16 October 2021

కొరియాలో ఇస్లాం చరిత


.

 
దక్షిణ కొరియాలో ఇస్లాం (이슬람교) ఒక మైనారిటీ మతం. ముస్లిం సమాజం సియోల్‌లో కేంద్రీకృతమై ఉంది మరియు దేశవ్యాప్తంగా కొన్ని మసీదులు ఉన్నాయి. కొరియా ముస్లిం సమాఖ్య ప్రకారం, దక్షిణ కొరియాలో దాదాపు 150,000 మంది ముస్లింలు నివసిస్తున్నారు. వీరిలో 45,000 మంది స్థానిక కొరియన్లు మిగతా వారిలో 70 నుండి 80 శాతం మంది విదేశీయులు ఉన్నారు. కొరియన్ నివాసితులలో కేవలం 0.3 శాతం మంది మాత్రమే ముస్లింలు. దక్షిణ కొరియా మొత్తం ముస్లిం జనాభా సియోల్లో కేంద్రీకరించబడి దాదాపు 40% గా ఉంది. 2004 నుండి ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో కొరియా  విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇఫ్తార్ విందును నిర్వహిస్తోంది.

 

ఇస్లాం కొరియా చరిత్రలో చెరగని ముద్ర వేసింది.7వ శతాబ్దం మధ్య నుండి చివరి వరకు, ముస్లిం వర్తకులు కాలిఫేట్ నుండి టాంగ్ చైనా వరకు ప్రయాణించారు మరియు కొరియా యొక్క మూడు రాజ్యాలలో ఒకటైన సిల్లాతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. 751లో, గోగురియో సంతతికి చెందిన చైనీస్ జనరల్ గావో జియాంజి, అబ్బాసిడ్ కాలిఫేట్‌కు వ్యతిరేకంగా టాంగ్ రాజవంశం తరుఫున తలస్ యుద్ధానికి నాయకత్వం వహించాడు, కానీ ఓడిపోయాడు. 9వ శతాబ్దం మధ్యలో ఇస్తాఖ్రి Istakhriరాసిన జనరల్ సర్వే ఆఫ్ రోడ్స్ అండ్ కింగ్డమ్స్‌లో ఈశాన్య ఆసియా భౌగోళికo  లో కొరియా గురించి తొలి సూచన కనిపిస్తుంది.

 

కొరియాలో ఇస్లాం యొక్క ఉనికి 9వ శతాబ్దం నుండి ఏకీకృత సిల్లా కాలంలో పెర్షియన్ మరియు అరబ్ నావిగేటర్లు మరియు వ్యాపారుల రాకతో ప్రారంభమైంది. 9వ శతాబ్దపు ముస్లిం పర్షియన్ అన్వేషకుడు మరియు భూగోళశాస్త్రవేత్త ఇబ్న్ ఖోర్దాద్‌బెహ్‌తో సహా అనేక మంది ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం వారిలో చాలామంది ముస్లిం గ్రామాలను స్థాపించి కొరియాలో శాశ్వతంగా స్థిరపడ్డారు. ఈ సెటిలర్లలో చాలామంది ఇరాక్ నుండి వచ్చినట్లు కొన్ని రికార్డులు సూచిస్తున్నాయి.

 

9వ శతాబ్దం CE లో హసన్ రజా అనే వ్యక్తి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ముస్లిం విదేశీయులు కొరియాలో స్థిరపడ్డారని కొరియన్ రికార్డులు సూచిస్తున్నాయి సిల్లాలోని మధ్యప్రాచ్య ముస్లిం సమాజo  స్పష్టంగా పెర్షియన్ లక్షణాలు కలిగి ఉంది.  చాలా మంది ముస్లింలు స్థానిక కొరియన్ సమాజంలో  స్థిరపడ్డారు మరియు వివాహం చేసుకున్నారు

 

అధికారిక కొరియన్ చారిత్రక రికార్డులు  ముస్లింల రాకను   1024 లో నమోదు చేశాయి. వంద మంది అరబ్ వ్యాపారులు హ్యోన్‌జాంగ్ Hyeonjong రాజు హయాంలో గోరియో Goryeo రాజ్యానికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి వచ్చారు. ఇది కొరియాలో స్థిరపడటానికి మధ్య ఆసియా వ్యాపారులు మరియు వలసదారులకు, అలాగే కొంతమంది చైనీస్ హుయికి తలుపులు తెరిచింది.

 

1154 లో కొరియా,  అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త ముహమ్మద్ అల్-ఇద్రీసీ యొక్క ప్రపంచ అట్లాస్, తాబూలా రోజెరియానా”లో చేర్చబడింది. ఇస్లామిక్ భూగోళ శాస్త్రవేత్తల రచనల నుండి పాశ్చాత్య ప్రాంతాల గురించిన  పరిజ్ఞానాన్ని పొంది పురాతన కొరియన్ ప్రపంచ పటం గాంగ్నిడో తాయారు చేయబడినది.

 

మంగోల్ పాలకులకు మరియు కొరియన్ ప్రభుత్వానికి మధ్య సత్సంభంధాలు  ఉన్నందున 1259 లో మంగోలులు వచ్చారు. యువాన్ రాజవంశo అధికారం చేపట్టిన తరువాత కొరియా లో శాశ్వత ముస్లిం జనాభా స్థాపించబడింది, మసీదులను యే-కుంగ్ లేదా "ఉత్సవ మందిరాలు Ye-kung, or “ceremonial halls " అని పిలుస్తారు. ముస్లింలలో ఒక వర్గమైన జాంగ్ అనబడే ముస్లిం వలసదారులు గోరియో మరియు జోసెయోన్ రాచరికాలు రెండింటితో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు అయ్యారు.

 

కొత్త జోసన్ రాజవంశం కాలం లో ఇస్లాంను ఆచరించే వారిపై కొన్ని ఆంక్షలు స్థాపించబడినవి. 1427లో  కింగ్ సెజోంగ్ King Sejong  ముస్లిములు టోపీ ధరించారాదని  యే-కుంగ్‌(మస్జిద్)లను మూసివేయాలని మరియు కన్ఫ్యూషియన్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించాడు. ఈ చట్టం తరువాత శతాబ్దాల సహజీవనం మరియు సాంస్కృతిక సమీకరణ స్థాయి పొందిన  కొరియన్ ముస్లింలు కొన్ని శతాబ్దాలుగా చారిత్రక రికార్డు నుండి అదృశ్యమయ్యారు.

 

రికార్డు నుండి అదృశ్యమయ్యే ముందు, కొరియాలోని ముస్లిం జనాభా తమ శాస్త్రీయ మరియు సాంస్కృతిక రచనలను కొరియా లో అభివృద్ధి చేసారు. మొట్టమొదటి కొరియన్ వరల్డ్ మ్యాప్, కంగ్నిడో Kangnido,, ముస్లిం వ్యాపారులు సేకరించినట్లు భావిస్తున్న సమాచార సహాయంతో డ్రా చేయబడింది. హుయిహుయి లిఫా Huihui Lifa  అనేది జిజ్ అని పిలువబడే ముస్లిం ఖగోళ గ్రంథాలతో ఉద్భవించిన చైనీస్ ఖగోళ పట్టికల సమితి.

 

జోజాన్ కాలంలో సెజాంగ్ Sejong రాజు క్యాలెండర్ సంస్కరణలను ప్రారంభించినప్పుడు, కొత్త క్యాలెండర్ ముస్లిం జిజ్ నుండి వచ్చిన సమాచారంపై ఆధారపడింది. ఇది పంతొమ్మిదవ శతాబ్దం వరకు కొనసాగిన స్థానిక కొరియన్ ఖగోళ అధ్యయనాలపై ముస్లిం ప్రభావాన్ని తెలుపుతుంది.  మొట్టమొదటి డిస్టిలరీలను మంగోలులు కైసాంగ్ నగరం చుట్టూ నిర్మించారు. హుయిహుయ్ నుండి మరొక ముఖ్యమైన సహకారం సోజు అనే పానీయం. క్యోసాంగ్ పరిసర ప్రాంతంలో సోజును ఇప్పటికీ అరక్-జు అని పిలుస్తారు మరియు ఈనాటికీ దీనిని కొరియన్లు ఇష్టపడుతున్నారు.

 

16వ శతాబ్దం నాటికి ఇస్లాం కొరియాలో లేదు కాని పందొమ్మిదవ శతాబ్దంలో  ఇస్లాం కొరియా లో తిరిగి ప్రవేశించింది. కొరియన్ యుద్ధ సమయంలో, టర్కీ బ్రిగేడ్ అని పిలువబడే టర్కీ నుండి వచ్చిన ఒక పెద్ద మిత్ర సైనిక  బృందం రక్షణకు మాత్రమే కాకుండా, కొరియాను పునర్నిర్మించే మానవతా పనికి కూడా సహాయపడింది. యుద్ధం ముగిసినప్పుడు, ఈ సైనికులలో కొందరు UN శాంతి పరిరక్షకులుగా ఉండి, ఇస్లాం ధర్మ ప్రచారం చేయడం ప్రారంభించారు.

 

1955 లో కొరియా ముస్లిం సొసైటీ (한국 이슬람 established) ను స్థాపించారు, ఆ సమయంలో మొదటి దక్షిణ కొరియా మసీదు ఇమున్-డాంగ్ వద్ద నిర్మించబడింది. 1955 నాటికి, కొరియా ముస్లిం సొసైటీ 1967 లో కొరియా ముస్లిం సమాఖ్యగా Korea Muslim Federation) స్థాపించబడింది.

 

1970 లలో మధ్యప్రాచ్యంతో వాణిజ్యం పెరగడంతో, సౌదీ అరేబియాలో విదేశీ కార్మికులుగా పనిచేసిన కొందరు కొరియన్లు ఇస్లాం మతం స్వీకరించారు మరియు మతాన్ని స్వదేశానికి తీసుకువచ్చారు. 1977 లో సియోల్ సెంట్రల్ మసీదు నిర్మాణo జరిగింది. కొరియాలోని  బుసాన్, అన్యంగ్ గ్వాజు జియోంజు, డేగు మరియు జియోంగ్గి (Busan, Anyang, Gwanju, Jeonju, Daegu, and Gyeonggi) ప్రాంతాలలో క్రమంగా పెరుగుతున్న ముస్లిం జనాభా అవసరాలు తీర్చడానికి మసీదులు నిర్మించబడినవి. కొరియా ఇస్లాం ఇనిస్టిట్యూట్ ప్రకారం, దక్షిణ కొరియాలో సుమారు 10,000 మంది ముస్లింలు (ఎక్కువగా విదేశీ అతిథి కార్మికులు) ఉన్నారు.ముహమ్మద్ ప్రవక్త (స) మనవడు హుసేన్ ఇబ్న్ అలీని స్మరించుకోవడం కోసం సియోల్ సమీపంలో హుస్సేనియాను నిర్వహిస్తుంది. డేగులో కూడా  హుస్సేనియా ఉంది.

 

కొరియా ముస్లిం ఫెడరేషన్ మార్చి 2009 లో మొదటి ఇస్లామిక్ ప్రాథమిక పాఠశాల, ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎలిమెంటరీ స్కూలును ప్రారంభిoచినది.  సాంస్కృతిక కేంద్రం, మాధ్యమిక పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాన్ని కూడా తెరవడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.

 

కొరియన్ ముస్లిం ఫెడరేషన్ రెస్టారెంట్లు మరియు వ్యాపారాలకు హలాల్ సర్టిఫికెట్లను అందిస్తుంది. వారి హలాల్ సర్టిఫికేట్,  డిపార్టుమెంటు అఫ్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ మలేషియా (JAKIM) ద్వారా గుర్తించబడింది మరియు జనవరి 2018 నాటికి దక్షిణ కొరియాలో మొత్తం 14 KMF- హలాల్ ఆమోదించిన రెస్టారెంట్లు ఉన్నాయి.

 

ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు ముందు, సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మదరసా అనే మదర్సా 1990 నుండి పనిచేస్తుంది. ఇక్కడ విదేశీ ముస్లిం పిల్లలకు అరబిక్, ఇస్లామిక్ సంస్కృతి మరియు ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం లభించింది.

 

కొరియాలోని చాలా మంది ముస్లింలు తమ విభిన్న జీవనశైలి సమాజంలోని ఇతరులకన్నా తమను ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పారు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కార్మికులు ముస్లిం జనాభాలో ఎక్కువ భాగం ఉన్నారు. 2002 లో కొరియా టైమ్స్ ద్వారా దక్షిణ కొరియన్ ముస్లింల సంఖ్య 45,000 గా నివేదించబడింది అయితే ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా ప్రకారం 2010 లో 75,000 మంది దక్షిణ కొరియా ముస్లింలు ఉన్నారు, లేదా దేశంలో ప్రతి ఐదువందల మందిలో ఒకరు.

 

దక్షిణ ముస్లిం సమాజాలలో, రెండు విభిన్న సమూహాలు ఉన్నాయి: సాంప్రదాయ మరియు వలస ముస్లింలు. మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మరియు ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల నుండి సాధారణంగా వలసదారులు వస్తారు.

 

ఉత్తర కొరియాలో ఇస్లాం:

 

1990 లో 1,000 మంది ఉన్న ఉత్తర కొరియాలో 2010 లో 3,000 మంది ముస్లింలు ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ప్యాంగ్‌యాంగ్‌Pyongyangలోని ఇరానియన్ రాయబార కార్యాలయం దేశంలోని ఏకైక మసీదు అయిన అర్-రహమాన్ మసీదును నిర్వహిస్తుంది. 

No comments:

Post a Comment