2018-19లో చాలా ముఖ్యమైన అధ్యయన
రంగాలలో దళిత ఎన్రోల్మెంట్ 15% తప్పనిసరి కోటా కంటే తక్కువగా ఉంది.
దేశంలోని అనేక అగ్ర
విద్యాసంస్థలలో మార్జినలైజ్డ్ కులాలు మరియు మహిళలు తక్కువ ప్రాతినిధ్యం
వహిస్తున్నారు మరియు కొన్ని రంగాలలో ఘెట్టోయిజ్ చేయబడ్డారు
అట్టడుగు నేపథ్యాల
విద్యార్థులు ఏమి చదువుతారు, మరియు ఉన్నత విద్యా రంగాలలో వారు ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
ఆల్ ఇండియా సర్వే ఆఫ్
హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2018-19 క్రొత్త డేటా కొన్ని సమాధానాలను అందిస్తుంది.
మొత్తం మీద, కొన్ని మినహాయింపులతో, షెడ్యూల్ కుల విద్యార్థులు మరియు ఫార్వర్డ్ కుల(OC)
విద్యార్థులు అధ్యయనం చేయడంలో గణనీయమైన తేడాలు లేవు. సోషల్ వర్క్ పని మరియు సహాయక
నర్సింగ్ (auxilliary nursing) దళిత
విద్యార్థులు ఫార్వర్డ్ కుల విద్యార్థుల
కంటే ఎక్కువగా తీసుకుంటారు, ఉదాహరణకు, హోటల్
నిర్వహణను ఫార్వర్డ్ కుల విద్యార్థులు ఎక్కువగా తీసుకుంటారు. "ఫార్వర్డ్
కులం" కొన్ని సందర్భాల్లో హిందూయేతర మైనారిటీలను కలిగి ఉండవచ్చు, వారి వివరాలను సంస్థ వెల్లడించలేదు
అయితే, చాలా ముఖ్యమైన అధ్యయన రంగాలలో, 2018-19లో షెడ్యూల్ కులం (SC) ఎన్రోల్మెంట్ తప్పనిసరి
కోటా 15% కంటే తక్కువగా ఉంది అదేవిధంగా
షెడ్యూల్ తెగ
(ఎస్టీ) ఎన్రోల్మెంట్ (7.5% తప్పనిసరి కోటా)కూడా.
ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కేరళతో సహా అనేక పెద్ద
రాష్ట్రాల్లో, 2018-19లో ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులలో 20% కన్నా తక్కువ మంది షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
2011 నాటికి, భారత జనాభాలో ఎస్.సి.లు 16.6 శాతం ఉండగా, ఎస్టీలు 8.6 శాతం ఉన్నారు.
రిజర్వేషన్ కోటా ప్రభుత్వ
నిర్వహణ సంస్థలకు పూర్తిగా మరియు ప్రైవేటుగా నడుపుతున్న సంస్థలకు పరిమితంగా
వర్తిస్తుంది. 2006 లో అప్పటి యుపిఎ
ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు రిజర్వేషన్లను విస్తరించడానికి మార్గం సుగమం చేసింది, కాని ఇంకా కేంద్ర చట్టం రాలేదు. చాలా సాంకేతిక విద్య
ప్రైవేట్ కళాశాలలు రాష్ట్ర చట్టాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాయి, అయితే ఇది సమగ్రమైనది కాదు.
చాలా రాష్ట్రాలలో ఎన్రోల్ అయిన విద్యార్థులలో కనీసం 22.5% మంది ఎస్సీ లేదా ఎస్టీ విద్యార్ధులు ఉండుట లేదు.
2018-19లో అండర్ గ్రాడ్యుయేట్
మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ నమోదులో కేవలం 11% దళిత విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారు పీహెచ్‌డీ విద్యార్థులలో 10% లోపు ఉన్నారు, కాని ఎం.ఫిల్ లో 16% ఉన్నారు,. నాన్-డిగ్రీ సర్టిఫికేట్
రంగం లో విషయానికి దళిత స్టూడెంట్స్ 14% డిప్లొమా-హోల్డర్లు మరియు 13% సర్టిఫికేట్-హోల్డర్లు ఉన్న్నారు..
దేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలలో (నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్
ఫ్రేమ్‌వర్క్ ప్రకారం), కేవలం మూడు మాత్రం 22.5% ఎక్కువ ఎస్సీ / ఎస్టీ విద్యార్థులను కలిగి ఉన్నాయి.
మరో మూడు సగానికి పైగా బాలికలు ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)
ఈ రెండు అంశాలలోనూ బాగానే ఉంది.
21 ఇండియన్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీలో(IITలలో), 2018-19లో చేరిన విద్యార్థులలో 19% లోపు ఎస్సీ లేదా ఎస్టీలు మరియు ఇంకా తక్కువ సంఖ్యలో
స్త్రీలు ఉన్నారు.
ఐఐటిల నుండి
డ్రాప్-అవుట్ రేటు ఎస్సీ విద్యార్థులలో, ఫార్వర్డ్ కుల విద్యార్థుల కంటే కొంచెం
ఎక్కువగా ఉందని పబ్లిక్ డేటా జర్నలిజం పోర్టల్ ఫాక్ట్లీ కనుగొంది.
ఐఐటిలలోని దళిత
విద్యార్థులు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నట్లు మరియు వారి OCసహచర
విద్యార్ధుల కంటే పూర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్
కలిగిఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ప్రియాంక పాండే మరియు సామాజిక కార్యకర్త
సందీప్ పాండే కనుగొన్నారు.
ప్రతిష్టాత్మక ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో భిన్నంగా లేదు. 19 ఐఐఎంలలో, 16% మంది విద్యార్థులు ఎస్సీ లేదా ఎస్టీలు, మరియు పావువంతు(25%) స్త్రీలు.
ఆరు ఆల్ ఇండియా
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో, కేవలం 20% లోపు విద్యార్థులు
ఎస్సీ లేదా ఎస్టీ, మరియు 2018-19లో చేరిన విద్యార్థులలో సగం మంది(50%) మహిళలు.
చారిత్రాత్మకంగా
అట్టడుగున ఉన్న కులాలకు విద్య అందుబాటులో ఉండటం (access) చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది వారి వారి ఉద్యోగ అవకాశాలను మేరుగుపరుస్తుంది
మరియు సామాజిక-ఆర్ధిక నిచ్చెన పైకి ఎక్కడానికి వారికి అవకాశం ఇస్తుంది.
AISHE డేటా యువతులు అధ్యయనం
చేయడానికి ఏమి ఎంచుకుంటున్నారనే దానిపై కొంత అవగాహన కల్పిస్తుంది మరియు వారు
వేగంతో ఉన్నత విద్యలో ప్రధాన అడ్డంకులను అధిగమిస్తున్నారని సూచిస్తుంది.
గత రెండేళ్లుగా (2017-18 మరియు 2018-19), ఉన్నత విద్యలో మొత్తం మగ విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ స్త్రీ విద్యార్ధుల సంఖ్య కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, విజ్ఞాన శాస్త్రాలలో(సైన్స్)
ఉన్నత విద్యలో చేరే మహిళా విద్యార్థుల సంఖ్య మగ విద్యార్థుల సంఖ్యను మించిపోయింది.
విజ్ఞాన శాస్త్రంలో
స్త్రీ నమోదు అన్ని స్థాయిలలో పెరుగుతోంది
సైన్స్ యొక్క చాలా
ప్రవాహాలలో (streams of science) ఇప్పుడు పురుషుల కంటే ఎక్కువ మంది మహిళా విద్యార్థులు ఉన్నారు
ప్రాథమిక అండర్ గ్రాడ్యుయేట్
డిగ్రీలలో చేరే బాలికల సంఖ్య - బిఎస్సి మరియు బికామ్ – లో ఇంకా పెరుగుతున్నది
మరియు ఈ వర్గాలలోని అబ్బాయిల సంఖ్య తగ్గుతోంది.
బాలురు మరియు బాలికలు ఇద్దరికీ
బిఎ డిగ్రీలలో నమోదు పడిపోయింది.
మెకానికల్ మరియు సివిల్
ఇంజనీరింగ్ - పురుషుల నమోదు కూడా పడిపోతోంది. మేనేజ్‌మెంట్ కోర్సులు, టీచింగ్ కోర్సులు మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో
నమోదు పెరుగుతోంది.
బోధన మరియు కంప్యూటర్ డిగ్రీలలో
యువతుల నమోదు క్రమంగా పెరుగుతోంది.
సహాయక నర్సింగ్‌లో (auxiliary nursing) నమోదు 99% స్త్రీలు,
హోటల్ మేనేజ్‌మెంట్ అండర్
గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్త్రీల నమోదు 80% కంటే ఎక్కువ ఉంది..
No comments:
Post a Comment