K. O. ఆషా బాయి Aysha Bai (25 అక్టోబర్ 1926
- 28 అక్టోబర్ 2005)ను ఆయేషా బాయి అని కూడా పిలుస్తారు. ఆయేషా
బాయి, దక్షిణ భారతదేశానికి చెందిన
కమ్యూనిస్ట్ రాజకీయవేత్త. ఆయేషా బాయి కేరళ శాసనసభ మొదటి డిప్యూటీ స్పీకర్ (6 మే 1957 - 31 జూలై 1959)గా వ్యవహరించారు.
ఆధునిక కేరళలో ప్రజాభిమానం పొందిన మొదటి
ముస్లిం మహిళ ఆయిషా బాయి. ఆయేషా బాయి మాప్పిల మహిళల ప్రగతి కోసం కృషి చేసారు.
ఆయేషా బాయి మహిళా సోసైటిల(మహిళా సమాజాలు) యొక్క మార్గదర్శక నిర్వాహకురాలు కూడా.
ఆయేషా బాయి ఉమెన్స్ కాలేజ్, యూనివర్శిటీ కాలేజ్, త్రివేండ్రం మరియు లా కాలేజీ, ఎర్నాకులం (B. A. మరియు B. L.)లో చదువుకున్నారు. 1947లో స్టూడెంట్స్ కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంది.
ఆయేషా బాయి 1953లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)లో చేరారు మరియు 1957లో
కాయంకుళం నియోజకవర్గం నుండి కేరళ శాసనసభకు ప్రతినిధిగా ఎన్నికయ్యారు, రెండు పర్యాయాలు (మొదటి మరియు రెండవ KLAలలో) పనిచేశారు. ఆయేషా బాయి మే 1957 నుండి జూలై 1959 వరకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా
పనిచేశారు. ఆయేషా బాయి 1961 నుండి 1963 వరకు ప్రభుత్వ హామీల కమిటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆయేషా బాయి
కేరళ మహిళా సంఘం - కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కు అయేషా బాయి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సెంట్రల్ మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ
బోర్డులు మరియు స్టేట్ వాచ్ – జైళ్ల
కమిటీ సభ్యురాలుగా వ్యవహించారు.
ఆయేషా బాయి, కె. ఉస్మాన్ సాహిబ్ మరియు ఫాతిమా బీవీలకు
జన్మించారు. ఆయేషా బాయి కి కె. అబ్దుల్
రజాక్‌తో వివాహం జరిగింది మరియు వారికి ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు
ఉన్నారు. ఆయేషా బాయి 28 అక్టోబర్ 2005న మరణించారు.
No comments:
Post a Comment