భారత
స్వతంత్ర సమరంలో పాల్గొన్న ముస్లిం యోధులు.
స్వాతంత్ర్యానికి
ముందు, భారతీయ సంస్కృతిలో హిందూ-ముస్లింలు అంతర్భాగంగా ఉన్నారు. ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య స్నేహం
మరియు సోదరభావం ఆదర్శప్రాయంగా ఉoది. మత
సామరస్యం యొక్క ప్రతీకగా ఉన్నారు.
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముస్లింల గురించి అడిగితే
మన మనస్సుల్లోకి వచ్చే ఏకైక పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాత్రమె. కాని ఆధునిక భారతీయ
చరిత్ర పుస్తకాలు/సిలబస్‌లో భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ పొందటానికి పోరాడిన మరియు అమరులైన
అనేకమంది భారతీయ ముస్లింల గురించి ప్రస్తావన లేదు. భారతదేశ
స్వేచ్ఛ. స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం లో ముస్లిం నాయకులు కూడా ఒక ముఖ్యమైన పాత్ర
పోషించారు.
స్వాతంత్ర్య
యుద్ధంలో పోరాడి మరుగునపడ్డ అనేమంది
ధైర్యవంతులు శౌర్యవంతులైన (brave hearts)ముస్లింల గురించి ప్రస్తావిoచటం మన కర్తవ్యం మరియు మన విధి.. అటువంటి ముస్లిం భారత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించడానికి ఇది నా వినయపూర్వకమైన
ప్రయత్నం
మౌలానా హస్రత్ మోహాని (Maulana Hasrat Mohani)
సిల్క్ లెటర్ మూవ్మెంట్
(రేష్మి రుమాల్ థెరిక్)Silk Letter Movement
(Reshmi Rumal Thereek)
వాస్తవానికి, రేష్మి రుమాల్ తెహ్రీక్ 1913 నుండి 1920 మధ్య డియోబంది నాయకులు నిర్వహించిన ఒక ఉద్యమo. అటోమన్ టర్కీ, ఇంపీరియల్ జర్మనీ మరియు ఆఫ్ఘనిస్తాన్లతో పొత్తు పెట్టుకోవడం
ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విడిపించే లక్ష్యంతో ఈ ఉద్యమం సిర్వహించ
బడినది.
అప్పటి ఆఫ్ఘనిస్తాన్‌లో
ఉన్న డియోబంది నాయకులలో ఒకరైన ఉబైదుల్లా సింధి, పర్షియాలో ఉన్న ఇతర నాయకులకు మహమూద్ అల్ హసన్ రాసిన లేఖలను పంజాబ్
సిఐడి స్వాధీనం చేసుకుంది. అక్షరాలు పట్టు వస్త్రంలో వ్రాయబడ్డాయి, అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.
సిల్క్ లెటర్స్ ఉద్యమంలో
ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ మరొక ప్రముఖ వ్యక్తి. ఇతను ఇస్లామిక్ స్కూల్ ఆఫ్
డియోబంద్ కు సంభందించిన ముస్లిం మతాధికారుల నేతృత్వంలో జరిగిన భారత స్వాతంత్ర్య
ఉద్యమo పాల్గొన్న అత్యంత చురుకైన మరియు ప్రముఖ సభ్యులలో ఒకరు. 1946 లో భారత జాతీయ కాంగ్రెస్ ఆయనను
భారతదేశానికి తిరిగి రావాలని కోరింది. దానికి బ్రిటిష్ ప్రబుత్వం అనుమతి ఇచ్చింది..
1857 నాటి తిరుగుబాటు, అవధ్ మరియు లక్నో ముట్టడిలో ప్రసిద్ధి చెందాడు.
బ్రిటిష్ చరిత్రకారుడు
జి.బి. మల్లెసన్ మొదటి స్వాతంత్ర్య యుద్ధం (1857) యొక్క గొప్ప వీరులలో ఒకరని ఫైజాబాద్‌కు చెందిన మౌల్వి అహ్మదుల్లా షాను
వర్ణించాడు. బ్రిటీష్ వారు అతన్ని అత్యంత విలువైన శత్రువుగా మరియు గొప్ప యోధునిగా
భావించారు. బ్రిటిష్ అధికారి థామస్ సీటన్ అతన్ని ఒక "గొప్ప సామర్ధ్యాలు, ధైర్యం, దృడమైన సంకల్పం కల ఉత్తమ సైనికుడు."అని ప్రశంసించారు. బ్రిటీష్ రచయిత మల్లెసన్ మౌల్వి అహ్మదుల్లా షా ను ఒక దేశభక్తుడు తన స్వదేశానికి, దేశ స్వాతంత్ర్యం కోసం, పోరాడుతున్న వ్యక్తి మరియు నిజమైన దేశభక్తుడు గా
అభివర్ణించాడు.
యూసుఫ్ మెహరల్లీ భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సోషలిస్ట్
నాయకుడు. ప్రసిద్ది చెందిన “సైమన్ గో బ్యాక్! మరియు క్విట్ ఇండియా” అనే నినాదాల
సృష్టికర్త. అతను 1942 లో బొంబాయి మేయర్‌గా ఎన్నికయ్యాడు, అతను యరవాడ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డాడు.
.
మౌలానా బర్కతుల్లాగా
గౌరవప్రదంగా పిలువబడే అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బరకతుల్లా ఒక భారతీయ విప్లవకారుడు.
భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ప్రముఖ వార్తాపత్రికలలో వేడి వేడి ప్రసంగాలు మరియు విప్లవాత్మక రచనలతో బర్కతుల్లా
భారతదేశం వెలుపల నుండి పోరాడారు. బర్కాతుల్లా ఇండియా ఇండిపెండెన్స్ పార్టీ మొదటి
అధ్యక్షుడు.
భారతదేశo స్వేఛ్చ
పొందినప్పుడు అతను జీవించలేడు. అతని గౌరవార్థం 1988 లో భోపాల్ విశ్వవిద్యాలయానికి బర్కతుల్లా
విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు.
అబ్దుల్ గఫర్ ఖాన్ ఒక పష్తున్ స్వాతంత్ర్య
కార్యకర్త, అతను బ్రిటిష్ వారి పాలనను భారత దేశం లో అంతం చేయడానికి పనిచేశాడు. అతను అహింసావాది. పేరుగాంచిన
రాజకీయ మరియు ఆధ్యాత్మిక నాయకుడు; అతను జీవితకాల శాంతికాముకుడు మరియు గొప్ప ధార్మిక ముస్లిం. మోహన్‌దాస్ గాంధీ
యొక్క సన్నిహితుడు అయిన బచా ఖాన్ (అబ్దుల్ గఫర్ ఖాన్) ను అతని సన్నిహితుడు అయిన అమీర్ చంద్
బొంబ్వాల్ "ఫ్రాంటియర్ గాంధీ"
అని పిలిచాడు.
ఫ్రాంటియర్ గాంధీ’ గా ప్రసిద్ది చెందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1929 లో ఖుదై ఖిద్మత్గర్ ("దేవుని
సేవకులు") ఉద్యమాన్ని స్థాపించారు. దాని విజయం తో బ్రిటిష్ ప్రభుత్వం అతనిపై మరియు అతని
మద్దతుదారులపై కఠినమైన అణిచివేతకు పాల్పడినది మరియు వారు భారత స్వాతంత్ర్య ఉద్యమం లో
అత్యంత తీవ్రమైన అణచివేతకు గురయ్యారు. స్వాతంత్ర్యం తరువాత, అతను భారతదేశ విభజనను వ్యతిరేకించాడు.
అలీ సోదరులు 1921 లో ప్రసిద్ధ
ఖిలాఫత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ తో కలసి ప్రారంభించారు, ఈ ఉద్యమం భారత
దేశపు బహుళ సమాజానికి మరియు భారతదేశ సంస్కృతికి గొప్ప ఉదాహరణను సృష్టించింది.
డాక్టర్ జాకీర్
హుస్సేన్ (Dr. Zakir Husain)
జాకీర్ హుసేన్ హైదరాబాదు (భారతదేశం)లో
జన్మించాడు. ఇతను పఖ్తూన్ జాతికి
చెందినవాడు.జాకీర్ హుస్సేన్ ప్రారంభ ప్రాథమిక విద్య హైదరాబాద్‌లో
పూర్తయింది. అతను ఎటావాలోని ఇస్లామియా హైస్కూల్ నుండి హైస్కూల్ విద్యను పూర్తి
చేసాడు, తరువాత ముహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీలో విద్యను
అభ్యసించాడు, అక్కడ అతను ఒక ప్రముఖ విద్యార్థి నాయకుడు. జాకీర్ హుసేన్ 23 సంవత్సరాల
వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయ ముస్లిం
విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే
పేరు పెట్టాడు.
తరువాత ఇతను
విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, 'బెర్లిన్
విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు.
జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు
కవితా సంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా
మారాడు.
బ్రిటీష్ పాలన నుండి భారతదేశం యొక్క స్వేచ్ఛ కోసం పోరాటంలో పాల్గొన్న జామియా మిలియా ఇస్లామియా సంస్థకు
విద్యా మరియు కార్యనిర్వాహక నాయకత్వాన్ని అందించినాడు తరువాతి ఇరవై ఒక్క
సంవత్సరాలు పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మహాత్మా గాంధీ, హకీమ్ అజ్మల్ ఖాన్ తో తో చేతులు కలిపి, "బేసిక్
విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు.
భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ
కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత
విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. ఈ కాలంలో అతను భారతదేశంలో
విద్యా సంస్కరణల కోసం జరిగిన ఉద్యమాలతో పాల్గొన్నాడు మరియు తన పాత మాత్రు విద్య
సంస్థ /అల్మా మాటర్ ముహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల (ఇప్పుడు అలీఘర్ ముస్లిం
విశ్వవిద్యాలయం) వ్యవహారాల్లో చురుకుగా పోల్గోన్నాడు.
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
వైస్-ఛాన్సలర్ పదవిని హుస్సేన్ అంగీకరించారు. వైస్
ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్
చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని
అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా
ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని
పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి.
రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు
రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన
చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
బహదూర్ షా జాఫర్ (Bahadur Shah Zafar)
బహదూర్ షా జాఫర్
నామమాత్రపు చక్రవర్తి, ఎందుకంటే అప్పటికే మొఘల్ సామ్రాజ్యం పేరుకు మాత్రమే ఉంది
మరియు అతని అధికారం డిల్లి నగరానికి (షాజహానాబాద్) మాత్రమే పరిమితం అయినది. బహదూర్
షాకు ఎప్పుడూ రాజ్య వ్యవహారాల /స్టేట్ క్రాఫ్ట్ పట్ల ఆసక్తి లేదు లేదా
"సామ్రాజ్య ఆశయం" లేదు.
1857 నాటి భారతీయ
తిరుగుబాటులో అతని ప్రమేయం నిర్ధారణ అయిన తరువాత బ్రిటిష్ వారు అతనిని డిల్లి నుండి
బ్రిటిష్ నియంత్రణలో ఉన్న బర్మాలోని రంగూన్‌కు బహిష్కరించారు. 1857 తిరుగుబాటులో
షాకు ప్రధాన పాత్ర ఉంది మరియు ఒక ప్రధాన ఏకీకృత శక్తిగా పరిగణించబడినాడు.
టిప్పు సుల్తాన్ Tipu Sultan
మైసూర్ టైగర్
మరియు టిప్పు సాహిబ్ అని కూడా పిలువబడే టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యానికి పాలకుడు
మరియు పండితుడు, సైనికుడు మరియు కవి. అతను మైసూర్ కు చెందిన సుల్తాన్ హైదర్
అలీ పెద్ద కుమారుడు. టిప్పు తన పాలనలో అనేక పరిపాలనా ఆవిష్కరణలను ప్రవేశపెట్టాడు, వాటిలో అతని
నాణేలు, కొత్త మౌలుడి లూనిసోలార్ (Mauludi lunisolar) క్యాలెండర్ మరియు మైసూర్ పట్టు పరిశ్రమ అభివృద్ధికి
నాంది పలికిన కొత్త భూ ఆదాయ వ్యవస్థ మొదలగునవి ముఖ్యమైనవి.
టిప్పు ఇనుముతో
కప్పబడిన మైసూరియన్ రాకెట్లను అభివృద్ది పరచినాడు. సైనిక మాన్యువల్ ఫతుల్
ముజాహిదిన్ రాసినాడు మరియు రాకెట్
ఫిరంగిదళాల వాడకంలో మార్గదర్శకుడిగా పరిగణించబడేవాడు. అతను 1792 మరియు 1799 శ్రీరంగపట్న
ముట్టడిలో బ్రిటిష్ దళాలు మరియు వారి మిత్రదేశాల పురోగతికి వ్యతిరేకంగా రాకెట్లను
ఉపయోగించాడు.
బద్రుద్దీన్ త్యాబ్జీ 1867 లో భారతదేశానికి తిరిగి వచ్చి ఏప్రిల్ 1867 లో ముంబైలో మొట్టమొదటి భారతీయ బారిష్టర్/న్యాయవాది
అయ్యాడు. 1895 లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడు.. 1902 లో బొంబాయి హైకోర్టు (ముంబై) ప్రధాన
న్యాయమూర్తి పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు అయ్యాడు.త్యాబ్జీ మహిళల
విముక్తిలో చురుకుగా ఉన్నారు మరియు జెనానా వ్యవస్థను బలహీనపరిచేందుకు కృషి చేశారు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మితవాద ముస్లింలలో ఒకరిగా ఆయన పరిగణించబడ్డారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (1887-88) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ముస్లిం సమాజాన్ని ఏకం చేయడం మరియు అంతర్గతంగా ప్రభావాన్ని పొందడంపై దృష్టి
పెట్టారు. అతను, ఫెరోజ్‌షా మెహతా, కాశీనాథ్ త్రింబాక్ తెలాంగ్, దిన్షా ఎడుల్జీ వాచా మరియు ఇతరులతో కలిసి 1885 లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను
ఏర్పాటు చేశాడు.
అరుణ గంగాలీగా జన్మించిన అరుణ అసఫ్
అలీ (16 జూలై 1909 - 29 జూలై 1996) భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త. 1942 క్విట్ ఇండియా ఉద్యమం, సందర్భంగా బొంబాయిలోని గోవాలియా
ట్యాంక్ మైదాన్ వద్ద భారత జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ప్రఖ్యాతి గాంచినది.
స్వాతంత్ర్యం తరువాత, ఆమె రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నది మరియు , 1958 లో డిల్లి మొదటి మేయర్‌గా ఎన్నికైనది.1960లలో ఆమె మీడియా పబ్లిషింగ్ హౌస్‌ను ప్రారంభించింది.
.
ఆమె 1997 లో మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత్ రత్నను
అందుకుంది.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ Maulana Abul Kalam Azad
మౌలానా అబుల్ కలాం ఆజాద్ పండితుడు మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారత
జాతీయ కాంగ్రెస్ సీనియర్ ముస్లిం నాయకుడు. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, అతను భారత ప్రభుత్వంలో మొదటి విద్యా
మంత్రి అయ్యాడు. అతన్ని సాధారణంగా మౌలానా ఆజాద్ అని గుర్తుంచుకుంటారు; మౌలానా అనే పదం 'మన మాస్టర్' అనే గౌరవప్రదమైన అర్ధం కలిగి ఉంది మరియు అతను ఆజాద్ (స్వేఛ్చ ) ను తన కలం పేరుగా స్వీకరించాడు. భారతదేశంలో
విద్యా పునాదిని స్థాపించడంలో ఆయన చేసిన కృషి భారతదేశమంతా "జాతీయ విద్యా
దినోత్సవం" గా జరుపుకోవడం ద్వారా గుర్తించబడింది.
యువకుడిగా, ఆజాద్ ఉర్దూలో కవిత్వం, అలాగే మతం మరియు తత్వశాస్త్రం గురించి గ్రంథాలను రచించాడు. జర్నలిస్టుగా తన
రచనల ద్వారా, బ్రిటిష్ రాజ్‌ను విమర్శించే రచనలను ప్రచురించడం మరియు భారతీయ జాతీయవాదానికి
కారణాలను వివరించడం ద్వారా ఆయన ప్రాముఖ్యత పొందారు. ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమ
నాయకుడయ్యాడు, ఈ సమయంలో అతను భారత నాయకుడు మహాత్మా గాంధీతో సన్నిహిత సంబంధాలు
పెట్టుకున్నాడు. అజాద్ అహింసా, శాసనోల్లంఘన అనే గాంధీజీ ఆలోచనలకు ఆజాద్ ఉత్సాహభరితమైన మద్దతుదారుడు
అయ్యాడు మరియు 1919 రౌలాట్ చట్టాలను నిరసిస్తూ సహకార ఉద్యమాన్ని నిర్వహించడానికి కృషి చేశాడు.
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు భారతదేశానికి స్వరాజ్ (స్వయం పాలన) తో
సహా వివిధ గాంధీజీ ఆదర్శాలకు ఆజాద్ కట్టుబడి
ఉన్నాడు. 1923 లో, 35 సంవత్సరాల వయస్సులో, అతను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అతి పిన్న వయస్కుడయ్యాడు.
హైదర్ అలీ Hyder Ali
హైదర్ ఆలీ (ఉర్దూ:
سلطان حيدر علی خان) హైదర్ ఆలీ,
1720–1782
దక్షిణాదిన ఉన్న మైసూర్
రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని
ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి
(సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తన్నాన్ని
సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు.
అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం హైదరాబాదు వద్ద వరకు విస్తరించాడు. హైదర్
ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణనను సమర్థవంతంగా అడ్డుకున్న
కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు
స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను
సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ
సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు.
అతను తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో
వ్యవస్థీకరించాడు. రాకెట్ ఆర్టిలరీని సైనికంగా
వినియోగించడాన్ని అభివృధ్ధిచేసాడు.
అష్ఫకుల్లా ఖాన్ Ashfaqulla Khan: 1900 –1927
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అష్ఫకుల్లా
ఖాన్ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమర యోధుడు.ఇతడు రామ్ ప్రసాద్ బిస్మిల్‌తో కలిసి భారత దేశ స్వతంత్రం కోసం తన
ప్రాణాలను అర్పించిన అమర వీరుడు. బిస్మిల్ మరియు అష్ఫాక్ ఇద్దరూ మంచి స్నేహితులు
మరియు ఉర్దూ కవులు. బిస్మిల్ పండిట్ రామ్ ప్రసాద్ యొక్క కలం పేరు అయితే అష్ఫాక్ 'హస్రత్' కలం పేరుతో కవిత్వం
రాసేవాడు. ఇరవయ్యవ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం పై జరిపిన కుట్రలో ఉరి తీసిన తొలి భారతీయ ముస్లిం
అష్ఫకుల్లా ఖాన్.
ఇనాయతుల్లా ఖాన్ మష్రీకి1888-1963 : Inayatullah Khan Mashriqi
1
అల్లామా మస్రికి అని కూడా పిలువబడే ఇనాతుల్లా
ఖాన్ మష్రీకి గణిత శాస్త్రవేత్త, తర్కశాస్త్రజ్ఞుడు, రాజకీయ సిద్ధాంతకర్త, ఇస్లామిక్
పండితుడు మరియు ఖాక్సర్ ఉద్యమ స్థాపకుడు. మష్రీకి ఒక ప్రసిద్ధ గణిత మేధావి, అతను 25 సంవత్సరాల
వయస్సులో కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు, తరువాత 29 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ భారత ప్రభుత్వ
విద్యా విభాగంలో అండర్ సెక్రటరీ అయ్యాడు. అతను ఖురాన్ యొక్క ఎక్సెజెసిస్ (exegesis) రాశాడు అనగా సైన్స్ వెలుగులో ఖురాన్ పై వ్యాఖ్యానం ఇది 1925 నోబెల్ బహుమతికి
నామినేట్ చేయబడింది. అతనికి 32 సంవత్సరాల
వయస్సులో ఆఫ్ఘనిస్తాన్కు రాయబారి పదవిని ఇచ్చారు కాని అతను అన్ని
గౌరవాలను తిరస్కరించాడు.
No comments:
Post a Comment