23 November 2022

ఇస్లామిక్ పర్యావరణవాదం Islamic environmentalism

 

ఇస్లామిక్ పర్యావరణవాదం అనేది ఇస్లామిక్ గ్రంథాలు, సంప్రదాయాల నుండి ఉద్భవించిన పర్యావరణ సూత్రాలను తెలియజేస్తుంది.. ఇస్లామిక్ పర్యావరణవాదం ఆధునిక పర్యావరణ సంక్షోభంను  పరిష్కరించే  పర్యావరణ సూత్రాలను వివరిస్తుంది.

ముస్లిం పర్యావరణవేత్తలు ప్రకృతిపై దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని విశ్వసిస్తారు. పర్యావరణాన్ని రక్షించడం మరియు సంరక్షించడం లో దేవుని ప్రతినిధిగా మానవుని యొక్క పాత్రను తెలియ జేస్తుంది. ఇస్లామిక్ పర్యావరణవాదం ఇస్లామిక్ పర్యావరణ తత్వశాస్త్రం, షరియా-ఆధారిత పర్యావరణ చట్టం మరియు ఇస్లామిక్ పర్యావరణ క్రియాశీలతను కలిగి ఉంటుంది.

 ఇస్లామిక్ పర్యావరణవాదం చరిత్ర:

ఇరానియన్-జన్మించిన తత్వవేత్త సెయ్యద్ హుస్సేన్ నాస్ర్ ఇస్లామిక్ పర్యావరణవాదానికి వ్యవస్థాపక పితామహుడిగా పరిగణించబడ్డాడు. ఇస్లామిక్ పర్యావరణవాదం 1960ల నుండి అభివృద్ధి చెందింది. 1966లో చికాగో విశ్వవిద్యాలయంలో నాస్ర్ చేసిన ఉపన్యాసాలశ్రేణి  ఇస్లామిక్ పర్యావరణవాదం గురించి వివరిస్తాయి.

సెయ్యద్ హుస్సేన్ నాస్ర్‌ "పర్యావరణ సంక్షోభం పై  ఆధ్యాత్మిక కోణాల " ప్రారంభ ఆలోచనాపరులలో ఒకడు. పర్యావరణ క్షీణత మరియు ఆధునిక ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక మరియు నైతిక సంక్షోభాల మధ్య సంబంధాలను నొక్కిచెప్పడానికి నాస్ర్ సూఫీయిజం మరియు ఐక్యత యొక్క భావనపై దృష్టి సారించాడు.

ఇస్లామిక్ పర్యావరణవాద రంగంలోని ఇతర ప్రముఖ వ్యక్తులు: ఫజ్లున్ ఖలీద్, మావిల్ ఇజ్జి డియన్, ఒత్మాన్ లెవెల్లిన్, ఇబ్రహీం ఓజ్డెమిర్, సయ్యద్ నోమనుల్ హక్ మరియు ముస్తఫా అబు స్వే. వీరు అందించిన సహకారంతో 1980లలో ఇస్లామిక్ పర్యావరణ రంగం మరింత అభివృద్ధి చెందింది.

ఇస్లామిక్ పర్యావరణవాద  ఆలోచనలు/భావనలు:

 

1.మానవ సార్వభౌమాధికారం లేదు: 

హిబ్రూ బైబిల్ మరియు లౌకిక తత్వశాస్త్రం వలె కాకుండా, దివ్య ఖురాన్, ప్రకృతిపై మానవ సార్వభౌమాధికారాన్ని గుర్తించలేదు మరియు ఈ భావన  ఇస్లామిక్ పర్యావరణ చర్చపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

దివ్య ఖురాన్ పదిహేడు వేర్వేరు ప్రదేశాలలో ముల్క్ లేదా ఆధిపత్యం పూర్తిగా దేవునికి (అల్లాహ్) చెందినదని ప్రకటించింది. ముల్క్ M L K అనే మూలం నుండి ఉద్భవించింది మరియు దీని అర్థం "యాజమాన్యం" లేదా "స్వాధీనం". “ముల్క్” దివ్య ఖురాన్‌లో నలభై ఎనిమిది సార్లు కనిపిస్తుంది. ఇది మొత్తం సృష్టిని సూచిస్తుంది.

2.ఖలీఫాగా మానవజాతి

దివ్య ఖురాన్ మొత్తం మానవజాతిని ఖలీఫా- భూమిపై ఆధిపత్యం కల ప్రతినిధి లేదా వారసుడు గా నిర్వచించింది. ఖలీఫా (నిర్వాహకత్వం) యొక్క ఆలోచన ఇస్లామిక్ పర్యావరణవాదంలో నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన భావన. ఇస్లామిక్ పర్యావరణ విశ్వాసాల ప్రతిపాదకులు భూమిపై దేవుని ఖలీఫా గా మనిషి యొక్క విధిని నొక్కి చెప్పారు. అందువల్ల, మానవుడు దేవుని చిత్తానికి అనుగుణంగా వ్యవహరించడానికి మరియు దేవుడు కోరిన విధంగా భూమిని చూసుకోవడానికి బాధ్యత వహిస్తాడు.

ఖలీఫా (సారథ్యం) అనేది ఇతర జీవులపై ఆధిపత్యాన్ని సూచించదని గుర్తించడం చాలా అవసరం. మానవులు సారథ్యాన్ని ఆచరించడానికి ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేయడం కంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. కొంతమంది ముస్లిం పండితులు ఈ సారథ్యాన్ని దైవ పరీక్షగా కూడా పరిగణిస్తారు.సహజ ప్రపంచం, భగవంతుని సృష్టిగా, మానవాళి దేవుణ్ణి గ్రహించడానికి ఒక సంకేతం.

3.దేవుని ఏకత్వం:

ఇస్లామిక్ జీవావరణ శాస్త్రంలో తరచుగా అనుసరించబడే మరొక ముఖ్యమైన సూత్రం దేవుని ఏకత్వం (తౌహిద్) ఆలోచన. ఇస్లామిక్ పర్యావరణవాదం తౌహిద్ యొక్క భావన వివిధ స్థాయిల అర్థాలను కలిగి ఉంది. మొదటగా, ఇది దేవుని ఏకత్వాన్ని సూచిస్తుంది. సృష్టి లో ప్రతిదీ భగవంతుని సృష్టిలో ఒక భాగమని, సృష్టిలో  ఒకదానితో ఒకటి అనుసంధానించబడిందని మరియు మొత్తం ప్రపంచాన్ని అర్థవంతంగా, విలువైనదిగా మరియు సంరక్షణకు అర్హమైనదిగా మార్చే వాస్తవాన్ని వ్యక్తపరుస్తుంది.

4.మిజాన్ భావన:

మిజాన్ అంటే "సమతుల్యత", ఇస్లామిక్ పర్యావరణ దృక్పథానికి ప్రాథమికమైనది. మిజాన్ గురించి చర్చిస్తున్నప్పుడు ముస్లిం పండితులు ఉపయోగించే అత్యంత సాధారణ ఆయత్ 15:19- మేము భూమిని పరిచాము. అందులో కొండలను పాతాము. అందులో అన్ని రకాల చెట్లను కచ్చితమైన తగిన పరిమాణం లో సృస్టిoచాము. ఇంకా అందులో జీవనోపాధికి వనరులను ఏర్పాటు చేసాము”. మానవులు “దేవుడు తన సృష్టిలో నిర్మించిన సమతుల్యత మరియు నిష్పత్తిని కొనసాగించాలి". అరబిక్‌లో, మిజాన్ అనే పదం భౌతిక సమతుల్యత మరియు న్యాయం రెండింటినీ సూచిస్తుంది.

5.ఇతర ఆలోచనలు/భావనలు :

కాలుష్యం వంటి సమకాలీన సమస్యలను పరిష్కరించడానికి, ముస్లిం రచయితలు కియాస్ (సారూప్యత ద్వారా తార్కికం)   యొక్క ఇస్లామిక్ న్యాయపరమైన అభ్యాసాన్ని ఉపయోగిస్తారు. పరిశుభ్రత, దుర్వాసనకు వ్యతిరేకంగా నిషేధాలు మరియు పరిశుభ్రతను నియంత్రించే హదీథ్‌లను భూమి, నీరు మరియు గాలి కలుషితం చేయకుండా నిషేధాలుగా వారు అర్థం చేసుకున్నారు.

వజూ/అభ్యంగన సమయంలో నీటిని సంరక్షించడం మరియు వృధాకాకుoడా చూడటం, నీటి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం, వ్యర్థ వనరుల వినియోగంపై ప్రవక్త(స) యొక్క హదీసులను ఇస్లామిక్ పర్యావరణ సాహిత్యం ఉదహరిస్తూoదని   చెప్పవచ్చు.

No comments:

Post a Comment