సయ్యిదా అల్
హుర్రా సుమారు 1485 మరియు 1495
(హిజ్రీ సుమారు 890) లేదా
సరిగ్గా 1491లో అండలూసియన్(స్పెయిన్) ప్రభువులకు చెందిన ఒక
ప్రముఖ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఫెర్డినాండ్ మరియు ఇసాబెల్లా 1492లో గ్రనాడాలోని ముస్లిం రాజ్యాన్ని జయించినప్పుడు సయ్యిదా
అల్ హుర్రా తన కుటుంబంతో కలిసి స్పెయిన్ నుండి మొరాకోకు పారిపోయి చెఫ్చౌయెన్‌లో
స్థిరపడ్డారు. సయ్యిదా అల్ హుర్రా మొరాకన్ సూఫీ సెయింట్ అబ్ద్ అస్-సలామ్ అల్-అలామి మరియు హసన్ ఇబ్న్ అలీ వంశస్థురాలు.
సయ్యిదా మొదటి
వివాహం మొరాకో లోని టెటౌవాన్ ప్రాంత గవర్నర్
తో జరిగింది. సయ్యిదా మొదటి భర్త టెటౌవాన్ గవర్నర్ మరణం తరువాత సయ్యిదా
అల్-హుర్రా టెటౌవాన్ ప్రాంతానికి గవర్నర్
అయింది. ఆతరువాత సయ్యిదా రెండోవ వివాహం మొరాకో సుల్తాన్ మరియు ఫెస్ పాలకుడు అహ్మద్
అల్-వత్తాసీ తో జరిగి సయ్యిదా మొరాకో రాణి అయ్యింది.
తన చిన్ననాటి మాతృభూమి ని ఫెర్డినాండ్ మరియు
ఇసాబెల్లా స్వాధీనం చేసుకోవడంపై పగ పెంచుకొని దానిని పట్టుకుని, చాలా అవమానంగా భావించి, సయ్యిదా ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం
కోసం వేచి చూస్తుంది. సయ్యిదా అల్-హుర్రా సమీపంలోని సముద్రాలపై నియంత్రణను
స్వాధీనం చేసుకోవడానికి ఆక్కడి సముద్రపు
దొంగలు-బార్బరీ కోర్సెయిర్‌లు మరియు ఒట్టోమన్ అడ్మిరల్ బార్బరోస్సాను పొత్తు
పెట్టుకోవడానికి సంప్రదించింది. బార్బరీ
కోర్సెయిర్‌లు 15వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంతో
జతకట్టి ప్రధానంగా క్రైస్తవ నౌకలను దోచుకోనేవారు. నౌకలో ఉన్నవారిని దోచుకోవడం
మరియు ఓడ లో ఉన్నవారిని బానిసలుగా మార్చడం చేసేవారు
16వ శతాబ్దం ప్రారంభంలో కోర్సెయిర్స్
మరియు ఒట్టోమన్ల పాలనలో సయ్యిదా మరియు ఆమె ప్రైవేట్‌లు పశ్చిమ మధ్యధరా ప్రాంతాన్ని
స్వాధీనం చేసుకున్నారు.
పాశ్చాత్య రచయితల ప్రకారం బార్బరీ కోర్సెయిర్‌లు
బార్బరీ తీరంలో యూరోపియన్ నౌకలపై దాడి చేసి వాటిలోని నిధిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకొనేవారు, వారు
ప్రధానంగా క్రైస్తవులను బానిసలుగా మార్చేవారు.
కొందరు పాశ్చాత్య రచయితలు బార్బరీ
కోర్సెయిర్‌ల మిత్రురాలు సయ్యిదా ను సముద్రపు దొంగల రాణి అని పిలిచేవారు.
సమకాలీన యూరోపియన్ చరిత్రకారులు సయ్యిదా కు పాలించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు,
యూరోపియన్ వలసవాదానికి వ్యతిరేకంగా మొరాకో
ముస్లింలు ఏకం కావడానికి సహాయం చేసిన కూటమికి సయ్యిదా నాయకత్వం వహించారు మరియు బార్బరీ సముద్రపు దొంగలు మూడు శతాబ్దాల
పాటు మధ్యధరా ప్రాంతాన్ని పాలించారు.
యూరోపియన్లు సయ్యిదా ను, బార్బరీ సముద్రపు
దొంగలను, మరియు ఒట్టోమన్ నావికులను దొంగలు మరియు హంతకులుగా భావించారు. కాని ఇస్లామిక్ మరియు మిడిల్ ఈస్టర్న్
చరిత్రలో నిపుణుడు టామ్ వెర్డే వారిని " మగ్రెబ్‌పై దాడి చేసి ఆధిపత్యం
చెలాయించే యూరోపియన్ ప్రయత్నాలను వ్యతిరేకించి ముందు వరుసలో నిలిచిన స్వాతంత్ర్య
పోరాట దేశభక్తులుగా పేర్కొన్నాడు.”
మెర్నిస్సీ అనే చరిత్రకారుని ప్రకారం సయ్యిదా "పశ్చిమ మధ్యధరా సముద్రపు దొంగల
తిరుగులేని నాయకురాలు ". కానీ, సయ్యిదా ఆగ్రహావేశాలు మరియు మొండితనం తమ వ్యాపారాన్ని
ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని ఆ ప్రాంత వ్యాపారుల నుండి వచ్చిన ఫిర్యాదుల
తర్వాత 1542లో సయ్యిదా పై ఆమె అల్లుడు తిరుగుబాటు చేసాడు. సయ్యిదా
పాలన ముగిసింది.
అక్కడ నుండి, సయ్యిదా తన స్వస్థలమైన చెఫ్‌చౌయెన్‌కి తిరిగి వచ్చాడు, టామ్ వెర్డే ప్రకారం "అక్కడ సయ్యదా తన చివరి రోజులను ప్రశాంతంగా
గడిపింది మరియు 1561లో మరణించింది". సయ్యిదా "అల్-హుర్రా"
అనగా "సార్వభౌమాధికారి." అనే
బిరుదును కలిగి ఉన్న చివరి ఇస్లామిక్ మహిళా పాలకురాలిగా చెప్పబడింది.
No comments:
Post a Comment