చైనాలోని గ్వాంగ్‌జౌలోని
హుయిషెంగ్ మసీదు
సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ Saʿd ibn Abī Waqqāṣ (అరబిక్ లో سعد بن أبي وقاص), ను సాద్ ఇబ్న్ మాలిక్ అని కూడా పిలుస్తారు. సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ మక్కా, హేజాజ్,అరేబియా లో 595 లో జన్మించాడు.
సాద్ ఇబ్న్ అబీ
వక్కాస్, ప్రవక్త ముహమ్మద్
(స)సహచరులలో ఒకరు, సాసానియన్
పర్షియాను సైనిక విజేత మరియు కుఫా స్థాపకుడు.సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ఇస్లాం మతాన్ని
స్వీకరించిన ఏడవ వ్యక్తి,
సాద్ ఇబ్న్ అబీ
వక్కాస్ పదిహేడేళ్ల వయస్సులో ఇస్లాం స్వీకరించాడు.సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ మదీనాలో ఉన్న సమయంలో
ముహమ్మద్(స) ఆధ్వర్యంలో జరిగిన అన్ని యుద్ధాల్లో పాల్గొన్నారు.
సున్నీ చరిత్రకారులు
మరియు పండితులు సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ను గౌరవనీయ వ్యక్తిగా భావించారు.
చైనీస్ ముస్లింల సంప్రదాయాల ప్రకారం సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ 651లో చైనాకు ఇస్లాంను పరిచయం చేసాడు..
లెగసె:
సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ఆసియాలో
పర్యటించారని అంటారు. చైనా యొక్క ఇస్లామిక్ సంప్రదాయంపై సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ప్రభావం
చూపారు.
చైనాలోని గ్వాంగ్‌జౌలోని
హుయిషెంగ్ మసీదును సాద్ ఇబ్న్ అబీ వక్కాస్
నిర్మించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
చైనాకు ఇస్లాంను పరిచయం
చేసినందుకు సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ హుయ్ ముస్లింలచే ఘనత పొందారు. హుయ్ ముస్లిం
సంప్రదాయం ప్రకారం, 650లో టాంగ్
చక్రవర్తి గాజోంగ్ పాలనలో సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ చైనాకు రాయబారిగా వచ్చాడు.
సాద్ ఇబ్న్ అబీ వక్కాస్
అబిస్సినియా నుండి చైనాకు మారిన తర్వాత 616 ADలో చైనాకు ఇస్లాంను పరిచయం చేసిన ఘనత సాధించాడు.
సాద్ ఇబ్న్ అబీ వక్కాస్
చైనాను సందర్శించారనే వాదనలు పండితుల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఇస్లామిక్
చరిత్రకారుడు తబరీ, పర్షియా, ఇథియోపియా మరియు ఇతర ప్రాంతాలకు రాయబారుల గురించి వ్రాసాడు, కానీ చైనా
గురించి ప్రస్తావించలేదు.
సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ 674 (వయస్సు 78–79)లో మదీనా, హెజాజ్ లో మరణించినాడు.
చైనాలోని ప్రసిద్ధ
గ్వాంగ్‌జౌ సమాధితో పాటు సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ సమాధి ఉంది.
మదీనాలో కూడా ఒకటి ఉంది.
చైనీస్ ముస్లింల
సాంస్కృతిక వారసత్వంలో సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ఒక ముఖ్యమైన వ్యక్తి, ప్రత్యేకించి
స్థానిక ముస్లింలు సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ కి ఆపాదించిన మసీదులు మరియు సమాధులు.
మధ్య ఆసియాలో, సాద్ ఇబ్న్ అబీ
వక్కాస్ పేరు తరచుగా "సాదుకాస్" (సద్వాకాస్) అని పిలవబడుతుంది. ఇది మధ్య
ఆసియాలోని సంచార ప్రజలలో చాలా సాధారణ పేరు.
No comments:
Post a Comment