ఇస్లామిక్ స్వర్ణయుగ
ఆలోచనాపరులు పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలకు ముందే చాలా విషయాలను కనుగొన్నారు. మీరు కోపర్నికస్, ఫైబొనాక్సీ మరియు
ఫెర్మాట్ (Fibonacci and Fermat) గురించి విన్నారు..
కానీ ఇబ్న్ అల్-హైతం, అల్-బెరోని, అల్-రాజి మొదలగు
ఇస్లామిక్ స్వర్ణయుగ ఆవిష్కర్తలను వారు కనుగోన్న వాటి గురించు వినియుండరు. ఆ
అవిష్కర్తలను వారి ఆవిష్కరణలను ఒకసారి పరిశిలిద్దాము.
·
ఖగోళ శాస్త్రం : పెర్షియన్ పాలిమత్
నాజర్ అల్-డాన్ టాసే కోపర్నికస్ కన్నా ముందే సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో ఉన్నాడు అని ఆన్నాడు. పాలపుంత అనేది మిలియన్ల నక్షత్రాలతో
కూడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు (తరువాత ఇది 1610 లో గెలీలియో చేత
ధృవీకరించబడింది)
·
గణితం: ఈజిప్టు గణితవేత్త
ఇబ్న్ అస్లామ్ 890AD లో కరణీయ
గుణకాలు,అనిర్ధారిత సమస్యలు, మరియు అనేక జ్యామితి వివరణలు (indeterminate problems, irrational co-efficients
and geometric proofs) కనుగొన్నాడు. ఫైబొనాక్సీ 300 సంవత్సరాల తరువాత అతని కృషి నుండి ప్రేరణ పొందటo జరిగింది.
·
క్లినికల్ ట్రయల్స్: పెర్షియన్ పాలిమత్
అల్-రాజి 890AD లో మొదటి
నియంత్రిత వైద్య పరీక్ష (Clinical trials) ను నిర్వహించారు. వీటిని పడమట 1799 లో జాన్ హేగార్త్
నిర్వహించాడు.
·
శస్త్రచికిత్స: స్పానిష్
వైద్యుడు ఇబ్న్ జుహ్ర్ పశ్చిమ దేశాలకు కనీసం 700 సంవత్సరాల ముందు కంటిశుక్లం మరియు మూత్రపిండాల
రాళ్లను తొలగించే పద్ధతులను అభివృద్ధి చేశాడు. 975AD లో అతని తోటి శాస్త్రవేత్త అల్-జహ్రోవి శస్త్రచికిత్స
సమయంలో తన రోగులు నొప్పిలేకుండా నిద్రపోయేలా పీల్చే అనస్థీషియాను ఉపయోగించాడు.
·
జాగ్రఫీ: 11 వ శతాబ్దపు
ఇరానియన్ ఆలోచనాపరుడు అల్-బెరోని కొలంబస్‌కు 400 సంవత్సరాల ముందు అమెరికా ఉనికి మరియు
పరిమాణాన్ని ప్రతిపాదించాడని కొత్త ఆధారాలు చూపిస్తున్నాయి.
·
భౌతిక శాస్త్రం: అరబ్ గణిత
శాస్త్రజ్ఞుడు ఇబ్న్ అల్-హేతం ‘ కనిష్ట సమయం ’ theory
of ‘least time’ అనే
సిద్ధాంతాన్ని కనుగొన్నాడు, ఇది ఫెర్మాట్
సూత్రం గా ప్రసిద్ది చెందటానికి 650 సంవత్సరాల ముందు కనుగొనబడింది.
No comments:
Post a Comment