20 December 2024

CMA ఫౌండేషన్ పరీక్షలలో రహ్మానీ30 విద్యార్ధుల యొక్క చారిత్రాత్మక 100% విజయం Historic achievement of Rahmani30: 100% success in CMA Foundation Exams

 

ముస్లిం విద్యార్ధుల విద్యాసాదికారికత:

 

రహ్మాని/Rahmani30 సెషన్-1 2024 CMA (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్) ఫౌండేషన్ పరీక్షలలో 100% విజయవంతమైన రేటును సాధించడం జరిగింది.  పరీక్షకు హాజరైన మొత్తం ఐదుగురు విద్యార్థులు విజయవంతంగా అర్హత సాధించారు. గతంలో 2023-24 సెషన్‌లో  రహ్మానీ30 చెందిన 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినారు.  వరుసగా రెండవ సంవత్సరం రహ్మాని/Rahmani30 విద్యార్ధుల విజయాలు రహ్మానీ30 యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతున్నాయి. CMA ఫౌండేషన్ పరీక్షల సెషన్-2 డిసెంబర్ 2024లో షెడ్యూల్ చేయబడింది

CMA ఫౌండేషన్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఆర్థిక శాస్త్రం, అకౌంటింగ్ మరియు వ్యాపార చట్టాలలో అవసరమైన అంశాలను పరిచయం చేస్తుంది, ఫైనాన్స్ మరియు మేనేజ్‌మెంట్‌లో డైనమిక్ కెరీర్‌లకు వారిని సిద్ధం చేస్తుంది.

రహ్మానీ30 విద్యార్థులు  ఇంజనీరింగ్ (JEE-అడ్వాన్స్‌డ్) మరియు మెడికల్ (NEET) స్ట్రీమ్‌ మరియు చార్టర్డ్ అకౌంటెన్సీ (CA), CMA వంటి వాణిజ్య సంబంధిత రంగాలలో మరియు స్టాటిస్టికల్ సైన్సెస్ వంటి ప్రత్యేక రంగాలలో కూడా రాణించారు.

ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) వారి  బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ (ఆనర్స్) ప్రోగ్రామ్‌కు ఢిల్లీ బ్రాంచ్‌లో అర్హత సాధించిన ఏకైక ముస్లిం విద్యార్థి తబీష్ రజా, రహ్మానీ30 విద్యార్థి కావడం విశేషం.

రహ్మానీ30 ముస్లిం విద్యార్ధులకు విభిన్న వృత్తిపరమైన కెరీర్‌లకు మార్గాలను సృష్టించడం ద్వారా ముస్లిం సమాజాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కామర్స్ స్ట్రీమ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు కంపెనీ సెక్రటరీల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన, వృత్తులలో muslimముస్లిం విద్యార్ధుల సంఖ్యను పెంపొందించడం కోసం రహ్మానీ30 ప్రయత్నిస్తుంది..

రహ్మానీ 30 యొక్క ప్యాట్రన్/పోషకుడు, అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులకు, అధ్యాపకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మెడిసిన్ మరియు ఇంజనీరింగ్ వంటి సాంప్రదాయ కెరీర్ స్ట్రీమ్‌ల వలె కామర్స్/వాణిజ్యం కూడా ముఖ్యమైనది అనే నమ్మకాన్ని పునరుద్ఘాటించారు

CMA ఫౌండేషన్ పరీక్షలలో రహ్మానీ30 యొక్క 100% విజయం విభిన్న రంగాలలో శ్రేష్ఠతను పెంపొందించడంలో దాని అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. కెరీర్ అవకాశాలను విస్తరించడానికి ముస్లిం విద్యార్థులను ప్రేరేపించడం ద్వారా, రహ్మానీ30 వ్యక్తిగత భవిష్యత్తులను రూపొందించడమే కాకుండా సామూహిక పురోగతిని కూడా నడిపిస్తోంది.

No comments:

Post a Comment