త్యాగం మరియు బాధలు విజయానికి ఎలా మార్గం సుగమం
చేస్తాయనే సందేశాన్ని హజ్రా తెలియజేస్తుంది.
ఇది అరేబియాకు తల్లి అయిన ఉమ్ము ఇస్మాయిల్, నల్లజాతి (ఇథియోపియన్) మహిళ కథ! సఫా మరియు మార్వా ద్వారా ఇప్పటికీ, ఎప్పటికి గుర్తుండిపోయే ఒక మహిళ కథ! మక్కా ఇసుకతో తన కన్నీళ్లు
కలిపిన ఒక స్త్రీ కథ! ఈ కథ ప్రతి తల్లి, భార్య మరియు అల్లాహ్ సేవకుడికి ప్రేరణ!
ప్రతి ముస్లిం/విశ్వాసి జీవితంలో హజరాకు ఉన్న ప్రాముఖ్యత గురించి మీరు
ఎప్పుడైనా ఆలోచించారా? అల్లాహ్‌పై తనకున్న బలమైన విశ్వాసంతో ధైర్యవంతురాలైన ఒక
మహిళ మక్కాను నిర్మించడంలో మొదటి అడుగు వేసింది, మక్కా ఆ తరువాత ఇస్లామిక్ సంస్కృతి మరియు నాగరికతకు కేంద్రంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు/విశ్వాసులు కాబా అభిముఖంగా తమ ప్రార్థనలను చేసేటప్పుడు ఆమెను
గుర్తుంచుకుంటారు. వారు ఉమ్రా మరియు హజ్ చేసేటప్పుడు సఫా మరియు మార్వా మధ్య
నడుస్తున్నప్పుడు ఆమె పాదముద్రలను అనుసరిస్తారు.
తన ఏకైక కొడుకు ఒక్క నీటి చుక్క కోసం ఆరాటపడుతూ
ఎర్రటి మండే ఎండ కింద పడుకున్నప్పుడు ఈ తల్లి అనుభవించిన ఆవేదన గురించి
ఆలోచించకుండా ఎవరైనా జంజం నీరు తాగగలరా? మహజీర్ (వలసదారు) అనే పదం వలె హిజ్రత్ (వలస) అనే పదానికి ఆమె పేరు ఉంది.
"ఆదర్శ వలసదారుడు హజరా లాగా ప్రవర్తించేవాడు" అని ప్రవక్త ముహమ్మద్ (స)
చెప్పారు. ఇవన్నీ ఆమెను ఇస్లాం చరిత్రలో మరుపురాని మరియు సదా అనుసరించే మహిళగా
మార్చగలవు.
హజ్రా ఎవరు
హజ్రా ఒక ఇథియోపియన్ మహిళ, ఇబ్రహీం (అ.స) భార్య సారాకు పనిమనిషిగా ఇవ్వబడింది. ఆమె చాలా పేద
మరియు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంది. ఇబ్రహీం (అ.స) మరియు సారా వృద్ధాప్యాన్ని సమిపించినప్పటికీ ఒక బిడ్డను కనలేక పోయినారు. హజ్ర యొక్క వినయపూర్వకమైన స్వభావం వలన ఇబ్రహీం (అ.స) ఆమెను వివాహం చేసుకోవడంలో సారాకు ఎటువంటి అభ్యంతరం
లేదు. వారికి త్వరలోనే ఒక మగ పిల్లవాడు
కలిగినాడు మరియు వారు అతనికి ఇస్మాయిల్
అని పేరు పెట్టారు. ఒక నల్లజాతి స్త్రీ, పైగా బానిస అయిన ఆమెను సమాజo తక్కువ విలువ ఇచ్చింది అయినప్పటికీ హజర ఇబ్రహీంకు రెండవ భార్య అయ్యింది. ఇస్మాయిల్ కు తల్లి అయింది ముఖ్యంగా కాబా నిర్మాణం కు ముఖ్య కారణం అయినది.
హజర అరేబియాకు ఎలా తల్లి అయ్యారు?
ఇబ్రహీం(అ.స) తన భార్య హజర, కుమారుడు ఇస్మాయిల్(అ.స)తో కలిసి మక్కాకు బయలుదేరారు. రోజుల తరబడి కొనసాగిన
సుదీర్ఘమైన అలసటతో కూడిన ప్రయాణం తరువాత, వారు ఎడారికి చేరుకున్నారు, అక్కడ వారికి నర
సంచారం కనిపించలేదు.. చుట్టు భారీ పర్వతాలతో కూడిన లోయలో వింత నిశబ్దం ఉంది. కొంత
సమయం విశ్రాంతి తీసుకున్న తరువాత, ఇబ్రహీం(అ.స)
బయలుదేరడానికి సిద్ధమవుతున్నట్లు హజర గమనించారు.
ఇబ్రహీం(అ.స) తనను మరియు తమ కొడుకును ఒంటరిగా లోయలో
వదిలి వెళ్ళడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. "మీరు మమ్మల్ని ఇక్కడ ఒంటరిగా
వదిలేయబోతున్నారా?" అని అడిగింది హజర. ఇబ్రహీం (అ.స) "అవును" అని
సమాధానమిచ్చారు మరియు కోoత విరామం తరువాత, "మీరు ఇక్కడ ఒంటరిగా లేరు, అల్లాహ్ మీతో
ఉన్నారు" అని అన్నారు. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అవునా అని ఆమె అడిగారు మరియు
ఇబ్రహీం (అ.స) అవును అని సమాధానం ఇచ్చారు. "అయితే సర్వశక్తివంతుడైన అల్లాహ్ మమ్మల్ని రక్షిస్తాడు" అని హజర
అన్నది. ఈ మాటలు సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ పట్ల ఆమెకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసం నుండి
వచ్చాయి.
ముస్లిం ఉమ్మా ఆమెను ‘అల్లాహ్ మమ్మల్ని రక్షిస్తాడు’ అన్న తన విశ్వాసపు మాటలను
అనుమానించని మహిళగా గుర్తించడానికి ఇది ఒక
కారణం. కన్నీళ్లు, భయాలను దాచిపెట్టి, ఆమె తన భర్తకు వీడ్కోలు చెప్పింది. కొంచెం
ప్రయాణించిన తరువాత, ఇబ్రహీం (అ.స) అల్లాహ్ ను ప్రార్థించారు “ఓ ప్రభూ! తృణకాష్ట జలరహితమైన లోయలో నా
సంతానం కొందరిని తెచ్చి నీ పవిత్ర
గృహంవద్ద నివాసంపజేశాను. ప్రభూ! వారు ఇక్కడ నమాజును స్థాపించాలని నేను ఇలా
చేసాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తి
తో వారి వైపునకు మొగ్గేలా చెయ్యి, తినటానికి వారికీ పండ్లు ప్రసాదించు, బహుశా వారు
కృతజ్ఞులౌతారేమో. ”[సూరా ఇబ్రహీం 14:37]”.
హజర మరియు ఇస్మాయిల్(అ.స) లోయలో ఒంటరిగా ఉన్నారు.
అడవి జంతువులు లేదా దోపిడీదారులు దాడి చేస్తారు అనే భయం వంటి అన్ని రకాల భయాలు ఆమెను వెంటాడటం ప్రారంభించాయి.ఆమె కు కలిగిన మొట్టమొదటి భయం ఏమిటంటే, ఆహారం మరియు నీరు త్వరలోనే అయిపోతాయి అని. వారి వద్ద ఉన్నది కొన్ని
మిగిలిపోయిన ఖర్జూరాలు మరియు ప్రయాణించేటప్పుడు తమతో వారు తీసుకువెళ్ళిన కొంత
నీరు. ‘సహార్’ చెట్టు కింద రెండు రోజులు గడిపిన తరువాత, వారికి తినడానికి ఏమీ మిగలలేదు. తన బిడ్డ ఆకలితో కేకలు వేయడాన్ని చూడటం తల్లి
హృదయo తల్లడిల్లినది. హజర దానిని భరించ లేకపోయినది.
ఆమె అల్లాహ్‌ను ప్రార్థించింది మరియు ఆమెకు తక్షణ
ప్రతిస్పందన రానప్పుడు, అల్లాహ్‌పై ఆమెకున్న విశ్వాసం తగ్గలేదు, ఆమె ఎవరినీ శపించలేదు, నిందించలేదు, ఆమె ఓపికగా ఉండిపోయింది. కొంత ఆశతో, నీటి జాడలు ఏమైనా లభిస్తాయా అని ఆశతో ఆమె ‘సఫా’ వైపు పరిగెత్తింది. ఆమె చుట్టూ చూచినప్పటికీ ఆమెకు
ఏమీ దొరకలేదు. ఆమె దిగి, లోయకు అవతలి వైపున ఉన్న మరో పర్వతమైన ‘మార్వా’ వైపు పరుగెత్తింది. ఆమె 6-7 సార్లు ఇలా చేస్తూనే ఉంది. ఆమె చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు, మానసికంగా మరియు శారీరకంగా అలసిపోయింది. ఈ క్రమం లో తన కొడుకు శ్వాస తీసుకోకపోవచ్చు అన్న భయంతో ఆమె తిరిగి కొడుకు వద్దకు వచ్చింది.
ఇస్మాయిల్(అ.స) తన కాళ్ళను కొట్టే చోట నుండి నీరు రావడాన్ని ఆమె ఆశ్చర్యo తో చూసింది. ఆమె తన బేసిన్లో నీరు నిండినప్పుడు ఆమె
‘జమ్‌జమ్’ అన్నారు. చర్మపు నీటి తిత్తి నిoడిన తరువాత, ఆమె మరియు ఆమె కొడుకు ఆహరం తిని తమ దాహాన్ని తీర్చుకొన్నారు.
ముహమ్మద్ ప్రవక్త (స) ఇలా అన్నారు: “అల్లాహ్ హజర ను ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే ఆమె‘ జమ్‌జమ్ ’అని చెప్పకపోతే, అది ఇప్పుడు కూడా పొంగిపోర్లేది”. ప్రయాణికులు లోయలో నీటిని
చూసినప్పుడు, వారు అక్కడ
విశ్రాంతి తీసుకోవచ్చా అని దాని ‘యజమాని’ని అడిగారు. త్వరలో ప్రజలు అక్కడ భారీ సంఖ్యలో స్థిరపడటం
ప్రారంభించారు మరియు వాణిజ్యం పెరిగింది. త్వరలోనే ఆ ప్రదేశం పెద్ద నగరంగా
మారింది.
అల్లాహ్ అప్పుడు ఇబ్రహీం (అ.స) ను అక్కడ కాబాను నిర్మించమని కోరారు. ఇబ్రహీం తన
ప్రియమైన కొడుకు ఇబ్రహీం (అ.స) తో కలిసి కాబా ను నిర్మించాడు,
అప్పటినుండి ఈ క్షణం వరకు, ఆ అద్భుతమైన నాలుగు గోడల కాబా అక్కడ స్థిరంగా ఉంది. ప్రపంచంలోని అన్ని
ప్రాంతాల లోని ముస్లింలు దానికి అభిముఖంగా నిలబడి తమ ప్రార్థనలు చేస్తారు.
హజర మనకు ఏమి బోధిస్తారు?
హజర ప్రతి ముస్లింను ప్రేరేపించే మహిళ, ఆమె ఉదాహరణ నేటి సందర్భంలో కూడా వర్తిస్తుంది. అల్లాహ్
ప్రతిసారీ మమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మనమందరం ఒంటరిగా మరియు నిస్సహాయంగా
భావించే అనేక పరిస్థితులను ఎదుర్కొంటాము, కాని హజర లాగా ఆ పరిస్థితులను అధిగమించి ముందుకు సాగడం లో ఎంతవరకు విజయవంతం అవుతాము?
హజర లాగా పరిణతి చెంది ప్రశాంతంగా ప్రవర్తించడం మనకు సాధ్యమవుతుందా?
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు,
మనం తరచూ మనలను నిందించే వ్యక్తులను నిందించడం లేదా శపించడం
చేస్తాము.
అల్లాహ్ కోసం మనలను మనం పూర్తిగా అంకితం
చేసిన తరువాత కూడా అల్లాహ్ మనలను కష్టాలలో ఎందుకు ఉంచుతాడో అని మనం నిరంతరం ఆశ్చర్యపడుతుంటాము.
తెలియని ప్రదేశంలో ఒంటరిగా మిగిలిపోయినా, మన బాధ్యతలను హజర
మనకు గుర్తుచేసింది. మనం విశ్వాసాన్ని నిండా నింపుకొని భయాలను జయించాలి అని ఆమె కథ
మనకు బోధిస్తుంది.
నిజాయితీ, ధైర్యం,
ఓర్పు, వినయం, మరియు ముఖ్యంగా అల్లాహ్‌పై మనకు బలమైన విశ్వాసం ఉంటే,
పరిస్థితి ఏమైనప్పటికీ మనం అన్నింటినీ సానుకూలతతో సాధించ
వచ్చు అని ఆమె మనకు బోధిస్తుంది. ఆమె కథ
అన్ని కాలాల వారికి మరియు ప్రజలందరికీ సంబంధించినది. మీరు చేయాల్సిందల్లా మీ
పరిస్థితిలో ఉంటె ఆమె ఏమి చేస్తుందో ఆలోచించడం, అప్పుడు మీరు విషయాలను గ్రహించగలుగుతారు.
ఇస్మాయిల్(అ.స)కు జన్మనిచ్చి, ఆమె మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (స)
వంశాన్ని సృష్టించింది. త్యాగం మరియు బాధలు విజయానికి ఎలా
మార్గం సుగమం చేస్తాయనే సందేశాన్ని హజర తెలియజేస్తుంది.
No comments:
Post a Comment