ్మదీ బేగం మరణం తర్వాత అది పెద్దగా మనుగడ
సాగించలేదు. ముహమ్మదీ బేగం మహిళల కోసం పాఠశాలలను కూడా ఏర్పాటు చేసింది. ముహమ్మదీ
నిర్వహించిన ఒక ఆసక్తికరమైన ప్రయోగం మొత్తం మహిళల దుకాణం. ఈ దుకాణం కేవలం మహిళలు
మరియు మహిళల కోసం నిర్వహించబడుతుంది మరియు అందులో పని కోసం ఏ పురుషుడిని దుకాణం
లోపలికి అనుమతించలేదు. ఆసక్తికరంగా, అష్రఫ్ అలీ థాన్వి రచన “బహిస్టి జెవార్ Bahishti Zewar”
టైటిల్ ముహమ్మదీ బేగం రాసిన ఒక కవిత నుండి ప్రేరణ పొందింది.
1897 నుండి, మహమ్మదీ బేగం సామాజిక పనిలో బిజీగా ఉంది. మహమ్మదీ బేగం పత్రికలను ఎడిట్ చేసిది, వ్యాసాలు, కథలు, కవితలు వ్రాసింది మరియు బహిరంగ సభలు నిర్వహించి భారతదేశంలోని మహిళల సాధికారికత కోసం కృషి చేసింది. ఈ హార్డ్ వర్క్ మహమ్మదీ బేగం ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపింది మరియు 1908 లో 30 సంవత్సరాల వయస్సులో మహమ్మదీ బేగం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టింది
No comments:
Post a Comment