1939 ‘ఇంటర్నేషనల్
ఉమెన్స్ న్యూస్’ నివేదిక ప్రకారం బేగం హిజాబ్ ఇంతియాజ్ అలీ బ్రిటిష్
సామ్రాజ్యంలో ఎయిర్ పైలెట్‌గా ‘A’ లైసెన్స్
పొందిన మొదటి ముస్లిం మహిళగా నిలిచింది. బేగమ్ హిజాబ్ కు వివాహమైందని,
ఒక
కుమార్తె కూడా ఉందని పేర్కొంది.
న్యూస్ పేపర్
బ్రిటిష్ సామ్రాజ్యంలో మొట్టమొదటి ముస్లిం మహిళా పైలట్‌గా హిజాబ్‌ను పేర్కొంటున్నది.
బేగం హిజాబ్ ఇంతియాజ్
అలీ బ్రిటిష్ సామ్రాజ్యంలో పైలట్ అయిన మొదటి భారతీయ ముస్లిం మహిళ. సాలీ టాటా,
రోడాబెహ్
టాటా Sally Tata, Rodabeh Tata (సిస్టర్స్ ఆఫ్ జెఆర్‌డి టాటా) మరియు
ఊర్మిళా పారిఖ్ తో పాటు బేగం హిజాబ్ ఇంతియాజ్ అలీ భారతదేశపు తొలి మహిళా పైలట్‌లలో
ఒకరు. చాలా మంది మొట్టమొదటి భారతీయ మహిళా పైలట్ గా పేర్కొనే సరళ థక్రాల్ తో పాటు బేగమ్ హిజాబ్ ఒకే
సమయం లో లైసెన్స్ పొందారు. 1936
లో వారిద్దరూ లైసెన్స్ పొందగా, టాటా
సోదరీమణులు మరియు పారిఖ్ వారికి కనీసం నాలుగు సంవత్సరాల ముందు విమానాలు నడిపారు.
సరళ థక్రాల్ మరియు బేగం హిజాబ్ ఇద్దరూ లాహోర్ ఫ్లయింగ్ స్కూల్లో ఫ్లైయింగ్
నేర్చుకున్నారు. సాలీ
టాటా,
రోడాబెహ్
టాటా Sally Tata, Rodabeh Tata (సిస్టర్స్ ఆఫ్ జెఆర్‌డి టాటా) మరియు
ఊర్మిళా పారిఖ్ బొంబాయి (ముంబై) నుండి పైలట్ లైసెన్స్ పొందారు.
బేగం హిజాబ్ ఫిక్షన్
రచయిత మరియు ఎడిటర్‌గా మరింత ప్రసిద్ధి చెందింది. బేగం హిజాబ్ తెలంగాణలోని
హైదరాబాద్ కులీన కుటుంబానికి చెందినది మరియు ప్రముఖ ఉర్దూ రచయిత మరియు పాత్రికేయుడు
ఇంతియాజ్ అలీ తాజ్‌ని వివాహం చేసుకుంది. ప్రసిద్ధ నాటకం,
‘అనార్కలి’ ఇంతియాజ్
అలీ చే వ్రాయబడింది. బేగం హిజాబ్ యొక్క అత్త-మామలు ముంతాజ్ అలీ మరియు ముహమ్మదీ బేగం తొలి స్త్రీ వాదులలో ఒకరు.
ముహమ్మది బేగం ఉర్దూ పత్రికకు మొదటి మహిళా ఎడిటర్. ఆమె 'తెహ్జీబ్-ఇ-నిజావాన్
Tehzeeb-e-Nizwaan’ ' (మహిళల
సంస్కృతి) ను ఎడిట్ చేసింది. ముంతాజ్ అలీ రాసిన మ్యాగజైన్ మరియు పుస్తకం,
‘హుకూక్-ఇ-నిస్వాన్ Huqooq-e-Niswaan’
(Rights of women’ (మహిళల
హక్కులు) ఉర్దూ చదివే వ్యక్తులలో లింగ సమానత్వం యొక్క ఆలోచనలను వ్యాప్తి
చేసింది. 'తెహ్జీబ్-ఇ-నిస్వాన్',
మ్యాగజిన్
లో బేగం హిజాబ్ యొక్క మొదటి కథ ఆమె తొమ్మిదేళ్ల వయసులో ప్రచురించబడింది,
ఇది
పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందింది.
. 'మేరి నా-కామ్ మొహబ్బత్ Meri na-kaam Mohabbat’ (My failed
love), ' (నా విఫల ప్రేమ), బేగం హిజాబ్ తన 12 సంవత్సరాల వయస్సులో రాసిన కథ. ఇది ఉర్దూలో వ్రాసిన అత్యుత్తమ శృంగార
కథలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బేగం హిజాబ్ వివాహం చేసుకున్న కుటుంబం
అత్యంత ప్రగతిశీల ముస్లిం కుటుంబాలలో ఒకటి మరియు వివాహం మరియు తల్లి కూడా అయ్యాక
ఫ్లైయింగ్ నేర్చుకోవడానికి బేగం హిజాబ్ ను ప్రోత్సహించింది. బేగం హిజాబ్ 'తెహ్జీబ్-ఇ-నిజావాన్
Tehzeeb-e-Nizwaan’ ' అనే మ్యాగజిన్ కూడా ఎడిట్ చేసారు మరియు మరియు 'ఫూల్' వంటి ఇతర పత్రికల కోసం రాశారు. బేగం హిజాబ్
రాసిన 'పాగల్ ఖానా' (మానసిక ఆశ్రయం) ఒక భవిష్యత్ నవల,
అందులో ఆమె అణు యుద్ధానికి దారితీసే సాంకేతికత
ప్రమాదాల గురించి చర్చించింది.
బేగం హిజాబ్ భారతదేశంలోని
మొట్టమొదటి ముస్లిం పైలట్. టాటా సోదరీమణులు మరియు ఊర్మిళ భారత దేశ మొట్టమొదటిగా మహిళా
పైలట్లు. సరళ మరియు హిజాబ్ మొదటి లాహోరి మహిళా పైలట్లు .
No comments:
Post a Comment