ముస్లిం యువ న్యాయసాదికారికత:
కేరళ:
పేదరికం లో పెరిగిన యాసీన్, నిత్యం సామాజిక అవమానాలను
ఎదుర్కో౦టు ఏడు సంవత్సరాల వయస్సులో, తన కుటుంబాన్ని పోషించడానికి పని చేయడం ప్రారంభించాడు.
29 ఏళ్ల ముహమ్మద్ యాసీన్ కేరళ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో రెండవ ర్యాంక్ సాధించినాడు. ఒకప్పుడుపేపర్ బాయ్' గా పిలువబడే యాసీన్ ఇప్పుడు మేజిస్ట్రేట్అయ్యాడు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన విలయూర్‌కు చెందిన యాసీన్ పేపర్ డెలివరీ బాయ్ నుండి, పాల సరఫరాదారు, పెయింటర్, భవన నిర్మాణ కార్మికుడు మరియు ఫుడ్ డెలివరీ బాయ్ వరకు, అనేక చిన్నచిన్న ఉద్యోగాలు చేసాడు. యాసీన్ తల్లి ఆశా వర్కర్.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా పొందిన తర్వాత, యాసీన్ 2019లో ఎర్నాకులం గవర్నమెంట్ లా కాలేజీలో చేరాడు. యాసీన్ తన లా డిగ్రీని పూర్తి చేసే౦దుకు డబ్బు కోసం ఫుడ్ డెలివరీ ఉద్యోగాన్ని చేపట్టాడు. యాసీన్ పగటిపూట కాలేజీకి హాజరయ్యాడు మరియు కొచ్చిలో రాత్రిపూట Zomatoకి ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు.యాసీన్ చదువులో రాణించాడు. లా విశ్వవిద్యాలయంలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాడు
తన LLB పూర్తి చేసిన తర్వాత, యాసీన్ మార్చి 2023లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు. ప్రాక్టీస్ చేసిన మొదటి సంవత్సరంలోనే యాసీన్ అత్యుత్తమ న్యాయవాది అవార్డును అందుకున్నాడు.
లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన రెండో సంవత్సరంలోనే యాసీన్ మెజిస్ట్రేట్ గా సెలెక్ట్ అయ్యాడు. సమాజం లోని అణగారిన వర్గాల కోసం పని చేస్తానని యాసీన్ అన్నాడు.
మూలం:ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డిసెంబర్ 12, 2024
No comments:
Post a Comment