12 October 2021

ఖావ్లా బింట్ అల్ అజ్వర్ Khawla bint Al Azwar

 




 మనం తెలుసుకోవలసిన  చారిత్రక మహిళా యోధురాలు ఖావ్లా బింట్ అల్ అజ్వర్ (Khawla bint Al Azwar).ప్రవక్త ముహమ్మద్(స) కాలం తర్వాత నివసించిన మరియు ఇస్లాం వ్యాప్తి కోసం జరిగిన పోరాటాలలో  పాల్గొన్న బాదాస్ యోధురాలు  ఖావ్లా బింట్ అల్ అజ్వర్.

 

ఖావ్లా బింట్ అల్-అజ్వార్ (అరబిక్: خولة بنت ) ఒక అరబ్ ముస్లిం మహిళా యోధురాలు  ఆమె ఇస్లామిక్ చరిత్రలో గొప్ప మహిళా యోధులలో ఒకరిగా వర్ణించబడింది మరియు యుద్ధభూమిలో ప్రత్యర్థులు ఆమెను ఖలీద్ బిన్ వలీద్‌తో పోల్చారు. ఖావ్లా 7వ శతాబ్దపు ముస్లిం ఆక్రమణ సమయంలో పాల్గొన్న రషీదున్ సైన్యాధిపతి ధీరార్ బిన్ అల్-అజ్వర్ యొక్క సోదరి.

ఖావ్లా గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. ఖావ్లా ఏడవ శతాబ్దంలో అరేబియాలో (ఆధునిక సౌదీ అరేబియా) జన్మించింది, ఖావ్లా బానీ అస్సాద్ తెగకు చెందిన ఒక ముఖ్యుడి కుమార్తె. ఆమె కుటుంబం ఇస్లాం మతంలోకి మారిన వారిలో మొదటిది. ఆమె తండ్రి పేరు మాలిక్ లేదా తారెక్ బిన్ అవ్సే; అతడిని అల్-అజ్వర్ అని కూడా అంటారు.

ఖావ్లా, సిరియా, జోర్డాన్, మరియు పాలస్తీనా లోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ముస్లింల విజయాలలో ప్రముఖ పాత్ర వహించినది.. బైజాంటైన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా 636 లో జరిగిన యార్మౌక్ యుద్ధంతో సహా అనేక పోరాటాలలో ఆమె తన సోదరుడు ధీర్రార్‌తో కలిసి పోరాడింది. ఆమె బైజాంటైన్ సైన్యానికి వ్యతిరేకంగా మహిళల బృందానికి నాయకత్వం వహించింది మరియు దాని చీఫ్ కమాండర్‌ను ఓడించింది,

634 లో జరిగిన సానితా-అల్-ఉకాబ్ యుద్ధంలో ఖావ్లా బింట్ అల్-అజ్వార్ ప్రతిభ మొదట కనిపించింది, డమాస్కస్ ముట్టడి సమయంలో ఖావ్లా బింట్ అల్-అజ్వార్ పోరాడింది, దీనిలో ఖావ్లా సోదరుడు జిరార్ (లేదా డేరార్) ముస్లిం దళాలకు నాయకత్వం వహించాడు మరియు గాయపడి బైజాంటైన్ సైన్యం చేత ఖైదీగా తీసుకోబడినాడు.. అతన్ని రక్షించడానికి ఖలీద్ ఇబ్న్ వలీద్ తన సైన్యంను వెంట తీసుకోని వెళ్ళాడు. ముస్లిం సైన్యాధిపతి ఖలీద్ ఇబ్న్ వలీద్ ముస్లిం ఖైదీలను రక్షించడానికి వెళ్ళినప్పుడు ఖవ్లా కవచం మరియు అరేబియా యోధుల విలక్షణమైన వస్త్రధారణలో సైన్యంతో పాటు బైజాంటైన్ రియర్‌గార్డ్‌ ను ఒంటరిగా ఎదుర్కొంది. ఖావ్లా, గుర్తింపు గురించి ఖలీద్ అడిగే వరకు ఆమె ఒక మహిళగా గుర్తించబడలేదు.

యుద్ధంలో పాల్గొన్న ఒక  ముస్లిం సైనికుడు రాఫే బిన్ ఒమేరా అల్ తాయ్, ప్రకారం  " గుర్తు తెలియని యోధుడు  శత్రు శ్రేణులను చెదరగొట్టాడు, వారి మధ్యలో అదృశ్యమయ్యాడు, కొంతకాలం తర్వాత అతని ఈటె నుండి రక్తం కారుతూ కనిపించాడు" అని గుర్తుచేసుకున్నాడు. ఇతర సైనికులకు ఆ గుర్తింపులేని ఆ యోధుడి పేరు తెలియకపోయినప్పటికీ, వారు అతన్ని ఖలీద్‌గా భావించారని పేర్కొన్నారు. "ఈ యోధుడు ఖలీద్ బిన్ వలీద్ లాగా పోరాడతాడు, కానీ అతను ఖలీద్ కాదని నాకు ఖచ్చితంగా తెలుసు." అని  షర్జీల్ ఇబ్న్ హస్సానా, రషీదున్(ఖలిఫా) ఆర్మీ కమాండర్ అభిప్రాయపడినాడు.

యుద్ధభూమి నుండి పారిపోయిన బైజాంటైన్లను ముస్లిం సైన్యం ఓడించింది. పారిపోతున్న బైజాంటైన్లను వెంబడించాలని ఖలీద్ తన సైన్యాన్ని ఆదేశించాడు. ముస్లిం ఖైదీలు కనుగొనబడ్డారు మరియు విడుదల చేయబడ్డారు.

యుద్ధం  లో పాల్గొనే ముందు, ఖావ్లా అప్పటికే సైన్యంలో నర్సుగా పనిచేస్తున్నారు.. ఖావ్లా నర్సింగ్ మరియు యుద్ద పోరాట నైపుణ్యాలతో పాటు ఒక కవయిత్రి  మరియు కళ/Art అబ్యసించారు.

ఖావ్లా యొక్క గుర్తింపు వెల్లడి అయినప్పుడు, సైన్యాధిపతి ఖలీద్ ఆమెను నర్సింగ్ విధులకు తిరిగి పంపిస్తాడని అందరు ఊహిస్తారు..కాని  ముస్లిం సైన్యాన్ని ఖావ్లా అద్వర్యంలో  రోమన్ సైన్యాన్ని వెంటపడి తరమాలని మరియు   ఖావ్లా సోదరుడి కోసం వెతకమని ఖలీద్ ఆదేశిస్తాడు.. ఖలీద్ మరియు సహచర సైనికులు ఆమె పరాక్రమాన్ని గుర్తించారు.

కొన్నికథనాల ప్రకారం  మరొక యుద్ధంలో ఖావ్లా గుర్రంపై నుండి పడిపోయిన తర్వాత బంధించబడిందని పేర్కొన్నారు. ఇతర మహిళా ఖైదీలతో పాటు ఒక శిబిరానికి తీసుకెళ్లబడిన తరువాత, ఖవ్లా ఇతర మహిళ ఖైదీలు  డేరా స్తంభాలను ఆయుధాలుగా ఉపయోగించి  బైజాంటైన్ గార్డులపై దాడి చేశారు. అల్ వాకిది ప్రకారం, ఖావ్లా స్వయంగా  ఐదుగురు బైజాంటైన్ యోధులను సంహరించినది.

ఖావ్లా బింట్ అల్ అజ్వర్ యొక్క కథ ధైర్యం మరియు స్త్రీ సాధికారతకు  చిహ్నం.

వారసత్వం

·       సౌదీ అరేబియాలోని అనేక వీధులు మరియు పాఠశాలలకు ఖవ్లా పేరు పెట్టారు.

·       జోర్డాన్ "అరబ్ ఉమెన్ ఇన్ హిస్టరీ" లో భాగంగా ఖవ్లా గౌరవార్థం ఒక స్టాంపును విడుదల చేసింది.

·       అనేక అరబ్ నగరాల్లో ఖవ్లా బింట్ అల్-అజ్వర్ పేరు ఉన్న పాఠశాలలు మరియు సంస్థలు ఉన్నాయి.

·       ఖులా గౌరవార్థం ఈనాడు ఇరాకీ మహిళల సైనిక విభాగానికి ఖావ్లా బింట్ అల్-అజ్వర్ యూనిట్ అని పేరు పెట్టారు.

·       యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, మహిళల కోసం మొట్టమొదటి సైనిక కళాశాల, ఖవ్లా బింట్ అల్ అజ్వర్ ట్రైనింగ్ కాలేజీ కు  ఖవ్లా పేరు పెట్టబడింది.

 

 

 

 

No comments:

Post a Comment