6 October 2021

బేగం జహనారా షానవాజ్ - భారతీయ మహిళలకు రాజకీయ హక్కులను సాధించిన వనిత Begum Jahanara Shahnawaz: Who Won the Political Rights For the Indian Women

 


ఈ రోజున  భారతీయ మహిళలకు ఓటు వేసే హక్కు  మరియు  ఎన్నికల్లో పోటీ చేసే హక్కు వంటి రాజకీయ హక్కులు కలవు. ఈ రాజకీయ హక్కుల సాధనకు పోరాడిన ధీర వనిత బేగం జహనారా షానవాజ్ జీవిత చరిత్ర  ను ఒకసారి తెలుసుకొందాము

బేగమ్ జహనారా షానవాజ్ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ (RTC) లో పాల్గొన్న ఇద్దరు మహిళా ప్రతినిధులలో ఒకరు, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ (RTC) లో పాల్గొన్న ముగ్గురు మహిళా ప్రతినిధులలో ఒకరు మరియు మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ (RTC) లో పాల్గొన్న ఏకైక మహిళా ప్రతినిది. 1935భారత ప్రభుత్వ చట్టం ఖరారు చేయడానికి జాయింట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు, జహనారా దానిలోని  ఏకైక మహిళా సభ్యురాలు.

అందరు తెలుసుకోవలసినది ఏమిటంటే భారతీయ మహిళలకు  ఓటింగ్ హక్కులను  జహనారా ఎలా సాధించినది?

1927 లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయ మహిళలు రెండవ తరగతి పౌరుల జీవితాన్ని గడుపుతున్నారు. అఖిల భారత మహిళా సంఘం (AIWC-All India Women’s Commission) సభ్యురాలిగా, జహానారా భారతీయ మహిళలు అసెంబ్లీలు మరియు ఓటింగ్ హక్కులలో రిజర్వేషన్ reservation in assemblies and voting rights పొందాలని సైమన్ కమిషన్ ముందు వాదించారు. భారతదేశ భవిష్యత్తు మహిళల చేతుల్లో ఉందిఅని సైమన్ వ్రాసినప్పటికి  అప్పటి బ్రిటిష్ భారత ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు అని సిఫారసు చేసింది.

సైమన్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సలు/ఆర్టీసీRTCలు బ్రిటిష్ ప్రభుత్వం ముందు భారతీయులు తమ మనోవేదనలను తెలియజేయడానికి అవకాశం కల్పించడానికి నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలలో 160 మిలియన్ భారతీయ మహిళలకు ప్రాతినిధ్యం వహించడానికి జహనారా ఎంపిక చేయబడింది.

మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్/ఆర్టీసీలో, భారతదేశంలో ప్రజలు "తమ మాతృభూమి స్వేచ్ఛ" గురించి మాట్లాడుతున్నారని మరియు వారి జాతీయ ఆకాంక్షలను బ్రిటిష్ వారు ఆపలేరని జహానారా చెప్పారు. మహిళలకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని మరియు మహిళలకు సమాన ఓటింగ్ హక్కులు కల్పించాలని జహానారా వాదించారు.

 ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో, జహానారా భారతీయ మహిళల ఓటు హక్కు/ఫ్రాంఛైజీకి మద్దతు కూడగట్టడానికి తీవ్రంగా లాబీ చేసింది

మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరేసేస్/ఆర్టీసీలు ముగిసిన తర్వాత 1933 లో సెలెక్ట్ కమిటీ ఏర్పడింది మరియు జహానారా కు అందులో స్థానం కల్పించబడినది. భారతీయ మహిళలకు  ఓటింగ్ హక్కులు మరియు రిజర్వేషన్లకు మద్దతుగా ఇంగ్లాండ్‌లో ప్రజాభిప్రాయాన్ని రూపొందించడానికి జహానారా లండన్‌లో ప్రముఖ మహిళా కార్యకర్తలైన లేడీ రీడింగ్, లేడీ ఆస్టర్, లేడీ పెత్విక్ లారెన్స్, మిస్ రాత్‌బోన్ Lady Reading, Lady Astor, Lady Pethwick Lawrence, Miss Rathbone మరియు ఇతరులను కలుసుకున్నారు.


 1935భారత ప్రభుత్వ చట్టం  దాదాపు 600,000 మంది మహిళలకు ఓటింగ్ హక్కులను ఇచ్చింది మరియు శాసనసభలలో రిజర్వేషన్ కల్పించినది. అయినప్పటికీ, ఇది జహానారా కోరిన యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ డిమాండ్ కంటే తక్కువగా ఉంది, కానీ అప్పటికీ ఇది భారతీయ మహిళలకు భారీ విజయం. రిజర్వేషన్ ఫలితంగా, 1937 ఎన్నికల్లో 80 మంది మహిళా సభ్యులు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. చరిత్ర సృష్టించబడింది.

ఇది ఒక్కటే జహానారా భారత దేశానికి ఇచ్చిన ఏకైక బహుమతి కాదు. 1927 లో వివాహానికి కనీస చట్టబద్దమైన వయస్సును పెంచడానికి హర్బిలాస్ సర్దా Harbilas Sarda సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు జహానారా బిల్లును తీవ్రంగా సమర్దిoచినది. 1927 నుండి 1929 వరకు, బిల్లు సెలెక్ట్  కమిటీ వద్ద ఉంచబడింది. ఏఐసీడబ్ల్యూ AICW కి చెందిన ఇతర మహిళా కార్యకర్తలతో కలిసి జహానారా ఈ బిల్లుకు మద్దతుగా దేశంలో ప్రజాభిప్రాయాన్ని కూడాగట్టారు.. ఆసక్తికరంగా, మియాన్ షానవాజ్ మినహా కమిటీలోని ముస్లిం సభ్యులు అందరూ బిల్లును వ్యతిరేకించారు. జహానారా భర్త మియాన్ షహనావాజ్ ఎగతాళి చేయబడ్డాడు మరియు అతను తన భార్య 'ప్రభావంలో' ఉన్నాడని ఆరోపణలు చేశారు. చివరకు ఈ బిల్లును బాల్య వివాహ నిరోధక చట్టం, 1929 గా ఆమోదించారు. ఇది మహిళలకు వివాహానికి కనీస వయస్సు 14 మరియు పురుషుల వయస్సు 18 గా నిర్ణయించింది.


1937లో, జహానారా పంజాబ్ శాసనసభకు ఎన్నికయ్యారు మరియు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. జహానారా ఆరోగ్య సమస్యలు మరియు మహిళల్లో తక్కువ జీవన ప్రమాణం /low age expectancy పై దృష్టి పెట్టింది.

 భారతదేశ విభజన తరువాత, జహానారా పాకిస్తాన్‌లో నివసించారు మరియు 1948 లో మరణించిన తల్లిదండ్రుల ఆస్తిని వారసత్వంగా పొందడానికి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. పాకిస్తానీ మహిళలు వారసత్వ హక్కు పొందడానికి జహానారా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయినాయి..

 ఒక్కమాటలో చెప్పాలంటే, బేగమ్ జహనారా షానవాజ్ పురుష కేంద్రీకృత భారత సమాజం మరచిపోయిన మరొక మహిళ. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళా హక్కుల సాధనకు పోరాటం చేసిన ధీర వనిత.  

No comments:

Post a Comment