వృత్తి విద్యా కోర్సులు
పెరుగుతున్న నేటి యుగంలో ఇంటర్నషిప్‌ల ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్‌షిప్
అనేది ఒక సంస్థ యొక్క పనితీరు మరియు ప్రత్యేకమైన ప్రాంతంలో పని చేసే మార్గాలను
తెలుసుకునటానికి ఉపయోగపడే సాధారణ ఉద్యోగ
శిక్షణ కాలం అని చెప్ప వచ్చు ఇంటర్నషిప్‌లను
అందించే సంస్థలు చాలా ఉన్నవి.. కొన్ని
సంస్థలు ఇంటర్న్ షిప్ కాలం లో
వేతనం చేల్లిస్తాయి కొన్ని సంస్థలు చేల్లిoచవు. విద్యార్థులు తమ కోర్సుల ఆధారంగా
ఇంటర్నషిప్‌లను ఎంచుకుంటారు. ఇంటర్నషిప్‌లు మీకు ఆసక్తి ఉన్న ప్రాంతంలో నైపుణ్యాలు
మరియు పద్ధతులను నేర్చుకునే అవకాశంగా చూడాలి. ఇంటర్నషిప్ అనేది మీ పరిచయాలను పెంచి
మీ వృత్తిని బలోపేతం చేసే మార్గoగా
చూడాలి.
ఇంటర్నషిప్ యొక్క
ప్రాముఖ్యత మరియు అందలి ముఖ్యమైన అంశాలు.
1.వృత్తిపరమైన పని వాతావరణం:
1.వృత్తిపరమైన పని వాతావరణం:
ఇంటర్నషిప్ పూర్తిగా వృత్తిపరమైన పని వాతావరణాన్ని అందిస్తుంది. సంస్థ అనుసరించే
నీతి నియమావళిని అర్థం చేసుకోవడం సులభతరం చేస్తుంది.అక్కడి వాతావరణం మీ కాలేజి
మరియు యూనివేర్సిటిల అకాడెమిక్ వాతావరణo
కు బిన్నంగా పూర్తిగా వృత్తి పరమైన వాతావరణo కలిగి ఉంటుంది.
2.సాధన – పరిపూర్ణత:
కొందరు పెద్దలు
చెప్పినట్లు "ప్రాక్టీస్
మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది" క్రొత్తదాన్ని నేర్చుకోవటానికి మీరు ఎంత
ఎక్కువ ప్రయత్నిస్తారో అది అంత పరిపూర్ణత వైపు మిమ్మల్ని తీసుకు వెళ్తుంది. మీకు అవసరమైన అన్ని నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని
నేర్చుకునేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట పనిని ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు విజయవంతం అయ్యేవరకు
సహనంతో ఉండండి మరియు సాధన చేయండి.
3.ఆసక్తి ఉన్న
ప్రాంతాన్ని కనుగొనడంలో సహాయం పడుతుంది.
అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం, వారి ప్రతిభను మరియు ఆసక్తిని గుర్తించడంలో ఇంటర్నషిప్ కీలక
పాత్ర పోషిస్తుంది. ఒక నిర్దిష్ట విషయాన్ని చదవడం ద్వారా అది మీ ఆసక్తి ఉన్న
ప్రాంతం అవును కాదా అని మీరు నిర్ధారించలేరు? ఒక నిర్దిష్ట క్షేత్రం లేదా ప్రాంతం
యొక్క విభిన్న అంశాలను పని చేయడం మరియు అర్థం చేసుకోవడం లో మీ ఆసక్తి మరియు
ప్రతిభను అన్వేషించడంలో ఇంటర్న్ షిప్ మీకు సహాయపడుతుంది.
4.విశ్వాసం స్థాయిని పెంచుతుంది:
మీకు పని చేసే విధానం తెలిసినప్పుడు, మీ విశ్వాస స్థాయి ఆటోమాటిక్ గా పెరుగుతుంది.
మీరు మంచి పనితీరు కనబరిచినప్పుడు ఇది మీలో సానుకూల వైఖరిని పెంచుతుంది మరియు మీ
విశ్వాసాన్ని బాగా పెంచడానికి మిమ్మల్ని ప్రేరేస్తుంది.
5.అనుభవం:
ఎల్లప్పుడూ మరింత ఎక్కువ తెలుసుకోవడానికి
ప్రయత్నించండి మరియు సాధ్యమైనంత ఎక్కువ అనుభవాన్ని పొందండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే
ప్రతి క్రొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు భవిష్యత్తులో ఏవైనా
ఇబ్బందులు ఏర్పడితే పరిష్కరించడానికి
మరియు మీ పనిని సులభతరం చేయడానికి అనుభవాలు మీకు సహాయపడతాయి. ఇంటర్నషిప్‌లు
క్రొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తాయి.
6.నెట్‌వర్క్ పెంచుకోండి::
పరిచయాలు మరియు బలమైన మానవ సంబంధాలను
నిర్మించడం లో ఇంటర్నషిప్ తోడ్పడుతుంది మరియు అది వృత్తి-మీ మధ్య
అంతరాన్ని పూరించగలదు. మీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగిఉండం ఏ సంస్థలోనైనా
ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటర్నషిప్ పూర్తయిన తర్వాత కూడా మంచి నెట్‌వర్కింగ్
మరియు మంచి రిలేషన్ షిప్స్ మీకు పనిలో సహాయపడుతాయి.
7.కెరీర్ అవకాశాలు:
మీ ఇంటర్నషిప్ సమయంలో
నేర్చుకోవటానికి మీరు ఆసక్తి మరియు
ఉత్సుకత తో పనిచేయడం వలన సంస్థలో ఉద్యోగిగా మీరు విస్తృత కెరియర్ అవకాశాలను పొందగలరు.
8.
మంచి అభిప్రాయం కల రేజ్యుం
:
ఉద్యోగం పొందడానికి, బలమైన రేజ్యుం తోడ్పడుతుంది.
అది మిమ్మల్ని భిన్నమైన
మరియు ఉత్తమమైన వారుగా ప్రకటిస్తుంది. మంచి పేరున్న ప్రఖ్యాత సంస్థ నుండి మీ పని పై మంచి
అభిప్రాయం బలమైన రేజ్యుం నిర్మాణం కు తోడ్పడుతుంది మరియు అది మీ ఎంపిక యొక్క
అవకాశాలను పెంచుతుంది.
No comments:
Post a Comment