9 November 2022

అబు దావుద్ అల్-సిఘిస్తానీ హదీత్ పండితుడు 817–889 .Abu Dawud al-Sijistani Hadith Scholar 817–889



 




చాలా మంది పండితులు హదీసుల సేకరణలను రూపొందించారు. హదీసుల సేకరణలో  “అల్-కుతుబ్ అల్-సిత్తా” ("ఆరు పుస్తకాలు") అని పిలువబడే ఆరు సేకరణలు-అల్-బుఖారీ, ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్, అబు దాూద్, అల్-తిర్మిదీ, ఇబ్న్ మాజా, మరియు అల్-నసాసీ చే సoకలన పరచబడినవి. అల్-బుఖారీ మరియు ముస్లిం పుస్తకాలు మిగతా వాటికన్నా ఎక్కువ  ప్రజామోదం పొందినవి.

అబూ దావుద్ సులైమాన్ ఇబ్న్ అల్-అషత్ ఇబ్న్ ఇస్సాఖ్ అల్-అజ్దీ అల్-సిజిస్తానీ (అరబిక్: أبو داود سليمان بن الأشعث الأي الأبو داود سليمان بن الأشعث الأي الأبو داود سليمان بن الأشعث الأأي الأبود الأشعث الأأي الأبود الأشعث الأأي الأبو داود) సున్నీ ముస్లింలచే గుర్తించబడిన ఆరు హదీసు సేకరణ (ముహద్దీత్) లో మూడవది గా గుర్తించబడిన “సునన్ అబూ దావుద్” సేకరణ కర్త.  అబూ దావుద్ అరబ్ సంతతికి చెందిన పర్షియన్.

 అబూ దావుద్  సిస్తాన్‌లో 817 అబ్బాసిడ్ ఖలిఫాట్ సమయంలో జన్మించాడు మరియు 889లో బస్రాలో మరణించాడు.

అబూ దావుద్  ఇరాక్, ఈజిప్ట్, సిరియా, హిజాజ్, తిహామా, నిషాపూర్ మరియు మెర్వ్ వంటి ప్రదేశాలలో పర్యటించాడు మరియు  అక్కడి పండితుల నుండి హదీత్ (సంప్రదాయాలు) సేకరిoచాడు. అబూ దావుద్ హదీసుల సేకరణ అతనికి హదీసులు మరియు ఫిఖ్ (చట్టం)పై ఉన్న ప్రత్యేక ఆసక్తి నుండి ఉద్భవించింది.అబూ దావుద్  సేకరణలో 4,800 హదీసులు ఉన్నాయి, అవి దాదాపు 500,000 హదీసుల నుండి ఎంపిక చేయబడినవి.

అబూ దావుద్ అల్-సిజిస్తానీ యొక్క “కితాబ్ అల్-సునన్” బహుశా 13వ శతాబ్దం నాటి అల్-అండలస్‌లో రాయబడింది.ఇమామ్ అబు దావూద్ హంబలి  అనుచరుడు అయినప్పటికీ కొందరు అతన్ని షఫీగా భావిస్తారు

అబూ దావూద్ స్వయంగా ఇలా పేర్కొన్నాడు: "నా పుస్తకం నుండి కేవలం నాలుగు హదీసులు తెలివైన వ్యక్తికి సరిపోతాయి.అవి:

పనులు ఉద్దేశాలను బట్టి మాత్రమే నిర్ణయించబడతాయి.

ఒక వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని పాటించడంలో ఒక భాగమేమిటంటే, వ్యక్తి తనకు సంబంధం లేని దానిని విడిచిపెట్టడం.

·         మీ కోసం మీరు ప్రేమించే దానిని మీ సోదరుని కోసం కూడా ప్రేమిస్తే తప్ప మీలో ఎవరూ విశ్వాసులు కాలేరు.

·         అనుమతించబడిన (హలాల్) స్పష్టంగా ఉంది మరియు నిషేధించబడినది (హరామ్) స్పష్టంగా ఉంది, ఈ రెండింటి మధ్య సందేహాస్పద విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఈ సందేహాస్పద విషయాలకు దూరంగా ఉంటారో వారు తన మతాన్ని కాపాడుకున్నట్లే."

అబూ దావూద్ ఇరవై ఒక్క రచనలలో ప్రధానమైనవి:

·       సునన్ అబూ దావుద్: 4,800 హదీసులను కలిగి ఉంది ఎక్కువగా సహీహ్ (ప్రామాణికమైనది), కొన్ని దైఫ్ ḍaʿif గా ప్రామాణీకరించబడలేదు),

·       కితాబ్ అల్-మరాసిల్, 600 సాహిహ్ ముర్సల్ హదీసులను కలిగి ఉంది.

·       రిసాలత్ అబూ దావుద్ ఇలా అహ్లీ మక్కా; తన సునన్ అబూ దావూద్‌ను వివరిస్తూ మక్కా ప్రజలకు రాసిన లేఖ.

·       కితాబ్ అల్-మసాహిఫ్- నాన్-ఉత్మానిక్ కాలం నాటి వివిధ వైవిధ్యాల  ఖురానుల  జాబితా.

·       మసైల్ అల్-ఇమామ్ అహ్మద్

·       అన్-నాసిఖ్ వాల్-మన్సుఖ్,

·       అల్-ఖదర్,  

·       అజ్-జుహ్ద్ మరియు అనేక ఇతర పుస్తకాలను రాశారు

ఇబ్న్ హజర్ తన "అస్-సునన్" పుస్తకంలో మరియు ఇతర పుస్తకాలలో అబూ దావుద్ యొక్క ఉపాద్యాయులు సుమారు 300 మంది ఉన్నారని నివేదించారు.

అబూ దావూద్ విద్యార్థులలో :1- అబూ ఈసా అత్-తిర్మిది,2- అబూ అబ్ద్-ఉర్-రెహ్మాన్ అన్-నసాయి,3-అబూ బకర్ ఇబ్న్ దావుద్ అల్-అస్ఫహానీ, 4- ముహమ్మద్ ఇబ్న్ నాసర్ అల్-మిర్వాజీ, 5- అబూ బకర్ యాహ్యా అస్-సులీ మరియు అనేక ఇతరులు.

అబూ దావూద్ మరణం:

అబూ దావూద్ 73 సంవత్సరాల వయస్సులో, ఇరాక్‌లోని బస్రాలో (889 CE)లో మరణించాడు.

అబూ దావూద్ గురించి పండితుల ప్రశంసలు:

·       అబూ బకర్ అల్-ఖల్లాల్ ఇలా చెప్పారు:"అబు దావూద్ తన కాలంలోని ఉన్నతమైన పండితుడు, (షరియా) శాస్త్రాల ధృవీకరణను గుర్తించడంలో మరియు వాటి ప్రశ్నలపై అవగాహనలో రాణించిన వ్యక్తి. అబూ దావూద్ అద్భుతమైన భక్తి గల వ్యక్తి.

·       మూసా ఇబ్న్ హరున్ అల్-హఫీజ్ చెప్పారు:అబూ దావూద్ ఈ జన్మలో హదీసు కోసం, పరలోకంలో స్వర్గం కోసం సృష్టించబడ్డాడు. అబూ దావూద్ కంటే గొప్ప వ్యక్తిని నేను చూడలేదు.

·       అబూ హతిమ్ ఇబ్న్ హయాన్ ఇలా అన్నాడు:అతను (అబూ దావూద్) ఫిఖ్, జ్ఞానం, కంఠస్థం, సన్యాసం, భక్తి మరియు ప్రావీణ్యం వంటి విషయాలలో ఈ ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

·       అల్-హకీమ్ చెప్పారు:"అబూ దావూద్ అతని కాలంలో హదీసు పండితులకు నాయకుడు అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు."

·       అద్-దహబి చెప్పారు: అబూ దావూద్ హదీసులు మరియు ఫిఖ్‌లలో అధిపతి. అబూ దావూద్, అహ్మద్ ఇబ్న్ హన్బాల్‌ను పోలి ఉండే విధంగా గౌరవం, నిజాయితీ మరియు భక్తి కలిగి ఉన్నాడు.

 

 

No comments:

Post a Comment