ముస్లిం మహిళా విద్యా సాధికారికత
ముంగేర్, బీహార్:
బీహార్
లోని ముంగేర్‌కు చెందిన హబీబా బుఖారీ బీహార్ జ్యుడీషియల్ సర్వీస్‌కు జనరల్
కేటగిరీలో 30వ
ర్యాంకు సాధించి ఎంపికైంది..హబీబా బుఖారీ తండ్రి, అహ్మద్ బుఖారీ, బీహార్, ముంగేర్‌లోని మసీదులో ఇమామ్
(ప్రార్థన నాయకుడు). హబీబా బుఖారీ తల్లి గృహిణి..
హబీబా బుఖారీ తన BA LLB మరియు LLM డిగ్రీలను అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) నుండి పూర్తి చేసింది మరియు ప్రస్తుతం Ph.D, AMU నుండి చేస్తుంది.
స్వయంగా హఫీజా మరియు హిజాబ్ ధరించే హబీబా బుఖారీ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడానికి స్వీయ-అధ్యయనంపై ఎక్కువగా దృష్టి సారించింది మరియు AMU వర్సిటీ నుండి కోచింగ్ పొందినది. ఫిబ్రవరి 2024 చివరిలో జ్యుడీషియల్ సర్వీస్ కోసం తన శిక్షణను ప్రారంభించనుంది. హబీబా బుఖారీ చెల్లెలు అరిషా బుఖారీ BA చదువుతోంది మరియు సోదరులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు.
ఈ సంవత్సరం బీహార్ జ్యుడీషియల్
సర్వీస్ పరీక్షలో ఎన్నికైన మొత్తం 153 మంది అభ్యర్థుల్లో ఉత్తీర్ణులైన పది మంది ముస్లిం
అభ్యర్థుల్లో హబీబా బుఖారీ ఒకరు. విజయవంతమైన
ఇతర అభ్యర్థులలో ఫర్హా నిషాత్, 20వ ర్యాంక్ సాధించిన తజీన్ బింటే వహీద్ మరియు జనరల్ కేటగిరీలో
48వ స్థానంలో
నిలిచిన సానియా అక్తర్ ఉన్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీలలో, సారా ఇమామ్
ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) కింద 6వ ర్యాంక్‌ను సాధించగా, జెబా మంజూర్ అత్యంత వెనుకబడిన తరగతుల (EBC) విభాగంలో
అగ్రస్థానంలో నిలిచారు.
హబీబా బుఖారీ బాలికా విద్యాబ్యాసం కు
గట్టి మద్దతు దారు. హబీబా బుఖారీ స్త్రీ విద్య సాధికారికతకు
నిదర్శనం. హబీబా బుఖారీ విజయం ముఖ్యంగా యువతులకు అడ్డంకులు ఉన్నా వారి కలలను సాకారం
చేసుకునేలా చేస్తుంది
మూలం: twocircles.net, డిసెంబర్ 19, 2024
No comments:
Post a Comment