అహ్మద్ ఇబ్న్ హంబల్ 780
బాగ్దాద్, ఇరాక్ లో జన్మించారు మరియు 855 (వయస్సు 75) బాగ్దాద్,
ఇరాక్ లో మరణించారు.అహ్మద్ ఇబ్న్ హంబల్ గుర్తించదగిన
రచనలు:హదీస్ సంకలనం "ముస్నద్". ఇస్లాం లోని హంబలి
ఫిఖహ్( ఇస్లామిక్ న్యాయ
పాఠశాల/Islamic School of Jurisprudence)
కర్త.
అహ్మద్ ఇబ్న్
హoబల్ ఒక ముస్లిం మతతత్వవేత్త, న్యాయవాది. హoబల్ ప్రవక్త ముహమ్మద్(స) యొక్క సంప్రదాయాల (ముస్నాద్)సంకలనకర్త మరియు నాలుగు
సనాతన ఇస్లామిక్ న్యాయ పాఠశాలలో(ఫిఖహ్) లో అత్యంత
కఠినమైన, సాంప్రదాయబద్దమైన హంబలి ఫిఖహ్ కర్త. హంబల్ సిద్ధాంతం 13వ-14వ శతాబ్దపు
వేదాంతవేత్త ఇబ్న్ తైమియా వంటి ప్రముఖులను ప్రభావితం చేసింది.
అహ్మద్ ఇబ్న్
హoబల్ తల్లిదండ్రులిద్దరు షైబాన్ తెగకు చెందినవాడు. హoబల్ తండ్రి, హంబల్ శిశువుగా ఉండగానే మరణించాడు. ఇబ్న్ హoబల్ 15 సంవత్సరాల
వయస్సులో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) యొక్క సంప్రదాయాలను (హదీత్) అధ్యయనం
చేయడం ప్రారంభించాడు. హదీత్ అధ్యయనం కోసం హంబల్ ఇరాక్‌లోని కూఫా మరియు బస్రా, సౌది
అరేబియాలోని మక్కా, హెజాజ్ మరియు
మదీనా మరియు యెమెన్
మరియు సిరియా లోని పవిత్ర పట్టణాలకు వెళ్ళాడు.
ఇబ్న్ హంబల్ మూడు సార్లు కాలినడకన పవిత్ర నగరమైన
మక్కాకు ఐదు తీర్థయాత్రలు చేసాడు. ఇబ్న్ హంబల్ సన్యాసం మరియు స్వీయ-నిరాకరణ జీవితాన్ని గడిపాడు, అనేక మంది
శిష్యులను పొందాడు. ఇబ్న్ హంబల్ కి ఎనిమిది మంది పిల్లలు కలరు వారిలో ఇద్దరు సాలిహ్
(మరణం 880) మరియు అబ్ద్
అల్లా (903 మరణం) హంబల్
మేధోపరమైన పనితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు:
ఖలీఫా అల్-మమూన్ ఆదేశించిన “అల్-మిహ్నా”
అని పిలువబడే విచారణ సమయంలో ఇబ్న్ హంబల్ అనుభవించిన బాధలు, విచారణ సమయం లో హంబల్ ప్రదర్శించిన
అచంచలమైన ధైర్యసాహసాలు, ఇస్లామిక్ సంప్రదాయాలపై
ఇబ్న్ హంబల్ కు గల పట్టు వలన హంబల్ ఇస్లామిక్ సంప్రదాయాల గొప్ప నిపుణుడిగా
గుర్తింపు పొందాడు. హంబల్ ఇస్లాం యొక్క అత్యంత గౌరవనీయమైన
పండితులలో ఒకడు మరియు ముస్లిం సనాతన ధర్మాన్ని
గట్టిగా సమర్థించేవాడు.
అబ్బాసిద్ ఖలీఫా 827లో మరియు833లో దివ్య ఖురాన్ సృష్టించబడిందనే విశ్వాసాన్ని (ఇస్లామిక్
హేతువాదుల-ముతాజిలైట్ల సిద్ధాంతం) బహిరంగంగా ప్రకటించాడు. దివ్య ఖురాన్ సృష్టించబడిందనే విశ్వాసాన్ని ముస్లింలందరికీ
విధిగా విధించినాడు. ఇంతకుముందు, పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ సృష్టించబడని, శాశ్వతమైన దేవుని పదం లేదా వాణిగా
పరిగణించబడింది.
అబ్బాసిద్ కాలిఫేట్ రాజధాని బాగ్దాద్‌లో
అలాగే ప్రావిన్సులలో విచారణ జరిగింది. విచారణ 833 నుండి 848 వరకు
కొనసాగింది, ఈ కాలం
నలుగురు ఖలీఫాల పాలనను కలిగి ఉంది. సాంప్రదాయవాద దృక్కోణానికి
తిరిగి వచ్చిన అల్-ముతవాక్కిల్ ఖలీఫా సమయంలో విచారణ ముగిసింది.
తన ప్రాణాలను పణంగా పెట్టి, ఇబ్న్ హంబల్ ముతాజిలీ సిద్ధాంతాన్ని నిరాకరించాడు. ఇబ్న్ హంబల్
ను గొలుసులలో బందించారు, కొట్టారు మరియు
దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉంచారు. విడుదలైన తర్వాత, విచారణలో
ముగింపు బహిరంగంగా ప్రకటించబడే వరకు హంబల్ తన ఉపన్యాసాలను తిరిగి ప్రారంభించలేదు.
కొంతమంది సనాతన వేదాంతవేత్తలు, విచారణ నుండి బయటపడేందుకు, తమ ప్రవర్తనకు
సమర్థనగా, తకియా taqīyah, అనే
అధికారాన్ని ఉపయోగించుకొన్నారు. ఇతర వేదాంతవేత్తలు, ఇబ్న్ హంబల్ యొక్క ఉదాహరణను అనుసరించి, వారి
నమ్మకాలను తిరస్కరించడానికి నిరాకరించారు.
833లో ఇబ్న్ హంబల్ మరియు మరొక
వేదాంతవేత్త, ముహమ్మద్
ఇబ్న్ నూహ్, తమ నమ్మకాన్ని/విశ్వాసాన్ని ఉపసంహరించుకోవడానికి
నిరాకరించారు, ఆ సమయంలో వారు
టార్సస్‌లో (ప్రస్తుతం ఆధునిక టర్కీలో) ఉన్న ఖలీఫ్ అల్-మామున్ ముందు విచారణకు
హాజరు కావలసిఉంది. వారు బాగ్దాద్ నుండి గొలుసులతో పంపబడ్డారు కానీ వారి
ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే, ఖలీఫా మరణించాడు మరియు రాజధానికి తిరిగి వెళ్ళేటప్పుడు, ఇబ్న్ నూహ్
మరణించాడు.
కొత్త ఖలీఫా అల్-ముతాసిమ్, తన ముందు
హాజరుకావాలని ఇబ్న్ హంబల్ ను ఆదేశించాడు. ఇబ్న్ హంబల్ మూడు రోజుల పాటు
విచారణలో ఉన్నాడు మరియు మూడవ రోజు, హంబల్ మరియు ఖలీఫా మద్య ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ జరిగింది. హంబల్ కు స్వేచ్ఛను
ఇవ్వడానికి కనీసం హంబల్ నమ్మకం లో కొంచెం అయినా సడలింపు ఇమ్మని ఇబ్న్ హంబల్ ను ఖలీఫా కోరాడు. విచారణ
ప్రారంభం నుండి ఇబ్న్ హంబల్ తన
విశ్వాసాన్ని సవరించడానికి నిరాకరించాడు.
సహనం కోల్పోయిన ఖలీఫా అల్-ముతాసిమ్,
హంబల్ ను తీసుకెళ్లి కొరడాలతో కొట్టమని
ఆదేశించాడు. కొరడా దెబ్బలు తగిలినంత కాలం ఖలీఫా తన ప్రయత్నాలను కొనసాగించాడు, కానీ
ఫలించలేదు. ఇబ్న్ హంబల్ యొక్క అచంచలమైన
స్ఫూర్తి ఖలీఫాపై ప్రభావం చూపడం ప్రారంభించింది. కానీ ఖలీఫా సలహాదారులు
హంబల్ ను శిక్షించడం మానుకుంటే, అది ఖలీఫాల
పాలనపై భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందని హెచ్చరించారు. ఇబ్న్ హంబల్ కు సమర్ధన గా
రాజభవనం వెలుపల ప్రజలు గుమిగూడి దాడికి సిద్ధమవుతున్నారనే కారణం తో ఇబ్న్ హంబల్ పట్ల ఖలీఫా వ్యవహరించే విధానాన్ని తాత్కాలికంగా
నిలిపివేయాల్సి వచ్చింది. ఇబ్న్ హంబల్ ను 150 మంది కొరడా దెబ్బలు
కొట్టినట్లు నివేదించబడింది, ప్రతి ఒక్కరు ఇబ్న్ హంబల్ ని
రెండుసార్లు కొట్టి పక్కకు కదిలారు. హంబల్ కు కలిగిన గాయాల నుండి ఏర్పడిన మచ్చలు
ఇబ్న్ హంబల్ జీవితాంతం ఉన్నాయి.
తదుపరి విచారణ ఖలీఫా అల్-వాతిక్
ఆధ్వర్యంలో కొనసాగింది. ఖలీఫా అల్-ముతవాతిక్ కాలం లో హంబల్ పై హింస, వేధింపులు
జరగలేదు. కొత్త ఖలీఫా అల్-ముతవాతిక్ కాలం లో హంబల్ పై విచారణ
ఊపందుకొన్నది. అల్-ముతవాక్కిల్ పాలనలో విచారణ రెండు సంవత్సరాల పాటు కొనసాగింది, చివరకు
అల్-ముతవాక్కిల్ 848లో దానిని
ముగించాడు.
విచారణలో పాల్గొన్న పండితులందరిలో
ఇబ్న్ హంబల్ గొప్ప ఖ్యాతిని పొందారు మరియు ముస్లిం ప్రజల శాశ్వత కృతజ్ఞతను
పొందారు. ఇబ్న్ హంబల్ అన్ని అసమానతలను ఎదుర్కొని, ఘనత పొంది ముస్లింలను అవిశ్వాసులుగా
మారకుండా కాపాడాడు. ఇబ్న్ హంబల్ అంత్యక్రియల సమయంలో ఊరేగింపులో 800,000 మంది
సంతాపకులు ఉన్నట్లు అంచనా వేయబడింది.
ఇబ్న్ హంబల్ సాదించిన విజయాలు:
ఇబ్న్ హంబల్ రచనలలో ముఖ్యమైనది "ముస్నద్" ముహమ్మద్
ప్రవక్త(స) యొక్క సంప్రదాయాల/హదీసుల సేకరణ. ఈ సేకరణ ఇంతకుముందు హంబల్ కుమారుడు (ʿఅబ్ద్
అల్లాహ్) చేత సంకలనం చేయబడిందని విశ్వసించబడింది, అయితే ఇబ్న్ హంబల్ స్వయంగా హదీసుల సంకలనం చేసినట్లు ఇప్పుడు
ఆధారాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలను ఇబ్న్ హంబల్ చట్టం మరియు మతంలో వాదనకు ఒక మంచి ప్రాతిపదికగా
పరిగణించారు.
ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఇబ్న్ హంబల్ పై షాఫీ ఫిఖహ్/న్యాయ పాఠశాల స్థాపకుడు షాఫీ బోధనల ప్రభావం ఉంది.
అలాగే ఇతర న్యాయ పాఠశాలలకు చెందిన ఇతర గొప్ప న్యాయనిపుణుల పట్ల కూడా ఇబ్న్ హంబల్ అధిక
గౌరవం కలిగి ఉన్నాడు.
ఇబ్న్ హంబల్ ఇస్లామిక్ చట్టం యొక్క క్రోడీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడు. దివ్య ఖురాన్ మరియు సున్నత్ మూలాల నుండి చట్టానికి సంబంధించిన ప్రశ్నలకు పరిష్కారాలను పొందేందుకు న్యాయవేత్తలు స్వేచ్ఛగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హంబల్ తన గొప్ప “ముస్నద్” ను సంకలనం చేసాడు. అందులో హంబల్ న్యాయ ప్రశ్నల పరిష్కారానికి ప్రాతిపదికగా దివ్య ఖురాన్‌తో పాటు తన కాలంలో ఆమోదించబడిన అన్ని సంప్రదాయాలను నమోదు చేశాడు.
హంబలి ఫిఖహ్/న్యాయ పాఠశాల అభివృద్ధి చెంది ప్రాముఖ్యత పొందినది మరియు ఇస్లామిక్ మత చరిత్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపింది. మధ్య యుగాలలో, హంబల్ ఫిఖహ్/న్యాయ పాఠశాల హేతువాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాంప్రదాయవాద సనాతన ధర్మానికి సారథ్యం వహించింది.
ఇబ్న్ హన్బాల్ యొక్క గొప్ప అనుచరులలో ఒకరైన ఇబ్న్ తైమియా (1263–1328), చట్టం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలని, కానీ చట్టం, ఇస్లామిక్ సమాజం యొక్క మారుతున్న అవసరాలను తీర్చడానికి తాజా వివరణలతో ఉండాలని వాదించారు. హేతువాద శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం లో ఇబ్న్ హంబల్, ఇబ్న్ తైమియా ఇస్లాం యొక్క మహాపండితులుగా పిలవబడుతున్నారు,
హంబలి న్యాయ పాఠశాల-ఇస్లామిక్ చట్టం Ḥanbalī school-Islamic law:
ఇస్లాంలోని నాలుగు సున్నీ మతపరమైన చట్టాలలో హంబలి ఫిఖహ్/న్యాయ పాఠశాల ఒకటి. ముఖ్యంగా ప్రారంభ వేదాంత సిద్ధాంతం యొక్క క్రోడీకరణలో ప్రసిద్ధి చెందింది. అహ్మద్ ఇబ్న్ హంబల్ (780–855) బోధనల ఆధారంగా, హంబలి ఫిఖహ్/న్యాయ పాఠశాల (మధబ్madhhab) హదీథ్ యొక్క అధికారాన్ని మరియు ప్రారంభ తరాల ముస్లింల సంప్రదాయాల precedents గురించి నొక్కిచెప్పింది. ఇది ఊహాజనిత చట్టపరమైన తార్కికం (రేయ్(raʾy)) మరియు సారూప్యత (ఖియాస్(qiyās)) పట్ల తీవ్ర వ్యతిరేకం గా ఉంది మరియు హదీసులను అధిగమించడానికి లేదా ముందస్తు సంప్రదాయాలకు విరుద్ధంగా వాటిని ఉపయోగించడాన్ని తిరస్కరించింది.
11వ మరియు 13వ శతాబ్దాల మధ్య, ఇరాకీ(బాగ్దాద్) హంబలిలు మేధో వికాసం మరియు సామాజిక ప్రాముఖ్యతను
అనుభవించారు. ఇరాకీ హంబలిలు గా పెద్ద సంఖ్యలో తత్వవేత్తలు మరియు ఖలీఫా వజీర్లు కలరు. దీనికి విరుద్ధంగా,
13వ శతాబ్దంలో బాగ్దాద్ పై మంగోల్ దండయాత్ర
తర్వాత డమాస్కస్ హంబలి ఫిఖహ/న్యాయ పాఠశాల
ప్రాముఖ్యతను సంతరించుకున్నది మరియు దృఢమైన
కటినమైన సంప్రదాయవాద వేదాంత నిబంధనలను కొనసాగించినది.
సిరియన్ హంబలి పండితుడు ఇబ్న్ తైమియా
(1263–1328)
ఈ రెండు విధానాలను సంశ్లేషణ చేశాడు.
20వ శతాబ్దం నుండి హంబలి ఫిఖహ్/న్యాయ పాఠశాల సౌదీ
అరేబియా లో విస్తృతంగా వ్యాప్తి చెందింది.
సౌది లో ఇది అధికారిక ఫిఖహ్/న్యాయ పాఠశాలగా ఉంది.
హంబలి న్యాయ పాఠశాల ప్రధానంగా ఖురాన్,
హదీసులు (ముహమ్మద్ సూక్తులు మరియు ఆచారాలు) మరియు సహబా
(ముహమ్మద్ సహచరులు) అభిప్రాయాల నుండి షరియాను పొందింది.ఇస్లాం యొక్క పవిత్ర
గ్రంథాలలో స్పష్టమైన సమాధానం లేనప్పుడు, హంబలి పాఠశాల ఇస్లామిక్ చట్టాన్ని రూపొందించడానికి
ఇస్తిహ్సాన్ (న్యాయశాస్త్ర విచక్షణ) లేదా 'ఉర్ఫ్ (సంఘం యొక్క ఆచారాలు)ను సరైన ప్రాతిపదికగా
అంగీకరించదు.
ఈ పద్ధతిని హనాఫీ
మరియు మాలికీ సున్నీ madh'habs అంగీకరిoచును.
హంబలి న్యాయ పాఠశాల అనేది సున్నీ ఇస్లాంలోని న్యాయశాస్త్రానికి సంబంధించిన
కఠినమైన సంప్రదాయవాద పాఠశాల.ఇది ప్రధానంగా సౌదీ అరేబియా మరియు ఖతార్ దేశాలలో అమలులో
ఉన్నది. ఈ దేశాలలో హంబలి న్యాయ పాఠశాల అధికారిక ఫిఖ్.UAEలోని నాలుగు ఎమిరేట్స్‌లో (షార్జా,
ఉమ్ అల్-క్వైన్, రస్ అల్-ఖైమా మరియు అజ్మాన్) జనాభా పరంగా హంబలి అనుచరులు
ఎక్కువ మంది ఉన్నారు.బహ్రెయిన్, సిరియా, ఒమన్ మరియు యెమెన్ మరియు ఇరాకీ మరియు జోర్డానియన్ బెడౌయిన్‌లలో
పెద్ద సంఖ్యలో హంబలి అనుచరులు కూడా
ఉన్నారు.
No comments:
Post a Comment