'రాజ్యం/సార్వబౌమాదికారం పై యుద్ధం' waging
‘the war against the Crown’ ప్రకటించినందుకు గాను అభియోగాలు మోపబడిన ఒక ముస్లిం మహిళ, ఏప్రిల్ 21, 1932 న ఢిల్లీలోని అదనపు మేజిస్ట్రేట్
కోర్టులో ప్రవేశపెట్టబడింది. నియమం ప్రకారం, ఆమె ఒక లాయర్ ను
నియమించుకొని వాదించుకోవచ్చు అని లేదా తన కేసును స్వయంగా వాదిoచుకోవచ్చు అని తెలిపారు. భారతదేశంలో
దౌర్జన్యం మరియు బానిసత్వంపై పునాది ఉన్న కోర్టులో తన కేసును వాదించడానికి తాను
ఇష్టపడనని ఆ మహిళ కోర్టు కు తెల్పింది. ఆమె అభిప్రాయం ప్రకారం న్యాయస్థానం
న్యాయానికి ప్రాతినిధ్యం వహించలేదు, ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన ప్రభుత్వం మరియు భారతదేశంలో దాని ఉనికి కి
హక్కు లేదు. బ్రిటిష్ ఇండియా న్యాయస్థానం లో ఈ విధంగా గా చెప్పటం సాహసమని పేర్కొనవచ్చు. మేజిస్ట్రేట్
ద్వారా ఆ మహిళకు ఆరు నెలల జైలు శిక్ష మరియు యాభై రూపాయల జరిమానా విధించబడింది.
జరిమానా చెల్లించలేని పక్షంలో జైలుశిక్షను మరో 45 రోజులు అనుభవించాల్సి ఉంటుంది.
సాహసవంతురాలు అయిన ఆ మహిళ బేగం మహబూబ్ ఫాతిమా. జలియన్‌వాలాబాగ్
దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో శ్రీమతి సత్యవతితో పాటు
బేగం మహబూబ్ ఫాతిమా ను అరెస్టు చేశారు. చరిత్రకారుల ప్రకారం, ఢిల్లీలో ''రాజ్యం/సార్వబౌమాదికారం పై యుద్ధం' చేసినందుకు జైలు శిక్ష అనుభవించిన మొదటి ముస్లిం మహిళ బేగం మహబూబ్
ఫాతిమా. బేగం మహబూబ్ ఫాతిమా భర్త తాహిర్
మొహమ్మద్.
No comments:
Post a Comment