అబూ హనీఫా గా పిలువబడే అల్-నుమాన్ ఇబ్న్ థాబిత్ యొక్క జననం 699లో ఇరాక్ యొక్క మేధో కేంద్రమైన కూఫా, ఇరాక్ లో జరిగింది. అబూ హనీఫా అరబ్-యేతర ముస్లింలకు చెందిన
మావాలిmawālīకి చెందినవాడు. అబూ హనీఫా 767లో బాగ్దాద్లో మరణించారు. అబూ హనీఫా కూఫాలోని ఒక ప్రముఖ వ్యాపారి
కుమారుడు మరియు పట్టు వ్యాపారంలో బాగా సంపాదించాడు.
అబూ హనీఫా ముస్లిం న్యాయవేత్త మరియు వేదాంతవేత్త. ప్రారంభ యవ్వనంలో అబూ హనీఫా వేదాంత చర్చలకు ఆకర్షితుడయ్యాడు, కానీ తరువాత, వేదాంతశాస్త్రంతో విసుగు చెంది, అబూ హనీఫా చట్టం వైపు మళ్లాడు. అబూ హనీఫా ప్రముఖ ఇరాకీ న్యాయనిపుణుడు హమ్మద్ వద్ద 18సంవత్సరాల పాటు న్యాయశాస్త్రం అభ్యసించాడు. అబూ హనీఫా అనేక ఇతర పండితుల నుండి ముఖ్యంగా మక్కన్ సంప్రదాయవాది ʿఆతాAṭāʾ (మరణం 732) మరియు షియా స్కూల్ ఆఫ్ లా స్థాపకుడు జాఫర్ అల్-సాదిక్ (మరణం 765) వద్ద కూడా న్యాయశాస్త్రం నేర్చుకున్నాడు. హమ్మద్ మరణం తర్వాత (738) హమ్మద్ వారసుడిగా అబూ హనీఫా పేరుగాంచాడు. విస్తృతమైన ప్రయాణాలుమరియు ఇరాక్‌లోని భిన్నమైన, అభివృద్ధి చెందిన సమాజ ప్రభావంచే అబూ హనీఫా మేదస్సు పరిపక్వం చెందింది.
అబూ హనీఫా చట్టపరమైన సమస్యలకు ఇస్లామిక్ నిబంధనలను వర్తింపజేయడానికి చేసిన ప్రయత్నం ఫలితంగా అనేక చట్టపరమైన సిద్ధాంతాలు పేరుకుపోయాయి. ఈ చట్టపరమైన సిద్ధాంతాలలోని భిన్నాభిప్రాయాలను తొలగించి ఏకరీతి క్రోడికరణను ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అబూ హనీఫా తన విద్యార్థులు అయిన చాలా మంది అత్యుత్తమ విద్వాంసుల సహకారంతో ప్రస్తుత సిద్ధాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఏకరీతి క్రోడికరణను అభివృద్ధి చేసారు.
అబూ హనీఫా ఏదైనా
సిద్ధాంతాలను రూపొందించే ముందు ప్రతి చట్టపరమైన సమస్యను చర్చించేవాడు. అబూ హనీఫా
యొక్క కాలానికి ముందు, సిద్ధాంతాలు ప్రధానంగా వాస్తవ సమస్యలకు ప్రతిస్పందనగా
రూపొందించబడ్డాయి, అయితే అబూ హనీఫా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నించాడు. ఈ పద్ధతిని
ప్రవేశపెట్టడం ద్వారా, చట్టం యొక్క పరిధి గణనీయంగా విస్తరించబడింది.
చట్టం యొక్క హద్దులు విస్తరించడం వలన మరియు అబూ హనీఫా అనుసరించిన
హేతువాద ధోరణి వలన అబూ హనీఫా యొక హనఫీ న్యాయ
పాఠశాల(ఫికా) రేయ్ (స్వతంత్ర అభిప్రాయం) యొక్క న్యాయ పాఠశాల(ఫికా) అని పిలవబడినది.
ఊహాజనిత వేదాంతశాస్త్రం (కలాం) యొక్క న్యాయనిపుణుడు కావడంతో, అబూ హనీఫా చట్టపరమైన సిద్ధాంతాలలో క్రమబద్ధమైన అనుగుణ్యతను తీసుకువచ్చాడు. అబూ
హనీఫా న్యాయ సిద్ధాంతo క్రమబద్ధమైన పరిశీలనలకు ప్రాధాన్యత ఇస్తుంది. క్రమబద్ధమైన
మరియు సాంకేతిక చట్టపరమైన పరిగణనలకు అనుకూలంగా అబూ హనీఫా న్యాయ సిద్ధాంతo ఉంటుంది.
అబూ హనీఫా కు ఉన్న చట్టపరమైన చతురత మరియు న్యాయపరమైన కఠినత్వం వలన తన కాలం నాటి చట్టపరమైన ఆలోచన యొక్క అత్యున్నత స్థాయికి అబూ హనీఫా చేరుకున్నాడు. సమకాలీనులైన కుఫాన్ ఇబ్న్ అబీ లైలా (మరణం 765), సిరియన్ అవ్జాయీ (మరణం 774), మరియు మెడినీస్ మాలిక్ ఇబ్న్ అనాస్ (మరణం 795)తో పోలిస్తే, అబూ హనీఫా సిద్ధాంతాలు మరింత జాగ్రత్తగా క్రమబద్దంగా రూపొందించబడ్డాయి మరియు స్థిరంగా ఉన్నాయి. అబూ హనీఫా సాంకేతిక చట్టపరమైన ఆలోచన మరింత అభివృద్ధి చెంది పరిణతి చెందింది.
ఇస్లామిక్ చట్టం/ఫిఖ్- హనాఫీ
న్యాయ పాఠశాల(ఫికా):
అబూ హనీఫా మాతురిదియాMāturīdiyyah పాఠశాల అభివృద్ధిని
ప్రేరేపించాడు. అబూ హనీఫా ప్రధానంగా పండితుడు. అబూ హనీఫా న్యాయమూర్తి పదవిని అంగీకరించలేదు లేదా రాజకీయాల్లో
ప్రత్యక్షంగా పాల్గొనలేదు.
హనాఫీ న్యాయ పాఠశాల(ఫికా), ఇస్లాంలో మధబ్
హనీఫా అని కూడా పిలువబడుతుంది. ఇస్లామిక్ చట్టం (షరియా) యొక్క
నాలుగు న్యాయ పాఠశాల(ఫికా)ల్లో ఒకటిగా హనఫీ న్యాయ పాఠశాల(ఫికా) మారింది. వేదాంతవేత్త ఇమామ్ అబూ హనీఫా బోధనల నుండి హనాఫీ న్యాయ
పాఠశాల (మధబ్) అభివృద్ధి చెందింది, ఇమామ్ అబూ హనీఫా శిష్యులు అబూ యూసుఫ్ (మరణం 798) మరియు ముహమ్మద్ అల్-షైబానీ కాలం లో అబ్బాసిడ్స్ మరియు
ఒట్టోమన్ల రాజవంశాల హనఫీ ఫికా అధికారిక ఇస్లామిక్ పరిపాలన న్యాయ వ్యవస్థ అయినది,
హనాఫీ న్యాయ పాఠశాల(ఫికా)
ఖురాన్ మరియు హదీత్‌లను చట్టం యొక్క
ప్రాథమిక మూలాలుగా గుర్తించినప్పటికీ, ఇది క్రమబద్ధమైన తార్కికం (రేయ్)పై విస్తృతంగా
ఆధారపడటం వలన ప్రసిద్ది చెందింది. ఈ హనాఫీ న్యాయ పాఠశాల (ఫికా)ప్రస్తుతం మధ్య
ఆసియా, భారతదేశం, పాకిస్తాన్, టర్కీ మరియు
పూర్వ ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క దేశాలలో అనుసరించబడుచున్నది.
.
No comments:
Post a Comment