అన్నీ బిసెంట్ (1847-1933) బ్రిటిష్
సోషలిస్ట్, థియోసాఫిస్ట్, రచయిత, వక్త మరియు మహిళా
హక్కుల కార్యకర్త. అన్నీ బెసెంట్ 1893లో మొదటిసారిగా భారతదేశాన్ని సందర్శించి, ఆ తర్వాత
భారతదేశంలో స్థిరపడ్డారు. 1907లో అన్నీ బిసెంట్
మద్రాస్ (చెన్నై)లోని థియోసాఫికల్ సొసైటి అధ్యక్షురాలైంది. అన్నీ బిసెంట్ భారతీయల స్వయం పాలన కోసం కూడా చురుకుగా ప్రచారం చేసింది.
1932లో అన్నీ బెసెంట్ థియోసఫీ వెలుగులో “ఇస్లాం మతం”
పై ప్రసంగం చేశారు. 'థియోసఫీ' అనేది కేవలం 'దైవిక జ్ఞానం' అని మరియు ప్రతి
మతం దైవిక జ్ఞానం యొక్క గొప్ప మూలం నుండి ఎదిగిందని అన్నీ బెసెంట్ వివరిస్తుంది. ఈ
ఉపన్యాసం నుండి ఇస్లాం గురించి అన్నీ బెసెంట్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం
ఆసక్తికరంగా ఉంది.
ప్రవక్త(స) బోధనల యొక్క గొప్పతనం గురించి పూర్తిగా తప్పుగా
అర్థం చేసుకున్నందువలన, ఇస్లాం తరచుగా ఆపార్ధలకు
లోనవుతుందని అన్నీ బెసెంట్ అభిప్రాయపడ్డారు.
ఇస్లాం కి వ్యతిరేకంగా
పాశ్చాత్యులు చేసే మూడు ప్రధాన వాదనలు ఏమిటంటే ఇస్లాం మతోన్మాదమైనది మరియు ప్రగతిశీలమైనది కాదు. ఇస్లాం మతంలో
స్త్రీల స్థానం తక్కువుగా చూపబడినది. చివరిగా
ఇస్లాం నేర్చుకోవడం, విజ్ఞానం మరియు
మేధోపరమైన ప్రయత్నాలను ప్రోత్సహించదు. అన్నీ బెసెంట్ ఈ ఆరోపణలన్నింటినీ సరైనవి
కావని కొట్టిపారేసింది మరియు తరచుగా తన వాదనకు
సమర్ధనగా పవిత్ర ఖురాన్ మరియు హదీసులను ఉటంకిస్తుంది.
అన్నీ బెసెంట్ ప్రకారం ప్రవక్త
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు వ్యతిరేకంగా చేసిన విమర్సలలో నిజం లేదు. అన్నీ
బెసెంట్ దృష్టిలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విమర్శించే వారికి ప్రవక్త(స) జీవిత
చరిత్ర అసలు తెలియదు. ముహమ్మద్(స) జీవిత చరిత్ర చాలా సరళమైనది, చాలా వీరోచితమైనది, మరియు అది చారిత్రాత్మక
వ్యక్తుల గొప్ప జీవితాలలో ఒకటి."
అన్నీ బెసెంట్ తరువాత ఇలా
చెప్పింది: “ప్రవక్త(స) జీవితం సరళమైనది
మరియు నిరాడంబరం అయినది. ప్రవక్త(స) దర్జీ మరియు చెప్పులు కుట్టేవాడు గా ఉన్నారు- తన విరిగిన బూట్లను
సరిదిద్దుకున్నారు, తన కోటును సరిచేసుకున్నారు.ప్రవక్త(స)పిల్లలపై
ప్రేమ చూపారు మరియు ప్రజలు ప్రవక్త(స) ను నమ్మదగిన
(అల్ అమీన్) అని పిలుచుకొన్నారు.
ప్రవక్త ముహమ్మద్ (స)
నేర్చుకోవడం మరియు జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నీ బెసెంట్ అన్నారు,
ఒక హదీసు ప్రకారం “పండితుని సిరా
అమరవీరుడి రక్తం కంటే విలువైనది” అని అన్నీ బెసెంట్ చెప్పారు. అన్నీ బెసెంట్ ఇలా చెప్పింది: “ఈ వాక్యాన్ని ముసల్మాన్
స్థాపించిన ప్రతి పాఠశాల గోడపై బంగారు అక్షరాలతో చెక్కాలి.” ఇస్లాం లో పండితులను
గౌరవించబడ్డారు మరియు విద్యా వైజ్ఞానిక రంగాలలో ముస్లిం శాస్త్రవేత్తలు చేసిన
గొప్ప పురోగతి పాశ్చాత్య దేశాలను బాగా ప్రభావితం చేసింది మరియు ప్రపంచంలో
శాస్త్రీయ పురోగతిని ప్రేరేపించింది .
అన్నీ బెసెంట్ ఇస్లాం లో స్త్రీల
పట్ల వివక్ష లేదు అన్నారు మరియు ఇస్లాంలో పురుషులు మరియు స్త్రీలు మతపరమైన
విషయాలలో సంపూర్ణ సమాన హోదాలో ఉంచబడ్డారని పేర్కొంది. ఇస్లాం కు ముందు అరేబియా లో ప్రజలు
బహుభార్యత్వాన్ని కలిగి వ్యభిచారంలో జీవిస్తున్నారని మరియు లైంగిక నైతికత లేదని అన్నీ
బెసెంట్ అన్నారు. ప్రవక్త(స) చేసిన సంస్కరణల
పలితంగా పురుషుడు నలుగురు భార్యలను కలిగి
ఉండటానికి అనుమతించబడ్డాడు,
అయితే భర్త అన్ని
విధాలుగా మొదటి భార్యను చూసుకోన్నట్లే రెండో భార్యను చూసుకొంటే మరియు మొదటి భార్య అనుమతితో మాత్రమే రెండవ భార్యను తీసుకోవచ్చు.
ఒక పురుషుడు మరియు ఒక
స్త్రీ మధ్య నిజమైన మరియు సరైన సెక్స్ సంబంధం కొన్ని దేశాలలో ఆదర్శంగా
బోధించబడుతుందని, కానీ “పాశ్చాత్య
దేశాలలో ఏకభార్యత్వం ఉన్నట్లు నటిస్తారు, కానీ బాధ్యత లేని బహుభార్యత్వం నిజంగా ఉంది; "
ఇస్లాం మతానికి
వ్యతిరేకంగా మరొక సాధారణ అపోహ ఏమిటంటే అది హింసను ప్రేపించే విశ్వాసం, కత్తితో కూడిన మతం. "అవిశ్వాసులను
వధించండి" అనే ఆజ్ఞ మీపై దాడి చేసే వారికి మాత్రమే అని అన్నీ బెసెంట్ స్పష్టం
చేశారు. అన్నీ బెసెంట్ ఇంకా ఇలా చెబుతోంది: ప్రవక్త(స)యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను
చంపే సార్వత్రిక అభ్యాసాన్ని నిలిపివేసాడని మరియు పట్టుబడిన శత్రువులను అత్యంత దయతో చూడాలని తన సైనికులకు
నేర్పించాడు. ప్రవక్త(స)తన సైనికులకు విద్యా నేర్పిన యుద్ద ఖైదీలను విడుదల చేసినారు.
అన్నీ బెసెంట్ ముగింపు
వ్యాఖ్యలు ప్రస్తుత కాలానికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి: “ముసల్మాన్ మరియు
హిందువుల కలయిక ఉండాలి. ఎందుకంటే
హిందువులు, జొరాస్ట్రియన్లు, క్రైస్తవులు
మరియు ముసల్మాన్ ఒకరినొకరు అర్థం చేసుకునేంత వరకు భారతదేశం ఎన్నటికీ ఒక దేశంగా
మారదు. మనమందరం మత ద్వేషాలను పక్కనబెట్టి ఒకే సోదరులమని భావించలేమా? మనం ఒకరి విశ్వాసాన్ని
మరొకరు గౌరవించడం, ఒకరి ఆరాధనను
మరొకరు గౌరవించడం నేర్చుకోలేదా? ప్రతి ఒక్కరూ తన విశ్వాసాన్ని ప్రేమించడమే కాకుండా తన లాగే తన
పొరుగువారి విశ్వాసం తన పొరుగువారికి ఎంత విలువైనదో తనకు తానుగా గ్రహించాలి.
No comments:
Post a Comment