21 November 2022

నూర్జహాన్ 1577-1645 Nur Jahan نور جهاں

 

నూర్జహాన్ (పర్షియా: نور جهان) (ఉర్దూ:نور جهاں), (نور ج) గా పిలవబడే  

"మెహరున్నిసా" (మెహర్ ఉన్ నిసా అంటే స్త్రీలలో సూర్యుడని అర్ధం)” 1577కాందహార్ ,లోజన్మించింది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిని అయింది. నూర్జహాన్ అందమైన, బాగా చదువుకున్న మహిళగా గుర్తింపు పొందింది. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా నూర్జహాన్ గుర్తించబడినది.  నూర్జహాన్ మరణం 1645 లో జరిగింది. 

నూర్జహాన్ మొఘల్ సామ్రాజ్యం లో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడమే కాక అత్యంత ప్రభావవంతమైన మొఘల్ స్త్రీగా కూడా గుర్తించబడింది. నూర్జహాన్ ధర్మకార్యాలు, వాణిజ్యంలలో ప్రతిభను చూపింది. నూర్జహాన్ రాజకీయ అధికారాన్ని చలాయించినది. నూర్జహాన్ పేరుతో మొఘల్ సామ్రాజ్యంలో వెండి నాణ్యాలు ముద్రించబడ్డాయి. మొఘల్ నాణ్యాలలో తన పేరును ముద్రించుకున్న ఒకే ఒక మహిళగా ముంతాజ్‌కు ప్రత్యేకత ఉంది.

నూర్జహాన్  తల్లి తండ్రులు అస్మత్ బేగం, మిర్జా గియాస్ బేగ్‌. నూర్జహాన్,  తల్లి తండ్రులు తమ స్వంత భూమిలో జీవించలేక అదృష్టాన్ని వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చారు.నూర్జహాన్ తండ్రి  గియాస్ బెగ్‌కు అక్బర్ చక్రవర్తి సభలో ఉద్యోగం లభించినది. కాబూల్ భూభాగానికి దివాన్‌గా (ఖజానాధికారి) నియమించబడ్డాడు. గియాస్ బెగ్‌ కుమార్తె  మెహర్ - ఉన్- నిసా అరబిక్. పర్షియన్ భాషలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యాలలో నైపుణ్యం సంపాదించింది. 

1594లో నూర్జహాన్ 17 సంవత్సరాల వయసులో అలి కులి ఇస్తజ్లు (షేర్ ఆఫ్ఘన్ ఖాన్) ను వివాహం చేసుకుంది. షేర్ అఫ్ఘన్ ధైర్యసాహసాలున్న పర్షియన్ యువకుడు. షేర్ అఫ్ఘన్ మొఘల్ సైన్యంలో చేరి అక్బర్జహంగీర్ చక్రవర్తి ఆధ్వర్యంలో పనిచేసాడు. అలి కులి ఇస్తాజ్లుకు షేర్ ఆఫ్ఘన్ అనే బిరుదు ఇవ్వబడింది. షేర్ ఆఫ్ఘన్ ఖాన్కు  తన మొదటి భార్య లాడి బేగం ద్వారా ఒక కుమార్తె ఉంది.

1605లో చక్రవర్తి అక్బరు మరణించిన తరువాత ఆయన పెద్దకుమారుడు జహంగీరు రాజ్యాధికారం చేపట్టాడు. 1607లో షేర్ ఆఫ్ఘన్ హత్యచేయబడ్డాడు.జహంగీర్ నూర్జహానును తన సవతితల్లి చక్రవర్తిని రుకైయా సుల్తాన్ బేగంకు సేవకురాలిగా నియమించాడు తరువాత జహంగీర్ మెహరున్నిసాను 1611లో వివాహం చేసుకున్నాడు.

జహంగీర్ చక్రవర్తి తన అందమైన మైన, విశ్వసనీయమైన భార్య మెహరున్నిసా కు  (నూర్ మహల్, ప్యాలెస్ దీపం, నూర్జహాన్, విశ్వదీపం ) బిరుదులు ఇవ్వబడ్డాయి.  జహంగీర్ ప్రేమపాత్రురాలైన నూర్జహాన్‌ రాజకీయంగా శక్తివంతురాలు అయింది. జహంగీర్ ఓపియం, ఆల్కహాలుకు దాసుడు కావడం నూర్జహాన్‌కు చాలా సంవత్సరాలు రాజకీయ అధికారాన్ని దక్కించుకున్నది.

మొఘల్ సామ్రాజ్యాన్ని వెనుక ఉండి నడిపించిన మహిళగా నూర్జహాన్ కు చరిత్రలో ప్రత్యేకత ఉంది. నూర్జహాన్ తన భర్త జహంగీర్ తో ఝరొకాలో కూర్చుని సభికులను కలుసుకుని ఆజ్ఞలను జారీచేయడం, జాగీరుల నిర్వహణ, మంత్రులతో సమాలోచన జరిపింది. “నిషాన్/రాజముద్రిక”  అధికారం కూడా నూర్జహాన్ కు ఇవ్వబడినది.

నూర్జహాన్ అత్యధిక ధైర్యసాహసాలు కలిగిన మహిళ. నూర్జహాన్ ధైర్యం, సాహసం, రాజకీయ చాతుర్యం రాజ్య సరిహద్దులకు రక్షణగా నిలిచింది. కుటుంబ కలహాలు, తిరుగుబాటు, జహంగీర్ మరణించడానికి ముందు వారసుల మద్య తలెత్తిన యుద్ధం (1627 అక్టోబరు 28) లో నూర్జహాన్ తన చాకచక్యం చూపింది. 

నూర్జహాన్, షాజహాన్ మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా బలపడ్డాయి. జహంగీర్ రెండవ కుమారుడైన షాహ్ర్యార్‌ Shahryar ను అధికారానికి తీసుకురావడానికి నూర్జహాన్ ప్రయత్నించడం షాజహానుకు తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. షాహ్ర్యార్‌ Shahryar నూర్జహానుకు అల్లుడు కూడా. షాజహాన్ సైన్యాలను సమకూర్చుకుని జహంగీర్, నూర్జహాన్ మీద దాడిచేసాడు. షాజహన్ చర్యలకు 1526లో తండ్రి జహంగీర్ నుండి క్షమాభిక్ష లభించింది. అయినప్పటికీ నూర్జహాన్, షహ్ర్యాన్ Shahryar షాజహాన్‌కు వ్యతిరేకంగా గూఢంగా చర్యలు సాగించారు.

1626 లో జహంగీర్ చక్రవర్తి కాశ్మీర్‌కు వెళ్ళేదారిలో తిరుగుబాటుదారుల చేత చిక్కాడు. తిరుగుబాటు నాయకుడు మహాబత్ ఖాన్ జహంగీర్‌కు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నాడు. నూర్జహాన్ భర్తను విడిపించడానికి ప్రయత్నించింది. నూర్జహాన్ శత్రువు మీద దాడి చేసి చక్రవర్తిని విడిపించటానికి  స్వయంగా ఏనుగు మీద స్వారీ చేస్తూ సైనిక దళాన్ని నడిపించింది. యుద్ధంలో నూర్హహాన్ మహాబత్ ఖాన్‌కు లొంగి పోయింది. మహాబత్ ఖాన్ నూర్జహాన్ ను భర్తతో చేర్చి బంధించాడు. కాని నూర్జహాన్ భర్తతో సహా తప్పించుకుని మహాబత్ ఖాన్ మీద దాడి చేసింది.

వారసుల మద్య యుద్ధం.

ఈ సంఘటన తరువాత జహంగీర్ 1627 అక్టోబరులో మరణించాడు. జహంగీర్ మరణం వారసుల మద్య అధికారం కోసం  యుద్ధానికి దారితీసింది. ప్రధాన పోటి షర్యార్ Shahryar, షాజహాన్ మద్య సాగింది. నూర్జహాన్ తనకు అనుకూలుడైన షహ్ర్యార్‌ Shahryar ను చక్రవర్తిని చేసి అతడిని తనకు అనుకూలంగా నడిపించవచ్చని విశ్వసించింది. కాని వారసత్వ యుద్ధం లో షాజహాన్ విజయం పొంది 1628లో  మొఘల్ చక్రవర్తి అయ్యాడు. 

నూర్జహాన్ తన కుమార్తె లాడి బేగంతో మిగిలిన జీవితం వసతిసౌకర్యాలతో గృహనిర్భంధంలో గడిపింది. గృహనిర్భంధ సమయంలో నూర్జహాన్ మఖాఫి పేరుతో పర్షియన్ కవిత్వం వ్రాసింది. నూర్జహాన్ 1645 డిసెంబరు 17న తన 68వ సంవత్సరంలో మరణించింది. నూర్జహాన్ భౌతికకాయం లాహోర్ లోని షహ్దరా బాగ్‌లో సమాధి చేయబడింది.

 


No comments:

Post a Comment