కొచ్చి, కేరళ:
ఎత్తైన
పర్వత శిఖరాలను అధిరోహించడం అనేది కేరళ రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగి షేక్ హసన్
ఖాన్‌కి చాలా ఇష్టం.
మొత్తం ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలని షేక్ హసన్ ఖాన్
కల. కొద్ది రోజుల క్రితం కేరళ నుంచి ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా షేక్ హసన్ ఖాన్ నిలిచాడు.
షేక్ హసన్ ఖాన్, ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన మొదటి మలయాళీ.
“పర్వతాల పట్ల నాకున్న ప్రేమ 2015లో మొదలైంది”. అని షేక్ హసన్ ఖాన్ చెప్పారు. షేక్ హసన్ ఖాన్ డార్జిలింగ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో
28-రోజుల ప్రాథమిక పర్వతారోహణ కోర్సు తీసుకున్నారు.. మొదటిగా 7,000 మీటర్ల శిఖరమైన సతోపంత్ పర్వతాన్ని Mount Satopanth అధిరోహించాడు.”
షేక్ హసన్ ఖాన్ తన డ్రీం అయిన 'సెవెన్ సమ్మిట్స్' అధిరోహణ లో భాగంగా తన మొదటి సమ్మిట్ టాంజానియాలోని ‘మౌంట్ కిలిమంజారో’ (19,341 అడుగులు) ను ఫిబ్రవరి 2021లో అధిరోహించాడు. 2024 సంవత్సరం నవంబర్ 10న, ఆస్ట్రేలియాలోని ఎత్తైన శిఖరం అయిన ‘మౌంట్ కోస్కియుస్కో’పై త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ, షేక్ హసన్ ఖాన్ తన 'సెవెన్ సమ్మిట్స్' పూర్తి చేశాడు.
" భారత జాతీయ జెండాతో కోస్కియుస్కో పర్వతంపై నిలబడి ఉన్నప్పుడు నేను పొందిన
ఆనందాన్ని మాటల్లో చెప్పలేను" అని షేక్ హసన్ ఖాన్ అన్నారు..
షేక్ హసన్ ఖాన్ మునుపటి విజయాలలో అంటార్కిటికాలోని .మౌంట్ విన్సన్, ఆసియాలోని మౌంట్ ఎవరెస్ట్, ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలి, ఐరోపాలోని మౌంట్ ఎల్బ్రస్ మరియు దక్షిణ
అమెరికాలోని మౌంట్ అకాన్‌కాగువా’ ఉన్నాయి.
షేక్ హసన్ ఖాన్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని(30x20 అడుగుల జెండా) ఆవిష్కరించినందుకు
ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు, ఇది భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 75 వ వార్షికోత్సవం షేక్ హసన్ ఖాన్ సందర్భంగా
సాధించిన ఘనత.
'ఎవరెస్ట్ ఎకో ఎక్స్‌పెడిషన్' లోభాగంగా షేక్ హసన్ ఖాన్ ఎవరెస్ట్ పర్వత
శిఖరం పై ఉన్న 100 కిలోల జంక్‌ను ఎరివేసాడు..
పర్వతారోహణలో ఎదురయ్యే అనేక సవాళ్లను షేక్ హసన్ ఖాన్ ఎదుర్కొని విజయం
సాధించాడు.
తన మూడేళ్ల ‘సెవెన్ సమ్మిట్’ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ, షేక్ హసన్ ఖాన్ ప్రకృతి పట్ల తనకున్న
కృతజ్ఞతను మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించినాడు..
షేక్ హసన్ ఖాన్ రాబోయే ఐదేళ్లలో ‘ప్రతి దేశంలోని ఉన్నత పర్వత శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే
మొదటి వ్యక్తిగా అవతరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
షేక్ హసన్ ఖాన్ కేరళలోని బీచ్‌లను
శుభ్రపరచడంపై దృష్టి సారించే ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు,
"జీవితం లో ప్రతి
చిన్న అడుగు ముఖ్యమని, గొప్ప విజయాలు సాధించాలంటే తరచుగా
ఒంటరితనం,
అసౌకర్యం
మరియు అనిశ్చితితో గడపాలని ప్రయాణం నాకు నేర్పింది."అని షేక్ హసన్ ఖాన్ అన్నారు.
మూలం: ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్.
నవంబర్ 20,
2024
No comments:
Post a Comment