పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించిన మరియు వందల సంవత్సరాల నాటినుండి దివ్య ఖురాన్‌లో ఉన్న ఉదాహరణలను పరిశీలించుదాము ..
ది యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వారు చేసిన ఒక పరిశోధనలో, శాస్త్రవేత్తల బృందం గెలాక్సీలు అనే పదం కాకుండా బిల్డింగ్ బ్లాక్స్ అఫ్ గెలాక్సీలు building blocks of galaxies అనే పదo ఉపయోగించడాన్ని ఇష్టపడతారని పేర్కొన్నారు. ఈ బిల్డింగ్ బ్లాక్స్ అఫ్ గెలాక్సీలు ద్వారా స్ట్రింగ్ లేదా నెక్లెస్ లోని ముత్యాల వరుసలో విశ్వం అలంకరించబడిందని అంటున్నారు.
కాస్మిక్ వెబ్‌ని కనుగొన్న శాస్త్రవేత్త పల్లె ముల్లర్, ఇలా అంటారు: “మొదటి గెలాక్సీలు లేదా మొదటి గెలాక్సీ బిల్డింగ్ బ్లాక్స్, కాస్మిక్ వెబ్ యొక్క థ్రెడ్‌ల లోపల ఏర్పడతాయి. కనిపించని థ్రెడ్‌లు కాంతిని విడుదల చేయడం ప్రారంభించినప్పుడు, అవి స్ట్రింగ్‌లోని పూసల వలె ఉండటాన్ని చూడవచ్చు.
ఆకాశం ఒక బిల్డింగ్:
కాస్మోస్ మరియు దాని నిర్మాణం గురించి చాలా వ్యాసాలు మరియు శాస్త్రీయ పరిశోధనలను శోధించిన తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు కాస్మిక్ బిల్డింగ్/ విశ్వ భవనం యొక్క వాస్తవాన్ని ధ్రువ పరుస్తున్నారు. ఖగోళ శాస్త్రంలో "కాస్మోస్ బిల్డింగ్" అనే పదం లేని కథనం లేదా పరిశోధన చాలా అరుదు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ శాస్త్రీయ వాస్తవాన్ని అంటే కాస్మిక్ బిల్డింగ్ యొక్క వాస్తవాన్ని అంగీకరిస్తారని ఇది సూచిస్తుంది.
దివ్య ఖురాన్‌కు లో
కాస్మిక్ బిల్డింగ్ యొక్క ప్రస్తావన-
మీ కొరకు భూమిని నివాస స్థలంగా చేసిన వాడూ, పైని ఆకాశాన్ని కప్పుగా నిర్మించిన వాడూ, మీ రూపాన్ని తీర్చి దిద్దిన వాడూ, దానిని ఎంతో చక్కగా మలచిన వాడూ, మీకు పరిశుబ్రమైన పదార్ధాలను ఆహారంగా ఇచ్చిన వాడూ, అల్లాహ్ యే కదా! ఆ అల్లాహ్ యే (ఈ పనులన్నీ చేసిన వాడూ) మీ ప్రభువు. ఆ విస్వప్రభువు అసంఖ్యాకమైన శుభాలు కలవాడు. (దివ్య ఖురాన్ 40: .64)
మ్యాగ్నిఫైయిoగ్ టెలిస్కోప్ ద్వారా ఆకాశం వైపు చూసినప్పుడు, నక్షత్రాలు, గ్యాస్, మేఘాలు, వాయువు మరియు పొగ stars, gas, clouds gas and smoke యొక్క ఖచ్చితమైన నిర్మాణాన్ని చూస్తాము. ఆకాశాన్ని అలంకరించే నక్షత్రాలు మెరిసే రంగుల్లో కనిపిస్తాయి.
ఈ కాస్మిక్
బిల్డింగ్/విశ్వ భవనం యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి
దివ్య ఖురాన్
లో:”మిమ్మల్లి సృష్టించడం కష్టమైన పనా లేక ఆకాశాన్ని సృష్టించడమా? అల్లాహ్ దానిని నిర్మించాడు,
దాని కప్పును బాగా పైకి లేపాడు, తరువాత దానికి సమతూకాన్ని ఏర్పరిచాడు. - 79:27,28
మీ కొరకు భూమిని పాన్పుగాను, ఆకాశాన్ని కప్పు గాను సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి, తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించినవాడు ఆయనే! ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టకండి”-దివ్య ఖురాన్ 2: 22
క్రీ.శ. 7శతాబ్దం లో వివరించబడినది 21వ శతాబ్దం లో నిర్ధారించబడినది. దివ్య ఖురాన్ లో కాస్మోస్ బిల్డింగ్ వర్ణన అనేది యాదృచికమా లేక అద్భుతమా!
అల్లాహ్ ఇలా అంటాడు: "భూమి లోనూ, ఆకాశంలలోనూ ఉన్నటువంటి దానిని కళ్ళు తెరిచి చూడండి.” అసలు విశ్వసించడానికె ఇష్టపడని వారికి సూచనలు గానీ, హెచ్చరికలుగానీ ఎలా ఉపయోగపడతాయి?దివ్య ఖురాన్ 10:.101
దివ్య ఖురాన్, అల్లాహ్ (సర్వశక్తిమంతుడు) అని బహిర్గతం
చేస్తున్నప్పుడు అల్లా చెప్పిన ఒక స్పష్టమైన అద్భుతం మరియు నిజం: "మేము
త్వరలోనే వారికి మా సూచనలనూ వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ
చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశిదమైపోతుoది.మీ
ప్రభువు ప్రతి దానికి సాక్షి అనే విషయం సరిపోదా? 41 :53
No comments:
Post a Comment