31 October 2022

యెమెన్‌ రాణి సయ్యిదా హుర్రా అర్వా అల్-సులేహి (1067–1138) “ది లిటిల్ క్వీన్ ఆఫ్ షెబా” The Queen of Yemen(1067–1138) Sayyida Hurra Arwa al-Sulayhi: “The Little Queen of Sheba”

 



సంక్షిప్తంగా:

సయ్యదా హుర్రా అర్వా ఆఫ్ యెమెన్: "ది లిటిల్ క్వీన్ ఆఫ్ షెబా"

యెమెన్‌లోని ఇస్మాయిలీ సులేహిద్ రాజవంశం (పదకొండవ-పన్నెండవ శతాబ్దం) సభ్యురాలు  సయ్యిదా హుర్రా క్వీన్ అర్వా ఒక ప్రత్యేకమైన ముస్లిం మహిళా నాయకురాలు: క్వీన్ అర్వా రాజకీయ మరియు ఆధ్యాత్మిక అధికారాలను ఏకకాలంలో కలిగి ఉంది. క్వీన్ అర్వా మొదట తన భర్త సహకారంతో రాణి గా, తర్వాత తన కుమారునికి రాజప్రతినిధిగా, చివరకు 1138లో మరణించే వరకు స్వంత సార్వభౌమాధికారురాలిగా యెమెన్‌ను పరిపాలించింది.

కైరో లోని ఫాతిమిద్ ఖలీఫా తో సమన్వయము కలిగి క్వీన్ అర్వా యెమెన్‌లో పరిపాలనా స్వాతంత్ర్యం మరియు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. క్వీన్ అర్వా యెమెన్ లో తయ్యిబి ఇస్మాయిలీ సంఘం స్థాపించింది.

క్వీన్ అర్వా తన ప్రజలకు న్యాయం మరియు స్థిరత్వాన్ని అందజేస్తూ, శక్తివంతమైన మరియు పోటీతత్వం గల యెమెన్ గిరిజన నాయకులను అదుపులో ఉంచుకోగలిగింది. ఇమామ్-ఖలీఫ్ అల్-ముస్తాన్సీర్ అర్వా రాణిని మత నాయకుడిగా, హుజ్జాగా ఉన్నతీకరించారు. అర్వా రాణి సార్వభౌమాధికారం కింద యెమెన్ అభివృద్దిని సాధించినది మరియు క్వీన్  అర్వా "అపారమైన ప్రజాదరణ పొందింది".


 విస్తారం గా:

 "నిరాశ చెందకు, నీ శత్రువుకు తెలిస్తే  సంతోషించును." యెమెన్ సామెత

చరిత్రలో, మహిళలు అధికారంలో ఉన్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో మహిళలకు అధికారం వారసత్వంగా లేదా  అనుభవం కారణంగా వచ్చును. యెమెన్ చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన అర్వా అల్-సులేహి యెమెన్ యొక్క ఏకైక పాలకురాలుగా నియమించబడటానికి వారసత్వం లేదా  అనుభవం రెండూ  కారణాలే. అర్వా అల్-సులేహి పాలనకు ముందు యెమెన్ చరిత్ర గందరగోళం మరియు అశాంతి లో ఉంది. అర్వా అల్-సులేహి రాజవంశం క్రింద యెమెన్ శాంతి మరియు సొభాగ్యంతో ఉంది.

1047లో అలీ ఇబ్న్ ముహమ్మద్ అల్-సులేహిచే స్థాపించబడిన అరబ్ రాజవంశం సులేహిద్ రాజవంశము. చారిత్రాత్మకమైన యెమెన్‌లో అత్యధిక భాగాన్ని సులేహిద్ రాజవంశము పాలించింది. సులేహిద్ రాజవంశం యెమెన్‌కు శాంతిని మరియు సౌభాగ్యాన్ని తెచ్చింది.

సులేహిద్‌లు. బను సలౌహ్ Banu Salouh యొక్క అరబ్ యెమెన్ తెగకు చెందినవారు, సులేహిద్‌లు, అల్-హజూర్ తెగ, వారి నుండి హషీద్ తెగ, వారి నుండి హమ్దానిద్‌ తెగ నుండి వచ్చారు.

ఫాతిమిడ్ కాలిఫేట్ స్థాపించబడటానికి ముప్పై సంవత్సరాల ముందు యెమెన్‌లో మత ప్రచారకుల ద్వారా సులేహిద్‌ రాజవంశం యొక్క పెరుగుదల ప్రారంభించబడింది.. సున్నీ బను సలౌహ్ అరబ్ యెమెన్ తెగ నాయకుని కుమారుడు అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి, ఫాతిమిడ్స్‌తో కలిసిపోయాడు.

1046లో, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి ఖలీఫాగా నియమించబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి హరాజ్‌ Haraz ప్రాంతం లో సాయుధ బలగాలను సేకరించి సులైహిద్ రాజవంశాన్ని స్థాపించాడు. తరువాతి సంవత్సరాల్లో, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి పాలన క్రిందకు యెమెన్ మొత్తo వచ్చింది.

1060లో తిహామాన్ లోతట్టులోని నజాహిద్‌ల పాలకుడు విషప్రయోగం చేయబడ్డాడు మరియు అతని రాజధాని జాబిద్‌ను సులేహిద్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొదటి సులేహిద్ పాలకుడు 1062లో మొత్తం యెమెన్‌ను జయించాడు మరియు హెజాజ్‌ Hejaz ను ఆక్రమించడానికి ఉత్తరం వైపు వెళ్లాడు. కొంత కాలానికి, సులేహిద్‌లు మక్కా అమీర్‌లను కుడా  నియమించారు.

జైదియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని విజయవంతంగా ముగించిన తర్వాత 1063 నుండి అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి,  సనాను కూడా జయించాడు.అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి రాజ్యానికి రాజధానిగా సనా చేయబడింది.

అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి మరణించిన తరువాత, అతని కుమారుడు అల్-ముకర్రమ్ అహ్మద్ సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రారంభం లో అల్-ముకర్రమ్ అహ్మద్ పాలన సంతృప్తికరంగా లేదు మరియు సులేహిద్‌లచే నియంత్రించబడిన ప్రాంతం తీవ్రంగా తగ్గిపోయింది.  సనా ప్రాంతానికి పరిమితమైనది.

కొన్ని సంవత్సరాల తర్వాత, అల్-ముకర్రమ్ అహ్మద్,  నజాహిద్‌లచే బంధించబడిన తన తల్లి అస్మా బింట్ షిహాబ్‌ను రక్షించి, సులేహిద్ సైన్యాలు పోగొట్టుకొన్న  చాలా భూభాగాన్ని తిరిగి పొందాయి. తిహామాలో నజాహిద్‌లు తన అధికారానికి దూరంగా ఉండకుండా అల్-ముకర్రమ్ అహ్మద్ నిరోధించలేకపోయాడు అయితే సులేహిద్‌లు యెమెన్‌లో అత్యంత శక్తివంతమైన పాలకులు గా మిగిలిపోయారు.

ఏడెన్‌లో, మరొక రాజవంశం అయిన జురాయిద్‌లు 1083లో అధికారంలోకి వచ్చారు. అల్-ముకర్రమ్ అహ్మద్ పాలన 1086లో ముగిసింది మరియు  ముకర్రమ్ అహ్మద్ భార్య రాణి అర్వా పాలన ప్రారంభం అయినది. అర్వా రాణి పరిపాలన ప్రారంభ సంవత్సరాలలో ముకర్రమ్ అహ్మద్ వెనుక నుండి కొంత ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. ముకర్రమ్ అహ్మద్ 1091లో అష్యా కోటలో మరణించాడు. 

క్వీన్ అర్వా:

సులేహిద్ రాజవంశం యొక్క పాలకులలో క్వీన్ అర్వా చివరిది. క్వీన్ అర్వా ను “అల్-మాలికా అల్-హుర్రా” అని పిలుస్తారు. మహిళా సార్వభౌమాధికారిగా, అర్వాకు యెమన్  చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది: అంతర్జాతీయ ముస్లిం ప్రపంచంలో మహిళా చక్రవర్తులు ఉన్నప్పటికీ, ముస్లిం అరబ్ ప్రపంచంలో ఏకైక మహిళా చక్రవర్తులు అర్వా మరియు అస్మా, రాచరిక హోదా, మసీదులలో వారి పేరు తో  ఖుత్బా ప్రకటించబడింది. అర్వా  అనేక మసీదులను స్థాపించింది, వాటిలో ప్రముఖమైనది క్వీన్ అర్వా మసీదు.

అర్వా హరాజ్‌లో జన్మించినది. అర్వా అప్పటి యెమెన్ పాలకుడు అలీ అల్-సులైహికి మేనకోడలు. చిన్న వయస్సులోనే అనాథ అయిన అర్వా సనాలోని రాచరిక ప్యాలెస్‌లో అత్త,  అస్మా బింట్ షిహాబ్, ఆధ్వర్యంలో పెరిగారు,

1066లో, 17 సంవత్సరాల వయస్సులో, అర్వా తన బంధువైన అహ్మద్ అల్-ముకర్రం బిన్ అలీ బిన్ ముహమ్మద్ అల్ సులైహిని ఏడెన్ నగరాన్ని మహర్‌గా పొంది వివాహం చేసుకుంది మరియు రాజమాత అస్మా,  అర్వా అత్తగా మారింది.

అలీ అల్-సులైహి మరణం తర్వాత అర్వా తన అత్తగారు అస్మా మరియు తన భర్త అల్-ముకర్రమ్ అహ్మద్ కు పాలన లో సహాయం చేసింది. అర్వా, ధైర్యవంతురాలు, దార్మికురాలు, స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉండేదని చరిత్రకారులు చెబుతారు.

అర్వా గొప్ప జ్ఞాపకశక్తిని కలిగి పద్యాలు, కథలు మరియు చారిత్రక సంఘటనల వివరాలను బాగా నేర్చుకుంది. దివ్య  ఖురాన్ మరియు హదీసు శాస్త్రాలలో అర్వాకు చాలా అవగాహన ఉంది. అరబ్ చరిత్రకారులు అర్వాను చాలా అందమైనదని  పేర్కొన్నారు.

సయ్యద్ అలీ అల్-సులైహి మరణం తరువాత, అర్వా భర్త అల్-ముకర్రమ్ అహ్మద్ యెమెన్‌కు పాలకుడు అయ్యాడు, కానీ పక్షవాతం కు గురి అయి  మంచాన పడి పాలించలేకపోయాడు. అల్-ముకర్రమ్ అహ్మద్ తన పాలన అధికారాన్ని అర్వాకు ఇచ్చాడు మరియు ఖుత్బాలో అర్వా పేరు, ఫాతిమిడ్ ఖలీఫ్ అల్-ముస్తాన్సీర్ బిల్లా పేరు తరువాత ప్రస్తావించబడినది.

అర్వా అత్తగారు రాజమాత అస్మా బింట్ షిహాబ్ చనిపోయేవరకు  అర్వా, అస్మా బింట్ షిహాబ్  తో బాటు కో-రెజెంట్‌గా పరిపాలించింది. రాజ్య పాలన లో అస్మా బింట్ షిహాబ్  కు బిన్నంగా అర్వా ప్రవర్తిoచినట్లు బహిర్గతం కాలేదు.

జబిద్‌లోని నజాహిద్ పాలకుడు సైద్ ఇబ్న్ నజర్‌ను ఎదుర్కోవడానికి సనా నుండి జిబ్లాకు రాజధానిని మార్చడం రాణి  అర్వా మొదటి చర్యల్లో ఒకటి. అర్వా జిబ్లా వద్ద ఒక కొత్త రాజభవనాన్ని నిర్మించింది మరియు పాత ప్యాలెస్‌ను గొప్ప మసీదుగా మార్చింది, అక్కడ అర్వా చివరికి ఖననం చేయబడింది.

అహ్మద్ అల్-ముకర్రమ్ మరణం తర్వాత, సయ్యదా అర్వాను సబా ఇబ్న్ అహ్మద్‌ను వివాహం చేసుకోoది. అధికారంలో ఉండటానికి అర్వా అయిష్టంగానే ఇలా చేసింది. సబా చనిపోయే వరకు అర్వా, సబా తో కలసి  యెమెన్‌ను పాలించింది. అప్పటి నుండి అర్వా ఒంటరిగా పరిపాలించింది

 సనాలో, అర్వా గ్రాండ్ మసీదును విస్తరించింది మరియు నగరం నుండి సమర్రాకు రహదారి మెరుగుపడింది. జిబ్లాలో, క్వీన్ అర్వా కొత్త ప్యాలెస్ భవనం మరియు పేరుగల క్వీన్ అర్వా మసీదును నిర్మించింది. క్వీన్ అర్వా తన రాజ్యం అంతటా అనేక పాఠశాలలను నిర్మించి ప్రసిద్ది చెందింది. ఆర్వా వ్యవసాయo పట్ల  ఆసక్తి చూపుతూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచారు.

1138లో అర్వా మరణించినది  జి జిబ్లా వద్ద అర్వా నిర్మించిన మసీదు వద్ద  ఖననం చేయబడినది. అర్వా పాలన ప్రజల పట్ల శ్రద్ధ మరియు కరుణను చూపించే ఒక ఉదాహరణగా నిలిచింది.

 

No comments:

Post a Comment