అల్-షఫీ
గా పిలువబడే అబూ అబ్ద్ అల్లాహ్ ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షఫీ యొక్క జననం 767లో
అరేబియాలో జరిగింది. అల్-షఫీ ముస్లిం న్యాయశాస్త్ర పండితుడు. ఇస్లామిక్ న్యాయ
ఆలోచనను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించినాడు మరియు షఫియాShāfiʿiyyah పాఠశాల
స్థాపకుడు. అల్-షఫీ సంప్రదాయాల వినియోగానికి సంబంధించి మతపరమైన మరియు చట్టపరమైన పద్దతికి
ప్రాథమిక సహకారం అందించాడు.
అల్-షఫీ జీవితవివరాలు గురించి చాలా తక్కువగా తెలుసు. అల్-షఫీ, ఖురైష్ తెగకు చెందినవాడు, అల్-షఫీ, తల్లికి ప్రవక్త ముహమ్మద్(స) తో దూరపు సంబంధం ఉంది. అల్-షఫీ కి చిన్న వయస్సులోనే తండ్రి మరణించాడు మరియు పేద పరిస్థితులలో, మక్కాలో తన తల్లి వద్ద పెరిగాడు.
అల్-షఫీ బెడౌయిన్‌లBedouins
నుండి అరబిక్ కవిత్వం నేర్చుకొన్నాడు. అల్-షఫీ, సుమారు
20
సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, గొప్ప
న్యాయ విద్వాంసుడు మాలిక్ ఇబ్న్ అనస్‌తో కలిసి చదువుకోవడానికి మదీనాకు వెళ్లాడు. 795లో
మాలిక్ మరణించిన తర్వాత, అల్-షఫీ
యెమెన్‌కు వెళ్లాడు, అల్-షఫీ
803లో
సిరియాలోని అల్-రఖా వద్ద ఖలీఫా హరూన్
అల్-రషీద్ చేత ఖైదు చేయబడ్డాడు.
ఖైదు నుంచి అల్-షఫీ త్వరలోనే విడుదలయ్యాడు మరియు బాగ్దాద్‌లో హనాఫీ పాఠశాల యొక్క ముఖ్యమైన న్యాయనిపుణుడు అల్-షైబానీతో కలసి కొంతకాలం చదువుకున్న తర్వాత, అల్-షఫీ అల్-ఫుస్తాట్ (ఇప్పుడు కైరో)కి వెళ్లి అక్కడ 810 వరకు ఉన్నాడు. తర్వాత బాగ్దాద్‌కు తిరిగి వచ్చాడు. కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా అక్కడ పని చేసాడు. కొన్ని ప్రయాణాల తరువాత, అల్-షఫీ 815/816లో ఈజిప్టుకు తిరిగి వచ్చాడు మరియు జీవితాంతం అక్కడే గడిపాడు. అల్-ఫుస్తాత్‌లోని అల్-షఫీ సమాధి చాలా కాలం పాటు యాత్రా స్థలంగా ఉండేది.
తన ప్రయాణాల సమయంలో, అల్-షఫీ చాలా గొప్ప న్యాయ శాస్త్ర కేంద్రాలలో చదువుకున్నాడు మరియు న్యాయ సిద్ధాంతం యొక్క వివిధ పాఠశాలల గురించి సమగ్ర జ్ఞానాన్ని పొందాడు. ఇస్లామిక్ చట్టపరమైన ఆలోచన యొక్క కొత్త సంశ్లేషణ synthesis ను సృష్టించడం అల్-షఫీ గొప్ప సహకారం.
అల్-షఫీ రూపొందించిన చాలా ఆలోచనలు అప్పటికే సుపరిచితం, కానీ వాటిని కొత్త మార్గంలో రూపొందించడంలో అతని కృషి ప్రధానం గా ఉంది. అల్-షఫీ, ఇస్లామిక్ చట్టం యొక్క మూలాలు ఏమిటి మరియు ఈ మూలాలను సమకాలీన సంఘటనలకు ఎలా అన్వయించవచ్చు అనే ప్రశ్నతో వ్యవహరించారు. అల్-షఫీ జీవితపు చివరి ఐదు సంవత్సరాలలో వ్రాసిన ప్రధాన న్యాయ పుస్తకం, “రిసాలా”. అది అల్-షఫీ ని షాఫి ముస్లిం న్యాయ శాస్త్ర పితామహుడిగా పిలవడానికి అర్హునిగా చేసింది.
న్యాయవేత్త అల్-షఫీ యొక్క మరణం820 (వయస్సు 53) ఈజిప్ట్ లో జరిగింది.
అల్-షఫీ
రచనలు:
అల్-షఫీ 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించాడు.కానీ చాలా వరకు అవి అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న అల్-షఫీ రచనలు:
• అల్-రిసాలా –
అల్-షఫీ
యొక్క అత్యంత ప్రసిద్ధ పుస్తకం,
దీనిలో అల్-షఫీ
న్యాయ శాస్త్ర సూత్రాలను క్షుణంగా పరిశీలించాడు.
పుస్తకం ఆంగ్లంలోకి అనువదించబడింది.
• కితాబ్ అల్-ఉమ్మ్Kitab al-Umm –
షఫీ
ఫిఖ్‌పై, అల్-షఫీ యొక్క ప్రధాన గ్రంథం
• ముస్నద్ అల్-షఫీ (హదీసులపై) – ఇది అహ్మద్ ఇబ్న్ అబ్ద్ అర్-రహ్మాన్ అల్-బన్నా ద్వారా
అరబిక్ 'తార్టిబ్'Tartib 'తో దొరుకుతుంది.
*ఇఖ్తిలాఫ్
అల్ హదీస్Ikhtilaf al
Hadith
·
అల్ సునన్ అల్ మాథూర్Al sunan al
Ma’thour
·
జ్మా అల్ ఇల్మ్Jma’ al ilm
వీటితో పాటు, అల్-షఫీ ఒక అనర్గళ కవి. అల్-షఫీ నైతికత మరియు ప్రవర్తనను సూచించే లక్ష్యంతో అనేక చిన్న కవితలను కంపోజ్ చేశాడు.
షఫీ న్యాయ పాఠశాల Shāfiʿī School of Muslim
Law:
ఇస్లాంలో మధబ్ అల్-షఫీ అని పిలువబడే షఫీ న్యాయ పాఠశాల నాలుగు సున్నీ మతపరమైన చట్టాలలో ఒకటి. షాఫీ లీగల్ స్కూల్ ముహమ్మద్ ఇబ్న్ ఇద్రిస్ అల్ షఫీ బోధనల నుండి ఉద్భవించింది. షాఫీ చట్టపరమైన పాఠశాల ఇస్లామిక్ న్యాయ సిద్దాంతం యొక్క మదబ్ ఆధారాలను స్థిరీకరించినది. చట్టం పై దైవిక చట్ట మరియు మానవ ఊహాగానాలు రెండింటి అధికారాన్ని ధృవీకరిస్తుంది.
సాంప్రదాయ సమాజ అభ్యాసాల ప్రాదేశికపై ఆధారపడటాన్ని తిరస్కరిస్తూ, చట్టపరమైన మరియు మతపరమైన తీర్పులకు ప్రధాన
ప్రాతిపదికగా హదీసులను నిస్సందేహంగా
అంగీకరించాలని షఫీ న్యాయవేత్తలు వాదించారు. సారూప్య తార్కికానికి (ఖియాస్) ఖురాన్ లేదా హదీసులలో స్పష్టమైన
ఆదేశాలు కనిపించనప్పుడు. పండితుల లేదా సంఘం (ఇజ్మా)యొక్క ఏకాభిప్రాయం ఆమోదించబడుతుంది కానీ అది తప్పనిసరి అని నొక్కి చెప్పబడలేదు.
షఫీ న్యాయ పాఠశాల తూర్పు ఆఫ్రికా, అరేబియాలోని కొన్ని ప్రాంతాలు మరియు ఇండోనేషియాలో అలాగే కుర్దులలో ఎక్కువగా ప్రచారం లో ఉంది.
No comments:
Post a Comment