నఫ్జావా బెర్బర్ తెగ కు
చెందిన జైనాబ్ ఉత్తర ఆఫ్రికాలో ప్రారంభ అల్మోరావిడ్ రాజ్య స్థాపన మరియు విస్తరణలో
ప్రత్యక్షంగా పాల్గొన్నది. వారసత్వం మరియు స్వంత విజయవంతమైన వ్యాపార సంస్థల
ఫలితంగా జైనాబ్ 11వ శతాబ్దపు
మాగ్రిబ్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు గా పరిగణించబడినది.
14వ శతాబ్దపు "అల్-బయాన్ అల్-మగ్రెబ్," రచన ప్రకారం జైనాబ్, మొత్తం మగ్రెబ్‌ను
పాలించగల వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటానని పేర్కొంటూ, మొదట్లో అబూ బకర్‌ను
వివాహం చేసుకుంది. అబూ బకర్ మర్రకేచ్ నగరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. కొంతకాలానికి
జైనాబ్ తన మొదటి భర్త అబూ బకర్‌కు విడాకులు ఇచ్చి యూసుఫ్ ఇబ్న్ తషుఫిన్ ను వివాహం
చేసుకుంది. జైనాబ్ తీసుకువచ్చిన సంపద, సంబంధాలు మరియు మంచి సలహా కారణంగా జైనాబ్ భర్త యూసుఫ్ ఇబ్న్ తషుఫిన్ పెద్ద బెర్బర్
సామ్రాజ్యాన్ని రూపొందించగలిగాడు.
జైనాబ్ తన భర్త యూసుఫ్
ఇబ్న్ తషుఫిన్‌తో యొక్క ప్రధాన రాజకీయ సలహాదారుగా పనిచేసింది మరియు యూసుఫ్ ను మొరాకోలోని
అల్మోరావిడ్స్‌కు ఏకైక పాలకుడిగా ప్రకటించుకోమని ప్రోత్సహించింది.
జైనాబ్ సంపద, దౌత్య నైపుణ్యాలు, గిరిజన సంబంధాలు
మరియు రాజకీయ చతురత అల్మోరావిడ్ సామ్రాజ్య స్థాపన మరియు విస్తరణకు బాగా
దోహదపడ్డాయి. అల్మోరావిడ్స్ రాజధాని ప్రారంభంలో అగ్మత్‌లో ఉన్నప్పటికీ, కొత్తగా నిర్మించిన
మర్రకేష్ నగరాన్ని అల్మోరావిడ్ రాజ్యం యొక్క సామ్రాజ్య రాజధానిగా మార్చడానికి జైనాబ్
దోహదపడింది.
చాలా మంది మధ్యయుగ
చరిత్రకారులు, ముఖ్యంగా ఇబ్న్
అల్-అథీర్, ఇబ్న్ అబీ జార్ మరియు
ఇబ్న్ ఖల్డూన్ జైనాబ్‌ను అత్యంత తెలివైన, అందమైన మహిళ అని ప్రశంసించారు. జైనాబ్ అల్మోరావిడ్
రాజకీయాల్లో ప్రభావంతమైన పాత్రను పోషించిందని నొక్కిచెప్పారు, " అందం మరియు రాజకీయ
నాయకత్వం (రియాసా) రెండింటికీ ప్రసిద్ధి చెందిన మహిళల్లో జైనాబ్ ఒకరు" అని
ఇబ్న్ ఖల్దూన్ పేర్కొన్నారు.
జైనాబ్ అసమానమైన రాజకీయ, పరిపాలనా మరియు
దౌత్య నైపుణ్యాలను చూసి జైనాబ్‌ను కొన్నిసార్లు "ది ఎంచాన్ట్రెస్"
(అల్-సాహిరా“The
Enchantress” (al-sāḥira)) అనే పేరుతో
పిలుస్తారు. యూసుఫ్ ఇబ్న్ తాషుఫిన్ పై జైనాబ్ అత్యంత రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉంది.
1086లో, యూసుఫ్ స్పెయిన్‌పై
దాడి చేసి, ఆ ప్రాంతంలో
ఇస్లామిక్ ప్రాధాన్యతను తిరిగి స్థాపించాడు. జైనాబ్ అల్-నఫ్జావియా, తన భర్త యూసుఫ్
ఇబ్న్ తషుఫిన్‌తో కలిసి అల్మోరావిడ్ రాజ్యాన్ని పాలించింది. వారి సామ్రాజ్యం
ప్రభావం స్పెయిన్ నుండి మరియు ఉత్తర ఆఫ్రికా అంతటా వ్యాపించింది.
జైనాబ్ మాలికా లేదా రాణి అనే బిరుదు ను కలిగిన అత్యంత ప్రసిద్ధ బెర్బర్ రాణి. ఆ కాలపు ఆధారాలను బట్టి జైనాబ్ తన భర్త
రాజ్యాన్ని నిజంగా పాలించిన వ్యక్తిగా పేర్కొంటున్నాయి.
14వ శతాబ్దపు మరో గ్రంథం, "రౌద్ అల్-కిర్తాస్" యూసుఫ్ మగ్రెబ్‌ను
జయించాడని మరియు జైనాబ్ చర్చలు నిర్వహించింది అని పేర్కొంది. మధ్యవర్తిత్వంలో ఆమె
నైపుణ్యం ఆమెకు "ది మెజీషియన్" అనే మారుపేరును తెచ్చిపెట్టింది.
జైనాబ్ 1075లో
మరణించారు, ఆ సమయంలో అల్మోరావిడ్‌లు- జైనాబ్ ప్రయత్నాల
కారణంగా-వాయువ్య ఆఫ్రికాలో చాలా వరకు తమ అధికారాన్ని స్థాపించడంలో విజయం
సాధించారు. ఆల్మోరావిడ్ చరిత్రలో, రాజ
స్త్రీలు జైనాబ్ సంప్రదాయాన్ని అనుసరిoఛి సామ్రాజ్య మరియు స్థానిక రాజకీయాల్లో ముఖ్యమైన
పాత్ర పోషిస్తూ ఉంటారు
జైనాబ్ గురించి మరింత
తెలుసుకోవడానికి, చూడండి
·
H. T. నోరిస్ మరియు
పెడ్రో చల్మెటా,
"అల్-మురాబిటున్." ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, రెండవ ఎడిషన్.
ఎడిట్ చేసినవారు: P. బేర్‌మాన్, Th. బియాంక్విస్, C.E. బోస్‌వర్త్, E. వాన్ డోంజెల్, W.P. హెన్రిచ్స్. బ్రిల్
ఆన్‌లైన్
· మైఖేల్ బ్రెట్
మరియు ఎలిజబెత్ ఫెంట్రెస్, ది బెర్బర్స్ (1996)
· రోనాల్డ్ ఎ.
మెస్సియర్, ది అల్మోరావిడ్స్ అండ్ ది మీనింగ్ ఆఫ్
జిహాద్ (2010
నోట్:
మాగ్రెబ్ని వాయువ్య ఆఫ్రికా అని కూడా పిలుస్తారు.ఇది ఉత్తర
ఆఫ్రికా మరియు అరబ్ ప్రపంచం యొక్క పశ్చిమ భాగం. ఈ ప్రాంతంలో అల్జీరియా, లిబియా,
మౌరిటానియా, మొరాకో మరియు ట్యునీషియా ఉన్నాయి.
No comments:
Post a Comment