‘నిశ్శబ్ద గుండెపోటు’ ను సైలెంట్
మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ silent myocardial infarction (SMI)
అని కూడా పిలుస్తారు, ఇది మొత్తం
గుండెపోటులో 45 శాతం మరియు మహిళల కంటే ఎక్కువ
మంది పురుషులను ప్రభావితం చేస్తుంది. ‘నిశ్శబ్ద గుండెపోటు’ అధిక రక్తపోటుతో ముడిపడి
ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది గుండెపోటును ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన ప్రమాద
కారకo.
ఆదర్శవంతమైన
రక్తపోటు 90/60mmHG మరియు 120
/ 80mmHG మధ్య ఉంటుంది; 140/90mmHg పైన ఉంటె అది అధిక
రక్తపోటు. రాజస్థాన్‌లో, దాదాపు 7 శాతం మహిళలు, 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు
గల 12 శాతం మంది పురుషులు అధిక
రక్తపోటును కలిగి ఉన్నారు. పొగాకు వినియోగం, డయాబెటిస్, ఊబకాయం లేదా కొలెస్ట్రాల్
వంటి ఇతర ప్రమాద కారకాల వలన పురుషులు
మరియు మహిళలకు వయసు పెరిగే కొద్దీ నిశ్శబ్ద గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు
మరియు నిశ్శబ్ద గుండెపోటు:
మన గుండె
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తినేది మరియు మనం తీసుకునే కేలరీలను ఎలా
ఉపయోగిస్తాము అనేది ముఖ్యం. ఆధునిక, పట్టణ జీవనశైలి లో శుద్ధి
చేసిన పిండి, చక్కెర, ఉప్పు మరియు
ట్రాన్స్ ఫ్యాట్ వంటి అధిక కేలరీలు కలిగి పోషకాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడo జరుగుతుంది. అంతేకాకుండా, చాలా మంది ప్రజలు
తక్కువ శారీరక కదలికలు మరియు వ్యాయామాలతో నిశ్చల జీవితాన్ని గడుపుతారు. తత్ఫలితంగా, ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు
ఇతర పదార్ధాలు (ఫలకం plaque అని పిలుస్తారు) పేరుకు పోయి ధమనులలో
రక్త ప్రసరణను క్రమంగా
తగ్గిస్తుంది. ఇది ధమనులపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది, దీని ఫలితంగా దమనులకు
నష్టం జరుగుతుంది, దీనిని అథెరోస్క్లెరోసిస్ (atherosclerosis)అంటారు.
ఫలకాలు (plaque) ధమనులను గట్టిపరుస్తాయి దీనితో రక్తం గడ్డకట్టే
అవకాశం ఎక్కువ అవుతుంది. రక్తం గడ్డకట్టడం
లేదా ఫలకం ధమనిని అడ్డుకుంటే, అది గుండె కండరాల
ద్వారా జరిగే రక్త ప్రవాహం కు అంతరాయం కలిగిస్తుంది మరియు కండరాలు ఆక్సిజన్, పోషకాలను
కోల్పోతాయి. గుండె కండరాలలో కొంత భాగం
దెబ్బతినడం లేదా నాశనo అవటం గుండెపోటుకు కారణమవుతుంది (దీనిని మయోకార్డియల్
ఇన్ఫార్క్షన్ లేదా MI అని కూడా పిలుస్తారు) .ఒక
నిశ్శబ్ద గుండెపోటు లో గుర్తించబడని మచ్చలు scarring గుండెకు మరియు హృదయ స్పందనలకు
నష్టం కలిగించ వచ్చు. చికిత్స లేనప్పుడు, ఈ పరిస్థితి గుండె
రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించవచ్చు, కాబట్టి దీని
ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
హెచ్చరిక సంకేతాలు మరియు నివారణ చర్యలు:
నిశ్శబ్ద గుండెపోటు కు లక్షణాలు లేవు అనేది నిజం కాదు – కొన్ని లక్షణాలు ఉన్నాయి, అయితే ఆ లక్షణాలు తేలికపాటి మరియు క్లుప్తంగా ఉంటాయి మరియు చాలామంది వాటిని విస్మరిస్తారు. గుర్తించబడిన రెండు సాధారణ లక్షణాలు అజీర్ణం మరియు కండరాల నొప్పి, ఇక్కడ అసలు కారణం గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. గుండెపోటు సమయంలో ప్రజలు వికారం లేదా అధిక చెమటను కూడా అనుభవించవచ్చు.
మీరు ఈ క్రింది
వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను అనుభవించినట్లయితే వెంటనే వైద్య సహాయం
తీసుకోండి:
- ఛాతీ మధ్యలో చాలా
నిమిషాలు లేదా అడపాదడపా అసౌకర్యం, (వెళ్లి వెళ్లి
తిరిగి వస్తుంది). ఇది అసౌకర్య ఒత్తిడి లేదా పిండి వేయుట లేదా
నొప్పిగా అనిపించవచ్చు.
- చేతులు, మెడ, వీపు, దవడ లేదా కడుపు
వంటి ఇతర శరీర భాగాలలో అసౌకర్యం.
- అసౌకర్యానికి ముందు
లేదా అసౌకర్య సమయంలో శ్వాస ఆడకపోవడం.
- చెమటలు
పట్టడం వికారం లేదా తల తిప్పడం
వంటి అనుభూతి.
నివారణ చర్యలలో ధమని
అడ్డంకులను గుర్తించడానికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి మరియు ఆహారం మరియు జీవనశైలి
మార్పుల ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మరియు
ధూమపానం నియంత్రించాలి. అధిక రక్తపోటును తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ఆహార
ప్రణాళిక (Dietary Approaches to Stop Hypertension (DASH)) ప్రారంబించాలి. రోజుకు
కనీసం 20 నిమిషాల వ్యాయామం చేయాలి.అధిక
బరువు తగ్గించాలి మరియు చురుకుగా ఉండాలి.
No comments:
Post a Comment