తన దేశం కోసం ప్రాణాలను సంతోషంగా అర్పించిన అమర వీరులలో షేక్ భిఖారీ ఒకరు. 1857 విప్లవంలో బ్రిటిష్
వారిని గజగాజలాడించిన వారిలో జార్ఖండ్‌కు చెందిన టికైత్ సింగ్‌తో పాటు షేక్ భిఖారీ
ఒకరు.
షేక్ భిఖారీ 1811 అక్టోబర్ 2 న జార్ఖండ్ లోని
చోటా నాగ్పూర్ (Chota Nagpur) లోని బుద్ము( Budhmu) లోని మక్కా హుప్టే (Makka Hupte) లో ఒక ధనిక చేనేత
కుటుంబంలో జన్మించాడు. అతనికి షేక్ భుఖారీ అని పేరు పెట్టారు, కాని అందరు
అతనిని షేక్ భిఖారీ అని పిలిచేవారు. మంచి పెంపకం లో చిన్నతనం నుండి విప్లవభావాలను కలిగి నిర్భయవంతుడు మరియు ధైర్యవంతుడు గా షేక్ భిఖారీ ప్రసిద్ది
కెక్కినాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు భారత దేశాన్ని దోపిడీ
చేస్తున్న విధానం అతన్ని తిరుగుబాటుదారుడిని చేసింది. కేవలం 17 లేదా 18 సంవత్సరాల
వయస్సులో, అతను చోటా నాగ్పూర్ చక్రవర్తి సైన్యంలో సైనికుడిగా
నియమించబడ్డాడు మరియు చాలా తక్కువ వ్యవధిలో, అతను రాజు
ఆస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు.
త్వరలో, బాద్కాగవ్ జగన్నాథ్పూర్ (Badkagaon Jagannaathpur) రాజు ఠాకూర్ విశ్వనాథ్ సహదేవ్ అతనిని మంత్రి గా నియమించాడు. అక్కడ ఆదివాసులు మరియు స్థానిక
అన్సారీ యువకులతో కూడిన గొప్ప సైన్యాన్ని అతను సిద్ధం చేశాడు మరియు పాలనను
మెరుగుపరిచాడు.
1795 నుండి చోటా నాగ్‌పూర్ మరియు సంతల్ పరగణా, గోండ్ మరియు భీల్
యొక్క ఆదివాసులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యతిరేకం గా చేస్తున్న తిరుగుబాటు
షేక్ భిఖారీకి తెలుసు. అతను స్థానిక ఆదివాసీ నాయకులతో పాటు, బ్రిటిష్
సైన్యంలో పనిచేసే నాదిర్ అలీ ఖాన్ , సార్జెంట్ రామ్
విజయ్, డియోఘర్ నుండి ఇద్దరు సైనిక గుర్రపు సైనికులు - సలామత్ అలీ
మరియు అమానత్ అలీ తదితర వ్యక్తులతో కలిసి ఒక రహస్య సంస్థను నిర్మించాడు మరియు దేశ
స్వేచ్ఛా లక్ష్యం కోసం పనిచేయసాగినాడు..
అతను చైబాసా, డుమ్కా (Chaibasa, Dumka) మరియు హజారిబాగ్ మొదలగు ప్రాంతాలనుండి నుండి స్వాతంత్ర్య విప్లవకారులను ఏకీకృతం చేశాడు
మరియు వారికి ఆధునిక ఆయుధ శిక్షణను అందించాడు. అటవీ మరియు కొండ ప్రాంతాల ప్రజలకు అతను
గొరిల్లా పోరాటoలో శిక్షణ ఇచ్చాడు. 1857 లో, తిరుగుబాటు యొక్క
ప్రతిధ్వని ఉత్తర భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నప్పుడు, షేక్ భిఖారీ కూడా
తన ప్రచార వేగాన్ని వేగవంతం చేశారు మరియు బ్రిటిష్ వారిచే హజారిబాగ్ జైలు లో ఖైదు చేయబడిన సిద్దూ మరియు కన్హు అనే ఇద్దరిని జైలు నుండి విడిపించుటలో సహాయం చేసాడు. అతను రాజా
కున్వర్ సింగ్, హజ్రత్ మహల్ పీర్ అలీ వంటి విప్లవకారులతో పరిచయాలను
ఏర్పరచుకున్నాడు. కాని
షేక్ భిఖారీ మొఘల్ నాయకులు, మరాఠాలు మరియు
ఆఫ్ఘన్ల మధ్య అంతర్గత సంఘర్షణకు బాధితుడు అయినాడు. అయినప్పటికీ అతను
తన విప్లవ కార్యకలాపాలను విడనాడలేదు మరియు స్వేచ్ఛ కోసం తన పోరాటం సాగించినాడు..
1857 విప్లవ శంఖం మోగినప్పుడు, షేక్ భిఖారీ చోటా
నాగ్పూర్ ప్రాంతంలోని విప్లవ కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించాడు. చైబాసా, డుమ్కా, సంతల్ పరగణా, హజారిబాగ్ మరియు రాoమ్ఘర్
కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండాను ఎత్తారు. ఫలితంగా రాంచీలో 25 మంది బ్రిటిష్
సైనికులు హత్యకు గురయ్యారు. భగోదర్‌కు వెళ్లే మార్గంలో షేక్ భిఖారీ చోటా
నాగ్‌పూర్, డాల్టన్‌గంజ్ మరియు పిథోరియా గుండా వెళ్ళాడు, కాని చత్రా రాజు
అతనికి ద్రోహం చేసి తన భూభాగంలో బ్రిటిష్ వారికి ఆశ్రయం ఇచ్చాడు. అదేవిధంగా పలాము జిల్లాకు
చెందిన లెఫ్టినెంట్ గ్రాహంను ఓడించిన తరువాత, మొత్తం జిల్లా విప్లవకారుల
స్వాధీనం అయింది ఫలితంగా బ్రిటిష్ వారు మొత్తం ప్రాంతంపై నియంత్రణ కోల్పోయారు.
వీటి మధ్య 1857 లో, రాంచీలోని డోరండాలో ఠాకూర్ విశ్వనాథ్ సహదేవ్ ని రాజుగా పట్టాభిషేకం చేశారు.
చోటా నాగ్‌పూర్‌లోని ఈ విముక్తి పొందిన ప్రాంతాల కారణంగా, బెంగాల్ మరియు
ఒరిస్సాకు వెళ్ళే మార్గం విప్లవకారుల వశమైనది మరియు గ్రాండ్ ట్రంక్ రోడ్ పై బ్రిటిష్ వారు తమ నియంత్రణ
కోల్పోయారు.
దీనితో ఈస్ట్ ఇండియా కంపెనీ విప్లవకారులకు వ్యతిరేకంగా జనరల్ మెక్‌డొనాల్డ్
మరియు డాల్టన్‌లకు కోల్‌కతా నుండి అదనపు సైనిక సరఫరాలను పంపినది. మరోవైపు, దేశద్రోహులు
మరియు ద్రోహులు కూడా బ్రిటిష్ వారికి తమ మద్దతును అందించారు. షేక్ భిఖారీ అప్పటికే
కుసో పర్వతం యొక్క గుహలలో ఒక రహస్య స్థలం లో దాక్కునాడు. అక్కడ అతను తన కొద్దిమంది
విప్లవ స్నేహితులతో కలసి నివసించేవాడు
మరియు బ్రిటిష్ వారిపై గొరిల్లా దాడిని నిర్వహించే వాడు.
అతను రహస్యoగా దాక్కున్న స్థలాన్ని బ్రిటిష్ వారికి అతని
విరోధి పరగ్నాయత్ (Paragnayat) వెల్లడించాడు.
షేక్ భిఖారీని అతని మిత్రుడు టికైట్
ఉమ్రావ్ సింగ్‌ను అరెస్టు చేశారు మరియు
వారిద్దరినీ 1858 జనవరి 8 న ఉరితీశారు. ఈ ప్రాంతంలో భయాందోళనలు వ్యాప్తి
చెందడానికి, అతని స్నేహితులను రహదారి చెట్లపై బ్రిటిష్ వారు ఉరితీశారు మరియు
వారి శవాలు కుళ్లిపోయి పడిపోయే వరకు వేలాడదీయబడ్డాయి!
అమరవీరుడు, టికైట్ ఉమ్రావ్ సింగ్‌ను అతని పూర్వీకుల గ్రామమైన
జార్ఖండ్‌లోని ఖతంగలో దహనం చేశారు. అమరవీరుడు, షేక్ భిఖారిని అతని
పూర్వీకుల గ్రామమైన మక్కా హుప్టేలో దహనం
చేశారు. అతన్ని ఉరితీసిన మర్రి చెట్టు ఇప్పటికీ అమరవీరుల ప్రదేశంగా గుర్తుంచబడి అతని
స్వాతంత్ర్య పోరాట కథను వివరిస్తుంది.
జనరల్ మెక్‌డొనాల్డ్ మాటల్లో: “తిరుగుబాటుదారులలో, షేక్ భిఖారీ
అత్యంత ప్రసిద్ది చెందిన మరియు ప్రమాదకరమైన తిరుగుబాటుదారుడు.”
దేశ స్వేచ్ఛా కొరకు పోరాడిన అరుదైన స్వాతంత్ర్య సమరయోధులలో
షేక్ భిఖారీ ఒకడు మరియు అతను తన మాతృదేశం కోసం సర్వస్వం త్యాగం చేశాడు.
.
No comments:
Post a Comment