సంస్కృతం సాధారణం గా హిందూ పండితులు భోదిస్తూ ఉంటారు. కాని దీనికి బిన్నంగా కేరళలో హిందూయేతర ఉపాధ్యాయులు విద్యార్థులకు సంస్కృతం భోదిస్తున్నారు.
సంస్కృతంలో డిగ్రీ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ చదివిన వారికి పాఠశాల లేదా కళాశాలలో ఉద్యోగాలు లబిస్తున్నాయి. చాలా మంది హిందూయేతర విద్యార్థులు ముఖ్యంగా ముస్లింలు ఉన్నత విద్యలో సంస్కృతాన్ని తమ సబ్జెక్ట్‌గా మరియు హయ్యర్ సెకండరీలో రెండవ భాషను ఎంచుకుంటున్నారు.
ముస్లింలు పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో సంస్కృత భోధన కోసం ఉద్యోగాలు పొందుతున్నారు. సంస్కృతంతో ఇంటర్మీడియట్ కల పాఠశాలల్లో బోధన కోసం ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
కేరళ విశ్వవిద్యాలయాలలో ఫ్యాకల్టీ/అధ్యాపక ఉద్యోగాలలో మైనారిటీలకు కోటా ఉంది. అవి తరుచుగా ముస్లిం అధ్యాపకులచే నింపబడుతున్నవి. ఉదాహరణకు కేరళలోని MG విశ్వవిద్యాలయం మరియు శంకర విశ్వవిద్యాలయం లో ముస్లింలు ఫ్యాకల్టీగా ఉన్నారు.
కేరళలోని వివిధ కళాశాలల్లో ముస్లిం సంస్కృత ఉపాధ్యాయుల సంఖ్య తగినంతగా ఉంది. కేరళ ప్రభుత్వం మూడు సంస్కృత కళాశాలలను నిర్వహిస్తుంది మరియు ఇవన్నీ మైనారిటీ కోటాలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
కాలికట్ విశ్వవిద్యాలయం యొక్క సంస్కృత విభాగంలో ఇద్దరు ముస్లిం ఉపాధ్యాయులు డాక్టర్ కెకె అబ్దుల్ మజీద్ మరియు డాక్టర్ ఎన్ ఎ షిహాబ్ ఉన్నారు.కేరళ లో పాఠశాలలు మరియు కళాశాలలలో కూడా ముస్లిం సంస్కృత ఉపాధ్యాయులు కలరు.
డాక్టర్ మజీద్ కాలికట్ యూనివర్సిటీలో రీసెర్చ్ గైడ్ మరియు నలుగురు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వారిలో ఇద్దరు ముస్లింలు. వారిలో మహ్మద్ షమీమ్ మూడుసార్లు NET మరియు JRF అర్హత సాధించాడు మరియు పాఠశాలలో ఉద్యోగం కూడా పొందాడు.
ప్రతి యూనివర్శిటీలో సంస్కృతo విభాగం లో
ప్రతి సంవత్సరం కనీసం 1-2
మంది ముస్లింలు ఉంటారు.కాలికట్ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముస్లిం వర్గాలకు చెందిన
విద్యార్థులను కలిగి ఉంది.
“కేరళ విశ్వవిద్యాలయంలో గత 25 సంవత్సరాలుగా ముస్లిం ఉపాధ్యాయులు సంస్కృతం బోధిస్తున్నారు, అలాగే కాలికట్ యూనివర్సిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు"
సంస్కృతం ఎంపిక ఉద్యోగాలు ఇవ్వగలదు అని ముస్లింవిద్యార్ధులు భావిస్తున్నారు. భాషను మతంతో ముడిపెట్టడం సమ౦జసం కాదు అని ముస్లిం విద్యార్ధులు భావిస్తునారు. భాష యొక్క అభివృద్ధికి నిజమైన నిబద్ధత కావలి.
సంస్కృత పండితుడు ఓనంపిల్లి ఫైజీ వేదాంత
మరియు ఖురాన్ బోధించే ఇస్లామిక్ అకాడమీని నడుపుతున్నాడు
No comments:
Post a Comment